మూడున్నర నెలలు ప్రాణాల కోసం పోరాడిన ప్రియాంక చోప్రా కూతురు-పర్పుల్ కలర్‌లోకి మారిపోయిన బాడీ-నిక్ జోనస్ ఎమోషనల్
ప్రస్తుతం వారణాసి షూటింగ్ లో బిజీగా ఉంది హీరోయిన్ ప్రియాంక చోప్రా. నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న ఆమెకు ఓ కూతురు మాల్తీ ఉంది. అయితే ఆమె కూతురు మాల్తీ పుట్టిన తర్వాత మూడున్నర నెలల పాటు ప్రాణాల కోసం పోరాడిందని చెప్తూ నిక్ ఎమోషనల్ అయ్యాడు.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తమ కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ పుట్టినప్పటి రోజులను, హాస్పిటల్ లో ఆమెకు జరిగిన ట్రీట్మెంట్ ను తలుచుకుని నిక్ ఎమోషనల్ అయ్యాడు.

ప్రియాంక చోప్రా కూతురు
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కు ఒక పాప ఉందనే సంగతి తెలిసిందే. 2022లో సరోగసీ ద్వారా మాల్తీ మేరీకి జన్మనిచ్చారు. అయితే పుట్టినప్పుడు మాల్తీ చాలా తక్కువ బరువుతో పుట్టిందని, మూడున్నర నెలల పాటు ఆమెను హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించామని నిక్ జోనస్ వెల్లడించాడు. జే శెట్టి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఇప్పుడు తన కుమార్తె ఎదుగుదలను, ఆమెలోని "మ్యాజిక్"ను చూస్తుంటే తనకు ఎంతో ఆశ్చర్యంగా ఉందని నిక్ చెప్పాడు.
765 గ్రాములే
మాల్తీ మేరీ పుట్టిన తర్వాత తాము అనుభవించిన భావోద్వేగాలను నిక్ పంచుకున్నాడు. "ఆమె (మాల్తీ) చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. నిజానికి ఆమె ఏప్రిల్‌లో పుడుతుందని భావించాం. కానీ అంతకంటే ముందే డెలివరీ అవుతుందని మాకు కాల్ వచ్చింది. మేం హాస్పిటల్ వెళ్లాం. పుట్టినప్పుడు ఆమె బరువు కేవలం 1 పౌండ్ 11 ఔన్సులు (765 గ్రాములు) మాత్రమే. పుట్టినప్పుడు ఆమె శరీరం దాదాపు పర్పుల్ రంగులోకి మారిపోయింది’’ అని నిక్ తెలిపాడు.
12 గంటల షిఫ్టులు
మాల్తీని ఇంటికి తీసుకొచ్చే వరకు నిక్, ప్రియాంక ప్రతిరోజూ ఆసుపత్రిలో చెరో 12 గంటల పాటు షిఫ్టుల వారీగా ఉండేవారని నిక్ వెల్లడించాడు. "అది కోవిడ్ టైమ్. మేం మూడున్నర నెలల పాటు ఆసుపత్రిలోనే గడిపాము. ఇప్పటికీ నాకు ఆ ఆసుపత్రి వాసన గుర్తుంది. అక్కడ ప్రతిరోజూ ఉండటం, మాలాగే మరికొన్ని కుటుంబాలు కూడా అలాంటి పరిస్థితుల్లోనే చూడటం ఒకవైపు భయంగానూ, మరోవైపు ఓదార్పుగానూ ఉండేది’’ అని నిక్ చెప్పాడు.
ఆరు సార్లు
‘‘మాల్తీ ఆ మూడున్నర నెలల పాటు ప్రతిరోజూ ప్రాణాల కోసం పోరాడింది. నెమ్మదిగా బరువు పెరిగింది. ఆరు సార్లు రక్తమార్పిడి (Blood transfusions) జరిగిన తర్వాత ఆమె కోలుకుంది. అలా మూడున్నర నెలల తర్వాత ఆమెను ఇంటికి తీసుకువచ్చాం" అని నిక్ ఎమోషనల్ అయ్యారు.
నిక్ కుటుంబం గురించి
నిక్, ప్రియాంక చోప్రా 2018లో రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు. క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. 2022 జనవరిలో వీరికి మొదటి సంతానంగా మాల్తీ జన్మించింది.
నిక్ జోనాస్ త్వరలో 'పవర్ బల్లాడ్' (Power Ballad) చిత్రంలో పాల్ రడ్డ్‌తో కలిసి కనిపించనున్నాడు. జాన్ కార్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది జూన్ 5న విడుదల కానుంది. మరోవైపు వారణాసిలో ప్రియాంక చోప్రా నటిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


