Today OTT: స్పై ఏజెంట్‌గా గే క‌పుల్ కొడుకు.. ఇవాళ ఓటీటీలోకి వ‌చ్చేసిన కామెడీ థ్రిల్ల‌ర్‌.. అమీర్ ఖాన్ ప్రొడ్యూస‌ర్‌

Today OTT: ఇవాళ ఓటీటీలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ వచ్చేసింది. ఇద్దరు గే కపుల్స్ దత్తత తీసుకున్న కొడుకు కథే ఇది. ఇందులో వచ్చి ట్విస్ట్ లు సూపర్ గా ఉంటాయి. 

Published on: Apr 1, 2026, 09:14:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ క్యూ కడుతూనే ఉన్నాయి. ఈ రోజు అలాంటి విభిన్నమైన స్టోరీ లైన్ తో తెరకెక్కిన హిందీ సినిమా ‘హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్’ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మించాడు.

ఓటీటీలోకి స్పై కామెడీ యాక్షన్ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి స్పై కామెడీ యాక్షన్ థ్రిల్లర్ (x)

హ్యాపీ పటేల్ ఓటీటీ

లేటేస్ట్ హిందీ మూవీ ‘హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్’ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ రోజు (ఏప్రిల్ 1) డిజిటల్ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి కేవలం హిందీలోనే ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.

అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్

హ్యాపీ పటేల్ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మించాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. దీనికి వీర్ దాస్, కవి శాస్త్రి డైరెక్టర్లు. ఇందులో వీర్ దాస్, మిథిలా పాల్కర్, మోనా సింగ్, షరీబ్ హష్మీ, ఇమ్రాన్ ఖాన్ తదితరులు నటించాడు. పదేళ్ల తర్వాత ఇమ్రాన్ ఖాన్ చేసిన సినిమా ఇది. ఇందులో అమీర్ ఖాన్ ఓ క్యామియో ప్లే చేశాడు.

రెండు నెలల తర్వాత

హ్యాపీ పటేల్ మూవీ రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ స్పై థ్రిల్లర్ కామెడీ యాక్షన్ మూవీ జనవరి 16, 2026న థియేటర్లలో రిలీజైంది. థియేటర్లో ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు రెండు నెలల తర్వాత ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ హ్యాపీ పటేల్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

హ్యాపీ పటేల్ స్టోరీ

ఇద్దరు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్లు ఉంటారు. వీళ్లు స్వలింగ సంపర్కులు (గే). ఈ కపుల్ కలిసి ఓ పిల్లాడిని దత్తత తీసుకుంటారు. అతనే హ్యాపీ పటేల్ (వీర్ దాస్). అతను కూడా తన తండ్రుల్లాగే స్పై ఏజెంట్ కావాలని అనుకుంటాడు.

ఎంఐ7 అనే స్పై ఎజెన్సీలో చేరతాడు. కానీ అక్కడ ఫెయిల్ అవుతాడు. అయితే తాను భారత సంతతికి చెందిన వాడిని అని హ్యాపీ పటేల్ తెలుసుకుంటాడు. అదే సమయంలో గోవాలో ఓ మిషన్ కోసం అతణ్ని పంపిస్తారు. మామా (మోనా సింగ్) ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ ఫార్ములాను తయారు చేయాలనుకుంటుంది.

ఆ కంపెనీలో ఓ బ్రిటీష్ అమ్మాయిని బలవంతంగా పని చేయిస్తుంటారు. ఆమెను కాపాడటం కోసం హ్యాపీ పటేల్ గోవాకు వస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? గోవాలో పటేల్ ఏం చేశాడు? అన్నది హ్యాపీ పటేల్ సినిమాలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More