వారణాసికి ఓకే చెప్పేముందు రాజమౌళికి ప్రియాంక చోప్రా రిక్వెస్ట్ ఇదే.. పాపం బ‌లైపోయిన మ‌హేశ్ బాబు.. మూవీ అప్ డేట్ లీక్

టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఇందులో మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ మూవీకి ఓకే చెప్పేముందు ప్రియాంక డైెరెక్టర్ రాజమౌళికి ఓ రిక్వెస్ట్ చేసింది. దీనివల్ల మహేశ్ బలైపోయాడు. 

Published on: Feb 04, 2026 8:48 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. ఇదో టైమ్ ట్రావెల్, గ్లోబ్ ట్రాటర్ మూవీగా రెడీ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. ఇందులో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏడేళ్ల తర్వాత ప్రియాంక చేస్తున్న ఇండియన్ మూవీ ఇది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వారణాసి మూవీకి ఓకే చెప్పేముందు రాజమౌళిని ఓ రిక్వెస్ట్ చేసినట్లు ప్రియాంక చోప్రా వెల్లడించింది.

ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్
ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్

ప్రియాంక చోప్రా రిక్వెస్ట్

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిన హీరోయిన్ ప్రియాంక చోప్రా ఏడేళ్ల తర్వాత వారణాసితో తిరిగి ఇండియన్ సినిమాల్లోకి రాబోతుంది. ఓ ఇంటర్వ్యూలో వారణాసి మూవీకి ఓకే చెప్పేందుకు డైరెక్టర్ రాజమౌళిని ఓ రిక్వెస్ట్ చేశానని వెల్లడించింది. ఈ సినిమాలో తనతో డ్యాన్స్ చేయించాలని కోరినట్లు ప్రియాంక చోప్రా చెప్పింది. దీంతో మహేశ్ బాబు బలైపోయాడనే కామెంట్లు వస్తున్నాయి.

డ్యాన్స్ చేయిస్తారా?

‘‘‘ఓహ్, ఇది మీకు తెలుసా? ఈ వుమెన్ క్యారెక్టర్ చాలా బాగుంది. మీరు ఈ సినిమా చేయాలి’ అని రాజమౌళి నన్ను అడిగారు. మీరు ఏమైనా చేయండి కానీ నాదో రిక్వెస్ట్. నాతో సినిమాలో డ్యాన్స్ చేయిస్తారా? అని అడిగా. ఎందుకంటే ఇండియన్ సినిమా చేసి చాలా కాలమైంది. డ్యాన్స్ చేసి కూడా చాలా ఏళ్లు అవుతుందని రాజమౌళిని అడిగా’’ అని ప్రియాంక చోప్రా వెల్లడించింది.

మీ కారణంగానే

ఇదే ఇంటర్వ్యూలో ప్రియాంకతో పాటు మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొన్నారు. ప్రియాంక ఈ రిక్వెస్ట్ గురించి చెప్పగానే.. ‘‘ఓహ్.. ఇది మీ కారణంగానే నేను కూడా డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఆ సాంగ్ సెన్సేషనల్ కాబోతుంది. మేం ఇప్పటికే ఆ సాంగ్ షూట్ కంప్లీట్ చేశాం. అది ఇంకా మా మనసుల్లో ప్లే అవుతూనే ఉంది. ప్రియాంక పాడుతూనే ఉంటుంది’’ అని మహేశ్ బాబు తెలిపాడు. దీంతో వారణాసిలో బ్లాక్ బస్టర్ సాంగ్ ఉండబోతుందని లీక్ చేశారని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

ఫ్యాన్స్ రియాక్షన్

వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు కలిసి డ్యాన్స్ చేశారనే విషయం తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. “ప్రియాంక, మహేశ్ బాబు డ్యాన్స్ తో ఇది పర్ఫెక్ట్ మూవీ కానుంది’’ అని ఒక యూజర్ రాసుకొచ్చాడు. ”పాట గురించి ఇంకాస్త మాకు చెప్పండి’’ అని మరో ఫ్యాన్ అడిగాడు. "ఈ సాంగ్ ను చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నా’’ అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.

వారణాసి గురించి..

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న వారణాసి మూవీ ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రుద్రగా మహేశ్ బాబు కనిపించనున్నాడు. అలాగే రాముడి గెటప్ లోనూ దర్శనమివ్వనున్నాడు. ప్రియాంక చోప్రా ఏమో మందాకిని క్యారెక్టర్ చేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ విలన్ కుంభగా నటిస్తున్నాడు. టైమ్ ట్రావెల్ చుట్టూ తిరిగే యాక్షన్ అడ్వెంచర్ మూవీ వారణాసి.