నాకు బాపు గారి సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది, ఈ మూవీతో కోరిక తీరిన ఫీలింగ్ కలిగింది.. ఆర్‌పీ పట్నాయక్ కామెంట్స్
త్రినాధ్ కటారి హీరోగా, స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవంచ హీరోయిన్‌గా చేసిన ఇట్లు మీ ఎదవ ట్రైలర్‌ను నిన్న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇట్లు మీ ఎదవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పీ పట్నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తెలుగులో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న సరికొత్త సినిమా ఇట్లు మీ ఎదవ. వెయ్యేళ్లు వర్ధిళ్లు అనేది సినిమా ట్యాగ్‌లైన్. త్రినాధ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వం వహించారు. సాహితీ అవంచ హీరోయిన్‌గా చేసిన ఇట్లు మీ ఎదవ ట్రైలర్ రిలీజ్ నిన్న (అక్టోబర్ 31) జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇట్లు మీ ఎదవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆ అవకాశం లేకుండా పోయింది
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పీ పట్నాయక్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సినిమా కథ విన్నాను. నాకు బాపు గారి సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుందని ఫీలింగ్ వచ్చింది. త్రినాధ్ డెడికేటెడ్‌గా ప్యాషనేటెడ్‌గా ఈ సినిమాకి పనిచేశారు. ఈ సినిమాకి టైటిల్ సూచించింది కూడా నేనే" అని అన్నారు.
"కథ విన్నప్పుడే హిట్ వైబ్ వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్ మరొకటి లేదనిపించింది. ఇది యూత్ అందరికీ తెగ నచ్చుతుంది. యూత్ వాళ్ల పేరెంట్స్‌ని కూడా తీసుకెళ్లి చూపించే సినిమా అవుతుంది. సినిమా క్లైమాక్స్‌లో మీరు ఊహించని అద్భుతమైన కంటెంట్ ఉంటుంది" అని ఆర్‌పీ పట్నాయక్ తెలిపారు.
అద్భుతమైన వర్క్ ఇచ్చారు
"నటీనటులందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో చాలా ఎంజాయ్ చేశాను . టెక్నీషియన్స్ అందరూ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది" అని ఆర్‌పీ పట్నాయక్ పేర్కొన్నారు.
రిషి మాట్లాడుతూ.. "సినిమా చూశాను .చాలా అద్భుతంగా ఉంది. ఆర్పీ పట్నాయక్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది ఒక ఎక్స్‌పీరియెన్స్ ఫిలిం మేకర్ చేసిన సినిమా లాగా ఉంటుంది. పర్ఫామెన్స్ చాలా బాగుంటుంది. విజువల్స్ అద్భుతంగా వచ్చాయి" అని అన్నారు.
ఫ్యామిలీ అంతా కూర్చుని
"శ్రీధర్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమా ఇది. అందరూ కచ్చితంగా చూడండి" అని రిషి తెలిపారు.
యాక్టర్ గోపరాజు రమణ మాట్లాడుతూ.. "ఇది చాలా క్యాచీ టైటిల్. నిత్యం అందరూ వాడే టైటిల్. చాలా మంచి కథ. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. తను చాలా ప్రతిభావంతుడు తప్పకుండా ఆయనకు మంచి పేరు తీసుకొస్తుంది. అందరు కూడా చాలా అద్భుతంగా చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని ఆకట్టుకుంటుంది" అని వెల్లడించారు.
హీరో క్యారెక్టర్‌తో
డీవోపీ జగదీష్ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో చాలా అద్భుతమైన జర్నీ ఉంటుంది. ఇందులో హీరో క్యారెక్టర్‌తో అందరూ రిలేట్ అవుతారు. డెఫినెట్‌గా ఈ సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది" అని అన్నారు.
మధుమణి మాట్లాడుతూ.. "చాలా అద్భుతమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో ప్రతి సీన్ చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా తప్పకుండా అందరూ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది" అని చెప్పారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


