Mouni Roy Gay: నన్ను ‘గే’ అన్నారు.. భర్తతో విడిపోయాక రూమర్లపై మౌనీ రాయ్ బోల్డ్ కామెంట్లు.. దిశా పటానీతో రిలేషన్ షిప్!
Mouni Roy Gay: భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోయిన తర్వాత తనపై వస్తున్న ట్రోల్స్, రూమర్లపై బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మౌనీ రాయ్ తొలిసారి స్పందించింది. తన లైంగిక స్వభావం (సెక్సువల్ ఓరియంటేషన్) గురించి ఆమె ఓపెన్ అయింది. ఆమె చేసిన బోల్డ్ కామెంట్లు వైరల్ గా మారాయి.
Mouni Roy Gay: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లు, ట్రోల్స్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన కొన్ని వారాలకే ఆమె తన వ్యక్తిగత విషయాలపై నోరు విప్పింది. తన సెక్సువల్ ఓరియంటేషన్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బోల్డ్ కామెంట్లు చేసింది.

గే అని ప్రచారం
హీరోయిన్ మౌనీ రాయ్ తాజాగా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. తానొక ‘గే’ (స్వలింగ సంపర్కురాలు) అంటూ కొందరు ప్రచారం చేశారని మౌనీ రాయ్ వెల్లడించింది.
ఇటీవల మోనికా శర్మ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనీ రాయ్ పాల్గొంది. ఈ సందర్భంగా బాలీవుడ్‌లో తన గురించి విన్న అతిపెద్ద రూమర్ ఏంటి అని యాంకర్ అడగ్గా.. మౌనీ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. "ఓ.. నేను గే అనేదే నాపై వచ్చిన అత్యంత విచిత్రమైన రూమర్" అని ఆమె చెప్పింది.
అండగా ఫ్రెండ్స్
భర్తతో విడిపోయిన తర్వాత ఎదురైన క్లిష్ట పరిస్థితులను, మానసిక సంఘర్షణను మౌనీ రాయ్ ఈ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తనకు లభించిన మద్దతు గురించి చెబుతూ.. "నా కుటుంబం, స్నేహితులు నా వెనుక ఒక కొండలా నిలబడ్డారు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని" అని వివరించింది.
గర్ల్ ఫ్రెండ్స్
తన జీవితంలోని అప్ అండ్ డౌన్స్ లో మహిళా స్నేహితులు (గర్ల్‌ఫ్రెండ్స్) కీలక పాత్ర పోషించారని 40 ఏళ్ల మౌనీ రాయ్ పేర్కొంది. "నాకు ఎల్లప్పుడూ మంచి ఫ్రెండ్స్ తోడుగా ఉన్నారు. నా జీవితంలో మంచి, చెడు, అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వారు నన్ను వదిలిపెట్టలేదు. మనల్ని పైకి లేపేలా ప్రోత్సహించే మహిళలు జీవితంలో ఉండటం చాలా ముఖ్యం. నా గర్ల్‌ఫ్రెండ్స్ ప్రపంచంలోనే బెస్ట్" అని మౌనీ రాయ్ సంతోషం వ్యక్తం చేసింది.
దిశా పటానీతో రిలేషన్ షిప్
ఇండస్ట్రీలో మౌనీ రాయ్ కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే.. ముందు దిశా పటానీ పేరు వినిపిస్తుంది. ఈ ఇద్దరు తరచుగా వెకేషన్లకు వెళ్తుంటారు. ఇన్ స్టాలో క్లోజ్ గా ఉన్న పిక్స్ షేర్ చేస్తుంటారు. దీంతో దిశా పటానీ, మౌనీ రాయ్ రిలేషన్ షిప్ ను తప్పుగా అర్థం చేసుకుంటూ ట్రోల్స్ వచ్చాయి. వీళ్లు లెస్బియన్స్ అని, అందుకే మౌనీ రాయ్ తన భర్తను వదిలేసిందనే దారుణమైన పుకార్లు వినిపించాయి.
విడాకులు
నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్న మౌనీ రాయ్, సూరజ్ నంబియార్‌లు 2022లో వివాహం చేసుకున్నారు. అయితే వీరి బంధం ఎంతో కాలం నిలవలేదు. మనస్పర్థల కారణంగా 2026లో ఈ దంపతులు విడిపోయారు. తాము విడిపోతున్నట్లు మౌనీ, సూరజ్ ఇద్దరూ అధికారిక ప్రకటనలు విడుదల చేసినప్పటికీ, వారి విడాకులకు సంబంధించి ఇంటర్నెట్‌లో రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
కెరీర్ విషయానికి వస్తే, మౌనీ రాయ్ ఇటీవల ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (2026) చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించింది.
People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: నటి మౌనీ రాయ్ భర్త ఎవరు, వారు ఎప్పుడు విడిపోయారు?
జవాబు: మౌనీ రాయ్ 2022లో వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల పరిచయం తర్వాత పెళ్లి చేసుకున్న ఈ జంట 2026లో విడిపోతున్నట్లు ప్రకటించారు.
ప్రశ్న: తనపై వచ్చిన ఏ రూమర్‌ను మౌనీ రాయ్ తిప్పికొట్టింది?
జవాబు: భర్తతో విడిపోయిన తర్వాత తాను 'గే' అనే రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసిందని, తన జీవితంలో విన్న అత్యంత హాస్యాస్పదమైన అబద్ధం ఇదేనని మౌనీ రాయ్ స్పష్టం చేసింది.
ప్రశ్న: మౌనీ రాయ్ ఇటీవల నటించిన సినిమా ఏది?
జవాబు: మౌనీ రాయ్ ఇటీవల డైరెక్టర్ డేవిడ్ ధావన్ తెరకెక్కించిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (2026) బాలీవుడ్ సినిమాలో నటించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


