Priyanka Chopra: సర్వైవల్ హారర్ థ్రిల్లర్‌గా ప్రియాంక చోప్రా రీసెట్- ఆకర్షణ, అనుమానంతో- నిర్మాతలుగా హీరో హీరోయిన్లు!
Priyanka Chopra Survival Thriller Reset Movie: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. పైరేట్, ది బ్లఫ్ విజయం తర్వాత, ఇప్పుడు ప్రముఖ నటుడు ఓర్లాండో బ్లూమ్‌తో కలిసి 'రీసెట్' అనే సర్వైవల్ థ్రిల్లర్‌లో నటించనున్నారు. ఆకర్షణ, అనుమానంతో సాగే మూవీ ఇది.
Priyanka Chopra Survival Thriller Reset Movie: హాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు సర్వైవల్ థ్రిల్లర్ జోనర్‌ను టచ్ చేస్తున్నారు. ఎమ్మీ అవార్డు గ్రహీత మ్యాట్ స్మక్లర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రీసెట్ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.

అడవి మధ్యలో
నాగరిక ప్రపంచానికి దూరంగా, అడవి మధ్యలో స్పృహలోకి వచ్చిన ఒక మహిళకు.. తను అక్కడికి ఎలా వెళ్లిందో గుర్తుండదు. ఆ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలతో బయటపడాలంటే, అక్కడ కలిసిన ఒక అపరిచితుడిని ఆమె నమ్మాల్సి ఉంటుంది. కానీ, ఆ వ్యక్తి నిజంగా సహాయం చేసేవాడా లేక మరేదైనా కుట్ర ఉందా? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ రీసెట్ సినిమా సాగనుంది.
ప్రియాంక - ఓర్లాండో బ్లూమ్ కెమిస్ట్రీపై అంచనాలు
'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' వంటి భారీ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఓర్లాండో బ్లూమ్ ఈ రీసెట్ చిత్రంలో ప్రియాంకకు జోడీగా నటిస్తున్నారు. ఈ జంట గురించి దర్శకుడు మ్యాట్ స్మక్లర్ మాట్లాడుతూ.. "ఆకర్షణ, అనుమానం రెండూ ఏకకాలంలో కనిపించే జంట కోసం నేను వెతికాను. ప్రియాంక, ఓర్లాండో ఈ పాత్రలకు వంద శాతం న్యాయం చేయగలరని నమ్ముతున్నాను. వారి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది" అని పేర్కొన్నారు.
నిర్మాణ భాగస్వామిగా ప్రియాంక
కేవలం నటిగానే కాకుండా, తన సొంత నిర్మాణ సంస్థ 'పర్పుల్ పెబుల్ పిక్చర్స్' ద్వారా ప్రియాంక చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓర్లాండో బ్లూమ్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంటే, ఈ హీరో హీరోయిన్లు రీసెట్ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అంతర్జాతీయ విక్రయాల కోసం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్కెట్‌లో మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వైవల్, రోమాన్స్, సస్పెన్స్ కలగలిసిన ఈ రీసెట్ కథలో షాకింగ్ ట్విస్టులు ఉంటాయని నిర్మాతలు జోన్, ఎరిక్ హోబెర్ వెల్లడించారు.
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ప్రియాంక హవా
ఇటీవల కాలంలో ప్రియాంక చోప్రా నటించిన 'ది బ్లఫ్', 'హెడ్స్ ఆఫ్ స్టేట్' వంటి చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు వ్యూస్ సాధించాయి. తాజాగా ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' సీజన్-2 కూడా విడుదలై మంచి స్పందన లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో సిటాడెల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
కేవలం హాలీవుడ్‌కే పరిమితం కాకుండా, దాదాపు పదేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి'లో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారణాసి చిత్రం 2027 ఏప్రిల్‌లో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


