Kamal Haasan: సినిమా చరిత్రలో సగానికిపైగా నేనున్నా.. 67 ఏళ్లలో నేర్చుకున్నది 20 ఏళ్లే.. నేను కూడా జెన్ జీ: కమల్ హాసన్

Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 67 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. అందులో తనను తాను ఓల్డెస్ట్ జెన్ జీగా అభివర్ణించుకోవడం విశేషం. ఆ పోస్టులో ఇంకా ఏం రాశారో చూడండి.

Published on: Aug 13, 2026, 21:23:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kamal Haasan: ఇండియన్ సినిమా హిస్టరీలో 'లోకనాయకుడు'గా నీరాజనాలు అందుకుంటున్న వర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ తన 67 ఏళ్ల సినీ సుదీర్ఘ ప్రయాణంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "సినిమా ఇండస్ట్రీలో నేనే అత్యంత పెద్ద వయస్కుడైన జెన్ జీ (Gen Z) కావచ్చు" అని వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘ పోస్ట్ ప్రస్తుతం గ్లోబల్ వైడ్‌గా వైరల్ అవుతోంది.

Kamal Haasan: సినిమా చరిత్రలో సగానికిపైగా నేనున్నా.. 67 ఏళ్లలో నేర్చుకున్నది 20 ఏళ్లే.. నేను కూడా జెన్ జీ: కమల్ హాసన్ (AFP)
Kamal Haasan: సినిమా చరిత్రలో సగానికిపైగా నేనున్నా.. 67 ఏళ్లలో నేర్చుకున్నది 20 ఏళ్లే.. నేను కూడా జెన్ జీ: కమల్ హాసన్ (AFP)

బాల నటుడిగా పరిచయమై..

1960లో 'కళత్తూర్ కణ్ణమ్మ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైన కమల్ హాసన్, నాటి నుంచి నేటి వరకు నటుడిగా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా సరికొత్త బెంచ్‌మార్క్స్ క్రియేట్ చేశారు. భారతీయ సినిమా చరిత్రలో అనేక భాషల్లో నటిస్తూ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.

1895 డిసెంబర్‌లో లూమియర్ బ్రదర్స్ ప్రపంచంలోనే తొలిసారిగా మూవీ స్క్రీనింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సినిమా రంగానికి దాదాపు 130 ఏళ్ల 8 నెలల చరిత్ర ఉంది. అందులో సగానికి పైగా అంటే ఏకంగా 67 ఏళ్లు తన జీవితాన్ని సినిమా కోసమే అంకితం చేశానని కమల్ హాసన్ గుర్తుచేసుకున్నారు.

"20 ఏళ్లే నేర్చుకున్నది.. మిగిలినదంతా డ్రైనేజీ వాటర్ ప్రవాహమే"

తన కెరీర్‌పై అత్యంత నిజాయితీగా స్పందించిన కమల్ హాసన్.. "నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. అయితే ఈ 67 ఏళ్లలో కేవలం 20 ఏళ్లను మాత్రమే నేను నిజమైన అభ్యాసంగా లేదా నేర్చుకున్న కాలంగా భావిస్తున్నాను. మిగిలిన కాలమంతా వ్యర్థమైన మురుగునీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లే అయింది" అని రాసుకొచ్చారు.

కాలువ ఎంత నల్లగా, చీకటిగా మారినా.. చివరికి అది కలవాల్సిన సముద్రం ఒక్కటేనని పేర్కొన్నారు. ఆ అనంతమైన సముద్రమే సినిమా ప్రపంచమని, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఆడియన్స్ అందరం ఆ ప్రవాహంలోకే ప్రయాణిస్తున్నామని కమల్ చాలా లోతైన ఫిలాసఫీని పంచుకున్నారు.

ఏఐ నేర్చుకోవడానికి యూఎస్ ప్రయాణం

కేవలం నటనతోనే ఆగిపోకుండా లేటెస్ట్ టెక్నాలజీని నేర్చుకోవడంలో కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. 2024లో ఆయన అమెరికా వెళ్లి 90 రోజుల పాటు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సులో చేరడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. పని ఒత్తిడి వల్ల 45 రోజులు మాత్రమే ఆ తరగతులకు హాజరైనట్లు ఆయన గతంలో వెల్లడించారు.

"AI అనేది మన అందరి పరిధిని మించిన ఒక అద్భుతమైన టెక్నాలజీ. దాన్ని సరైన అవగాహన లేకుండా ముట్టుకోకూడదు. సినిమా విజువల్స్ విషయంలో ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్తులో మన కంప్యూటర్ల లాగే AI కూడా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమవుతుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

కమల్ హాసన్ క్రేజీ లైనప్.. కల్కి 2 సహా వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్

మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ మూవీ 'థగ్ లైఫ్' (2025) తర్వాత కమల్ హాసన్ చేతిలో వరుస బ్లాక్‌బస్టర్ లైనప్స్ ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్ లో ఒక అద్భుతమైన మల్టీస్టారర్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ధర్మన్ అనే టైటిల్ కూడా పెట్టారు.

దీంతో పాటు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లు సాధించడమే కాకుండా రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్న ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్ (Kalki 2) లోనూ సుప్రీమ్ యాస్కిన్‌గా కమల్ హాసన్ నటించబోతున్నారు. అలాగే ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ డైరెక్షన్‌లోనూ ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More