భర్తతో విడాకుల రూమర్లు.. వారణాసి హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్.. బ్లాస్ట్ కావాలని కోరుకుంటున్నారా? ప్రియాంక చోప్రా ఫైర్
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడిపోతున్నారు.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు.. ఇలా పుకార్లు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనిపై వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా సీరియస్ గానే రియాక్టయింది. మీకు డిస్కషన్ అవసరమా? అంటూ ఇచ్చిపడేసింది. సెన్సేషనల్ కామెంట్లు చేసింది.
వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫైర్ అయింది. తన భర్త నిక్ జోనస్ నుంచి ఆమె విడిపోతుందని, విడాకులు తీసుకుంటుందనే పుకార్లపై సీరియస్ గా రియాక్టయింది. ఇవన్నీ కుట్రతో కూడిన వదంతులు అని ఆమె స్పష్టం చేసింది. తమ పెళ్లి జీవితం బ్లాస్ట్ కావాలని కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రియాంక చోప్రా కామెంట్లు
విడాకుల పుకార్లపై ప్రియాంక చోప్రా స్పందించింది. 'వెరైటీ'తో ప్రియాంక మాట్లాడుతూ.. "మా పెళ్లి బంధం బ్లాస్ట్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఏదేమైనా అది వాళ్ల భ్రమ. మా ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ప్రజలకు ఎందుకు ఇంత ఇబ్బంది కలిగిస్తుందో అర్థం కావడం లేదు’’ అని తెలిపింది.
వేర్వేరు దేశాలు
"మేము ఎనిమిదేళ్లుగా కలిసే ఉంటున్నాం. ప్రజలు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేశా. మా విషయంలో జనాలకు అంత ఇబ్బంది కలిగించింది ఏంటో నాకు అర్థం కావడం లేదు. బహుశా వేర్వేరు దేశాలు, వేర్వేరు మతాలు, వయస్సు తేడా అయి ఉండవచ్చు. నేను, నిక్ కలిసి బయటి విషయాల కంటే కూడా మమ్మల్ని మేం పట్టించుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం’’ అని ప్రియాంక చోప్రా తెలిపింది.
అతనిలో నిజాయతీ
‘‘మా పరిచయం తర్వాత ఆరు నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం. అప్పుడు అది నిజమో కాదో కూడా నాకు తెలియని పరిస్థితుల్లో ఉండిపోయా. అయితే నిక్ లో నిజాయతీ ఉంది. అతను ఎప్పుడూ నిజాయతీగానే ఉంటాడు. అతను చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించాడు. అతని తల్లిదండ్రులు చాలా అద్భుతమైన, స్థిరమైన, నిష్కల్మషమైన వ్యక్తులు. నిక్ కూడా వాళ్ల పేరెంట్స్ లాగే ఉన్నాడు’’ అని ప్రియాంక చోప్రా చెప్పింది.
ప్రియాంక, నిక్ పెళ్లి గురించి
2018లో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ పెళ్లి రాజస్థాన్ లో గ్రాండ్ గా జరిగింది. 2022లో వీళ్లకు పాప మాల్తీ పుట్టింది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి మూవీ చేస్తోంది. ఇందులో మహేష్ బాబు హీరో. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కుంభగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది.
ప్రియాంక చోప్రా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఆమె వెబ్ సిరీస్ సిటాడెల్ రెండో సీజన్ కూడా లైన్ లో ఉంది. ఇక ప్రియాంక చోప్రా సముద్రపు దొంగగా నటించిన ది బ్లఫ్ ఓటీటీలోకి రాబోతుంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక.. ఇప్పుడు వారణాసితో మళ్లీ ఇండియన్ మూవీస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


