Sai Pallavi: నా ఆలోచనలను పవిత్రంగా, నిష్కల్మషంగా ఉంచాను, నా ద్వారా నువ్వే నటించు అని వేడుకున్నా.. సాయి పల్లవి కామెంట్స్

Sai Pallavi About Sita Role In Ramayana Movie: తన ఆలోచనలను పవిత్రంగా, నిష్కల్మషంగా ఉంచుకునేందుకు స్టార్ హీరోయిన్ సాయి పల్లవి తాజాగా చెప్పుకొచ్చారు. దిల్లీలో ఘనంగా ప్రారంభమైన నితీష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ ప్రథమ సంకల్పం' ప్రమోషన్ వేడుకలో సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jul 19, 2026, 06:24:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sai Pallavi About Sita Role In Ramayana Movie: భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న దృశ్యకావ్యం 'రామాయణ: పార్ట్ 1'. దిల్లీలో శనివారం (జూలై 18) నిర్వహించిన 'ప్రథమ సంకల్పం' వేడుకతో ఈ రామాయణ సినిమా ప్రమోషన్లను చిత్రబృందం అధికారికంగా ప్రారంభించింది.

నా ఆలోచనలను పవిత్రంగా, నిష్కల్మషంగా ఉంచాను, నా ద్వారా నువ్వే నటించు అని వేడుకున్నా.. సాయి పల్లవి కామెంట్స్
నా ఆలోచనలను పవిత్రంగా, నిష్కల్మషంగా ఉంచాను, నా ద్వారా నువ్వే నటించు అని వేడుకున్నా.. సాయి పల్లవి కామెంట్స్

సాయి పల్లవి కామెంట్స్

వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ఆధ్యాత్మిక వేత్తలు హాజరయ్యారు. ఈ వేదికపై సీతమ్మ పాత్రధారి, టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

తెలుగు చిత్ర పరిశ్రమలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అసాధారణమైనది. కేవలం గ్లామర్ కాకుండా, అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఆమె 'లేడీ పవర్ స్టార్'గా ఎదిగారు. మన సంస్కృతిలో సీతమ్మ పాత్రకు తెలుగు ప్రేక్షకులు ఇచ్చే గౌరవం అపారం.

గతంలో దర్శక దిగ్గజం బాపు తీసిన పురాణ చిత్రాల్లోని హీరోయిన్లను తెలుగు ఆడియెన్స్ దైవసమానంగా భావించారు. ఇప్పుడు అలాంటి పవిత్రమైన పాత్రలో సాయి పల్లవి నటిస్తుండటంతో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ధ్యానం చేసి సీతమ్మ పాత్రలో ఒదిగిపోయా!

ఈ మహా ఇతిహాసంలో సీతమ్మ లాంటి మహోన్నత పాత్రను పోషించడంపై సాయి పల్లవి తన మనసులోని మాటను పంచుకున్నారు. "నటీనటులకు ఇలాంటి గొప్ప పాత్రలు దక్కడం అంత సులువు కాదు. ఒక దేవత పాత్రలో జీవించడం చాలా కష్టమైన విషయం. చిత్రబృందం మొత్తం తమ ప్రాణం పెట్టి ఈ సినిమాను ఉత్తమంగా తీర్చిదిద్దుతోంది" అని సాయి పల్లవి పేర్కొన్నారు.

తాను ఈ పాత్రను వెతుక్కుంటూ వెళ్లలేదని, ఆ సీతమ్మే తనను ఆశీర్వదించిందని సాయి పల్లవి భావోద్వేగానికి లోనయ్యారు. "నేను సీతమ్మ పాత్ర చేయాలని ముందే ప్రణాళికలు వేసుకోలేదు. షూటింగ్ సమయంలో నేను ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకునేదాన్ని. 'సీతమ్మ.. నా ద్వారా నువ్వే ఈ పాత్రలో నటించు. నా నుంచి ఎలాంటి హావభావాలు వ్యక్తమవ్వాలో నువ్వే నిర్ణయించు' అని మనస్ఫూర్తిగా వేడుకునేదాన్ని. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు నా ఆలోచనలను ఎంతో పవిత్రంగా, నిష్కల్మషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాను" అని సాయి పల్లవి రామాయణ షూటింగ్ జ్ఞాపకాలను వివరించారు.

రణ్‌బీర్ కళ్లల్లో రాముడు.. సాయి పల్లవిలో సీత!

ఈ చిత్రంలో రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్, సీతగా నటిస్తున్న సాయి పల్లవి దర్శకుడు నితీష్ తివారీ జోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. వీరిద్దరి నటన సినిమాకు ప్రాణమని కొనియాడారు.

"నటీనటుల కళ్లు ఎప్పుడూ నిజాలనే చెబుతాయి. రణ్‌బీర్ కళ్లల్లో నాకు శ్రీరాముడు, సాయి పల్లవి కళ్లల్లో సీతమ్మ కనిపించారు. ఈ పాత్రలకు కావాల్సిన నిజాయితీ, పవిత్రత నాకు ఈ ఇద్దరిలోనే దొరికాయి. ఇప్పుడు స్క్రీన్‌పై నాకు రణ్‌బీర్, సాయి పల్లవి కనిపించడం లేదు.. కేవలం రాముడు, సీత మాత్రమే కనిపిస్తున్నారు" అని దర్శకుడు నితీష్ తివారీ సగర్వంగా చెప్పుకొచ్చారు.

దీపావళి కానుకగా 'రామాయణ' రిలీజ్

నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ యశ్ 'రావణాసురుడిగా' నటిస్తుండటం విశేషం. లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తుండగా.. సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్, వివేక్ ఒబేరాయ్ ఇతర కీలక పాత్రల్లో మెరవనున్నారు.

రామాయణ పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ డేట్

ఈ చిత్ర మొదటి భాగాన్ని 2026 దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండో భాగం 2027 దీపావళికి రానుంది. ఈ దిల్లీ వేడుకలోనే రామాయణ సినిమా అధికారిక ట్రైలర్‌ను కూడా ప్రదర్శించారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం జూలై 24న ఈ ట్రైలర్‌ను డిజిటల్ వేదికలపై గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More