Sai Pallavi Vijay: మణిరత్నం సినిమా నుంచి లీకైన సాయి పల్లవి విజయ్ సేతుపతి షూటింగ్ పిక్స్- అచ్చం త్రిష 96 మూవీలా ఉందే!

Sai Pallavi Vijay Sethupathi Photos Leaked: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తాజా చిత్రం షూటింగ్‌ను కోల్‌కతాలో శరవేగంగా జరుపుతున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ నుంచి విజయ్ సేతుపతి, సాయిపల్లవిల ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో వెంటనే ఆ ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్‌తో హైప్ క్రియేట్ చేస్తున్నారు.

Published on: Jul 26, 2026, 19:58:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sai Pallavi Vijay Sethupathi Photos Leaked: ఇండియన్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం మళ్లీ తనదైన శైలి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ తాజా చిత్రం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది.

మణిరత్నం సినిమా నుంచి లీకైన సాయి పల్లవి విజయ్ సేతుపతి షూటింగ్ పిక్స్- అచ్చం త్రిష 96 మూవీలా ఉందే!
మణిరత్నం సినిమా నుంచి లీకైన సాయి పల్లవి విజయ్ సేతుపతి షూటింగ్ పిక్స్- అచ్చం త్రిష 96 మూవీలా ఉందే!

లీకైన సాయి పల్లవి విజయ్ సేతుపతి ఫొటోలు

అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సీన్స్, పాట చిత్రీకరణ దృశ్యాలు ఆదివారం (జూలై 26) సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. మణిరత్నం సినిమా షూటింగ్ నుంచి లీకైన సాయి పల్లవి విజయ్ సేతుపతి ఫొటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

హౌరా బ్రిడ్జిపై లవ్ సాంగ్.. క్లీన్ షేవ్ లుక్‌లో సేతుపతి

కోల్‌కతాలోని చారిత్రాత్మక హౌరా బ్రిడ్జిపై మణిరత్నం బృందం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఒక పాటను చిత్రీకరించినట్లు తెలిసింది. లీకైన ఫొటోలలో విజయ్ సేతుపతి క్లీన్ షేవ్ లుక్‌తో నల్లటి టీషర్ట్, జీన్స్, వైట్ స్నీకర్లలో చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు.

గోధుమ రంగు డ్రెస్సులో సాయి పల్లవి

ఇక సాయి పల్లవి గోధుమ రంగు (బ్రౌన్) డ్రెస్, లూజ్ హెయిర్‌తో ఎంతో సహజంగా ఆకట్టుకుంటోంది. వీరిద్దరి కాంబినేషన్ చూస్తుంటే ఒక హృద్యమైన ప్రేమకావ్యాన్ని మణిరత్నం ఆవిష్కరిస్తున్నారని తెలుస్తోంది. "మణిరత్నం మళ్లీ ఒక అద్భుతమైన ప్రేమకథతో రీ-ఎంట్రీ ఇవ్వడమే మేము కోరుకుంటున్నాం" అని ఈ లీకైన ఫొటోలు చూసి నెటిజన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

'శ్యామ్ సింగ రాయ్' జ్ఞాపకాలు!

ఈ ఫొటోలను చూసిన తెలుగు ప్రేక్షకులు సాయిపల్లవి నటించిన 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ సినిమాలో కోల్‌కతా నేపథ్యంలో సాయిపల్లవి నటన అందరినీ కట్టిపడేసింది. మళ్లీ అదే నగరంలో ఆమెను చూడటంతో అభిమానులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.

త్రిషతో నటించిన బ్లాక్ బస్టర్ హిట్

మరొకవైపు విజయ్ సేతుపతి లుక్ చూస్తుంటే ఆయన త్రిషతో నటించి బ్లాక్‌ బస్టర్ హిట్ కొట్టిన '96' సినిమాను, అలాగే మణిరత్నం క్లాసిక్ 'ఓకే బంగారం'ను గుర్తుచేస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తక్కువ బడ్జెట్‌తో

కాగా కమల్ హాసన్‌తో మణిరత్నం తీసిన 'థగ్ లైఫ్' (2025) రూ. 200-300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల లోపే రాబట్టడంతో, ఈసారి మణిరత్నం తక్కువ బడ్జెట్‌లో బలమైన ఎమోషన్లతో కూడిన ప్రేమకథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఏఆర్ రెహమాన్ సంగీతం.. భారీ అంచనాలు

ఈ ఏడాది మార్చిలో అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం తన సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్‌పై నిర్మిస్తున్నారు. ప్రసిద్ధ ఆడియో సంస్థ సోనీ మ్యూజిక్ సౌత్ ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తుండటంతో సంగీత ప్రియుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి.

విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఇతర సినిమాలు

ప్రస్తుతం విజయ్ సేతుపతి 'జైలర్ 2', 'ట్రైన్', 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్' వంటి భారీ ప్రాజెక్టులలో నటిస్తుండగా.. సాయి పల్లవి హిందీ చిత్రం 'రామాయణ' సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు అత్యుత్తమ నటులను మణిరత్నం ఎలా వెండితెరపై ఆవిష్కరిస్తారో చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More