మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. హిందూయిజం చాలా అద్భుతంగా ఉంది: వారణాసి హీరోయిన్ ప్రియాంక భర్త నిక్

వారణాసి హీరోయిన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ హిందు ధర్మం, భారతీయ సంస్కృతి గొప్పతనంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తమ కూతురిని కూడా వాళ్లు హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నట్లు వెల్లడించాడు.

Published on: Feb 10, 2026, 14:31:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ భారతీయ సంస్కృతిపై, హిందూ మతంపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. పెళ్లి తర్వాత తన జీవితం ఎలా మారింది? తన కూతురు మాల్తీ మేరీని ఏ విలువలతో పెంచుతున్నారు? వంటి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

మా కూతురిని హిందు ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. హిందూయిజం చాలా అద్భుతంగా ఉంది: వారణాసి హీరోయిన్ ప్రియాంక భర్త నిక్
మా కూతురిని హిందు ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. హిందూయిజం చాలా అద్భుతంగా ఉంది: వారణాసి హీరోయిన్ ప్రియాంక భర్త నిక్

"నా ఫేవరెట్ పండుగలు అన్నీ ఇండియన్ పండుగలే.."

ప్రియాంక చోప్రాతో వివాహం తర్వాత తనకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ మతం ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయని, ఇప్పుడు ఇండియానే తనకు ఇల్లులా అనిపిస్తోందని నిక్ జోనస్ అనడం విశేషం. తాజాగా 'సచ్ సంగ్ షో' (Sach Sang Show)లో పాల్గొన్న అతడు.. హిందూ మతం తన జీవితంలో ఎంత ముఖ్యమో వివరించాడు.

నిక్ మాట్లాడుతూ.. "నాకు ఎప్పుడూ ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం కావాలని కోరిక ఉండేది. ప్రియాంకను పెళ్లి చేసుకున్నాక అది నెరవేరింది. మొదటిసారి ఇండియా వెళ్ళినప్పుడు, అక్కడ ప్రియాంక కుటుంబంతో గడపడం, ఆ సంస్కృతిని దగ్గరగా చూడటం ఒక మ్యాజిక్ లా అనిపించింది. ఇప్పుడు నా ఫేవరెట్ పండుగలు, సంప్రదాయాలన్నీ భారతీయమే. నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలన్నీ ఇండియాతో ముడిపడి ఉన్నాయి" అని నిక్ చెప్పుకొచ్చాడు.

కర్మ, ధర్మ.. హిందూ విలువలపై మక్కువ

హిందూ మతం గురించి మాట్లాడుతూ నిక్ ఎమోషనల్ అయ్యాడు. "నేను హిందూ మతం గురించి చాలా నేర్చుకున్నాను. అది ఎంతో లోతైనది, అందమైనది. ముఖ్యంగా 'కర్మ' సిద్ధాంతం.. అంటే మనం ఇతరులకు మంచి చేస్తే మనకూ మంచే జరుగుతుంది అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అలాగే 'ధర్మ' కూడా చాలా అద్భుతం. అందుకే మా అమ్మాయి (మాల్తీ మేరీ)ని కూడా నిజమైన హిందూ విలువలతోనే పెంచుతున్నాం. ఆమెకు వాటి అర్థం తెలిసేలా చూస్తున్నాం. ఇలాంటి బహుళ సంస్కృతులు, మతాలు ఉన్న కుటుంబం దొరకడం నా అదృష్టం" అని నిక్ వివరించాడు.

ప్రియాంక, నిక్ గురించి..

2018లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం నిక్-ప్రియాంక ఒక్కటైన సంగతి తెలిసిందే. అమెరికాలో ఉన్నప్పటికీ.. దీపావళి, హోలీ, కర్వా చౌత్ వంటి పండుగలను ఈ జంట ఘనంగా జరుపుకుంటారు.

ఇక కెరీర్ పరంగా.. ఐదేళ్ల తర్వాత నిక్ తన సోలో ఆల్బమ్ 'సండే బెస్ట్' (Sunday Best)ను విడుదల చేశాడు. ఈరోజు (ఫిబ్రవరి 10, 2026) ఈ ఆల్బమ్ డీలక్స్ వెర్షన్‌ను కూడా రిలీజ్ చేశాడు. ఇందులో రెండు కొత్త ట్రాక్‌లు ఉన్నాయి. అటు ప్రియాంక ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళితో కలిసి వారణాసి సినిమా చేస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More