మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్.. మ్యూజిక్ ఆల్బమ్‌లో ఛాన్స్ ఇస్తానని చెప్పి లైంగిక వేధింపులు
బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సచిన్ సాంగ్వి పోలీసులు అరెస్ట్ చేశారు. తన రాబోయే మ్యూజిక్ ఆల్బమ్ లో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలను అతడు ఎదుర్కొంటున్నాడు.
బాలీవుడ్ గాయకుడు, సంగీత దర్శకుడు సచిన్ సాంగ్వి (సచిన్-జిగర్ ద్వయంలో ఒకరు) ఒక మహిళను లైంగికంగా వేధించిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. ఒక మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని పోలీసులు శుక్రవారం(అక్టోబర్ 24) తెలిపారు. నిజానికి గురువారమే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

సచిన్‌పై ఉన్న ఆరోపణలు ఇవీ..
బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో సచిన్ సాంగ్వి ఒకడు. సచిన్, జిగర్ ద్వయం ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, అరెస్ట్ కావడం సంచలనం సృష్టిస్తోంది. అసలు అతనిపై వచ్చిన ఫిర్యాదులో ఏముంది? అతని లాయర్ ఆ ఆరోపణలకు ఎలా స్పందించారు అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఫిర్యాదు చేసింది ఓ 20 ఏళ్ల అమ్మాయి. గతేడాది ఫిబ్రవరిలో సచిన్ ఆమెను సంప్రదించాడని పీటీఐ రిపోర్టు తెలిపింది. సచిన్ ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సందేశం పంపాడు. సచిన్ ఆమెను సంప్రదించి, తన రాబోయే మ్యూజిక్ ఆల్బమ్‌లో ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకున్నారని ఒక పోలీసు అధికారి తెలిపారు.
అంతేకాదు సచిన్ ఆమెను తన మ్యూజిక్ స్టూడియోకు పిలిపించి, అక్కడ పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. సచిన్ ఆమెను చాలాసార్లు లైంగికంగా వేధించాడని కూడా ఆరోపణలు ఉన్నాయి.
సచిన్ లాయర్ స్పందన
ఈ కేసులో సంగీత దర్శకుడు సచిన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న లాయర్ ఆదిత్య మిథే.. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలను ఖండించారు. ప్రెస్‌తో మాట్లాడుతూ మిథే ఇలా అన్నారు.. "నా క్లయింట్‌పై ఎఫ్‌ఐఆర్ లో ఉన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవి. ఈ కేసులో ఎటువంటి నిజాలు లేవు" అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. "పోలీసులు నా క్లయింట్‌ను నిర్బంధించడం చట్టవిరుద్ధం. అందుకే అతన్ని వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. మేము అన్ని ఆరోపణలను పూర్తిగా, నిస్సందేహంగా డిఫెండ్ చేసుకోవాలని అనుకుంటున్నాము" అని తెలిపారు.
ఈ విషయంపై సచిన్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అతని అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా.. @soulfulsachin పేరుతో ఉంది. అది ప్రస్తుతం డీయాక్టివేట్ చేశారు. జిగర్ కూడా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
సచిన్, జిగర్ కలిసి ఈ మధ్యే వచ్చిన థామా మూవీకి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. సచిన్-జిగర్ కంపోజ్ చేసిన స్త్రీ 2 మూవీలోని ఆజ్ కీ రాత్ సాంగ్ గతేడాది పెద్ద సంచలనం సృష్టించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


