Priyanka Chopra: హైదరాబాద్‌లో ప్రియాంక చోప్రా బికినీ ఫొటోలు, కారం చల్లిన మామిడి కాయ ముక్కలు- మగాడిలా ప్రవర్తించంటూ!
Priyanka Chopra Bikini Photos With Mango Pieces: ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి షూటింగ్ కోసం ప్రియాంక చోప్రా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. పని ఒత్తిడి నుంచి విరామం తీసుకుంటూ బికినీలో ప్రియాంక చోప్రా సరదాగా గడిపిన క్షణాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన తెలుగు అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం 'వారణాసి' షూటింగ్ నిమిత్తం ప్రియాంక చోప్రా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. షూటింగ్ షెడ్యూల్స్ మధ్య దొరికిన విరామాన్ని ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీతో కలిసి ఎంతో హాయిగా గడిపారు.

బికినీ షూట్.. మామిడి కాయ ముక్కలు!
సోమవారం (ఏప్రిల్ 6) నాడు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ 'సండే ఫన్'కు సంబంధించిన ఫోటోలను ప్రియాంకజ చోప్రా అభిమానులతో పంచుకున్నారు. వారణాసి హీరోయిన్ షేర్ చేసిన ఫోటోల్లో ప్రియాంక చోప్రా పూల్ సైడ్ రిలాక్స్ అవుతూ కనిపించారు.
"చాలా కాలం తర్వాత ఒక ఆదివారం నిజంగా ఆదివారాలా అనిపించింది" అంటూ ప్రియాంక చోప్రా క్యాప్షన్ ఇచ్చారు. ఒక ఫోటోలో నీలిరంగు బికినీలో ప్రియాంక చోప్రా పోజులివ్వగా, మరో వీడియోలో పచ్చి మామిడి కాయ ముక్కలపై కారం చల్లుకుని తింటూ తనలోని 'దేశీ' గర్ల్‌ను గుర్తుచేశారు.
మగాడిలా ప్రవర్తించు
ఇది చూసిన అభిమానులు "పీసీ తన దేశీ స్నాక్స్‌ను అస్సలు వదలదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సైతం ప్రియాంక ఫోటోలపై స్పందిస్తూ "నిజమైన సూపర్ స్టార్" అని ప్రశంసించారు.
కుటుంబ సభ్యులతో ఉన్న ఇతర ఫోటోల్లో మాల్టీ మేరీ తన నానమ్మ మధు చోప్రాతో ముచ్చటగా కనిపిస్తుండగా, అమెరికాలో ఉన్న నిక్ జోనాస్‌కు వీడియో కాల్ చేసి మాల్టీ పలకరించడం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. షూటింగ్ సెట్‌లో 'మగాడిలా ప్రవర్తించు' (Behave like a man) అని రాసి ఉన్న చాక్ బోర్డ్ వీడియో కూడా ఇందులో ఉండటంతో వారణాసి సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
రాజమౌళి 'వారణాసి' విశేషాలు
'RRR' వంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'వారణాసి'. 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఇందులో మహేశ్ బాబు 'రుద్ర'గా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా 'మందాకిని' పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
అలాగే, మలయాళ స్టార్ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే విలన్ పాత్రను పోషిస్తున్నారు. భారతీయ పురాణాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా సాగే సాహసగాథగా వారణాసి సినిమాను తీర్చిదిద్దుతున్నారు.
ఓటీటీ సినిమాలు, సిరీసులు
2016లో వచ్చిన 'జై గంగాజల్' తర్వాత ప్రియాంక చోప్రా నేరుగా భారతీయ వెండితెరపై కనిపిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇప్పటికే హాలీవుడ్‌లో 'ది బ్లఫ్', 'సిటాడెల్ సీజన్ 2' వంటి భారీ ఓటీటీ సినిమాలు, సిరీసులతో అలరించిన ప్రియాంక చోప్రా ఇప్పుడు రాజమౌళి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


