Jailer 2 Accident: రజనీకాంత్ జైలర్ 2 షూటింగ్ సెట్‌లో ప్రమాదం.. విద్యుత్ షాక్‌తో 28 ఏళ్ల కార్మికుడు దుర్మరణం!
Rajinikanth Jailer 2 Accident 28 Years Crew Member Death: సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జైలర్ 2' షూటింగ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నైలోని ఒక ప్రైవేట్ స్టూడియోలో సెట్ నిర్మాణ పనులు జరుగుతుండగా, విద్యుత్ షాక్‌కు గురై 28 ఏళ్ల యువ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.
Rajinikanth Jailer 2 Accident 28 Years Crew Member Death: తమిళనాట మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఉండే క్రేజ్ వేరు. గతేడాది 'జైలర్' సాధించిన 600 కోట్ల రూపాయల భారీ విజయం తర్వాత, ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న 'జైలర్ 2' పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

అయితే, జైలర్ 2 చిత్రం షూటింగ్ దశలోనే వరుసగా ఇబ్బందులు ఎదుర్కోవడం చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది. తాజాగా ఒక యువ కార్మికుడు దుర్మరణం చెందడంతో సెట్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.
అసలేం జరిగింది?
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. జైలర్ 2 షూటింగ్ సెట్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన వ్యక్తిని 28 ఏళ్ల కార్తికేయన్‌గా గుర్తించారు. చెన్నై సమీపంలోని పనైయూర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ స్టూడియోలో 'జైలర్ 2' సినిమా కోసం భారీ సెట్లను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇల్లు లాంటి సెట్‌ను ఆర్ట్ డైరెక్షన్ బృందం సిద్ధం చేస్తోంది.
ఆ సమయంలో విద్యుత్ తీగలు తెగిపోవడంతో కార్తికేయన్‌కు కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే కార్తికేయన్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కనత్తూరు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ షాక్ ఎలా తగిలింది? భద్రతా ప్రమాణాల్లో లోపాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
వరుస చిక్కుల్లో రజనీ సినిమా
నిజానికి 'జైలర్ 2' షూటింగ్ ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. గతేడాది నుంచి ఈ చిత్ర పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ, గత ఏప్రిల్‌లో చిత్ర యూనిట్‌కు పెద్ద షాక్ తగిలింది. సినిమా సెట్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.
సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో చిత్ర నిర్మాణ సంస్థ 'సన్ పిక్చర్స్' తీవ్రంగా స్పందించింది. పైరసీని ప్రోత్సహించే వారిపై, లీక్ చేసిన క్లిప్పులను షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఈ ప్రమాదం జరగడంతో షూటింగ్‌కు తాత్కాలిక విరామం పడే అవకాశం కనిపిస్తోంది.
భారీ తారాగణంతో 'జైలర్ 2'
దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఇందులో రజనీకాంత్ మళ్లీ 'టైగర్' ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనుండగా, ఆయన భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారు. మొదటి భాగంలో కేమియో రోల్స్‌తో మెప్పించిన మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ ఈసారి మరింత నిడివి ఉన్న పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది.
వీరికి తోడు బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా జైలర్ 2లో ఒక కీలక పాత్రలో నటించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాకు మరో పెద్ద ఆకర్షణ కానుంది. ఇదిలా ఉంటే, సినిమా షూటింగ్ సమయంలో కార్మికుల భద్రత అనేది ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
అధికారిక ప్రకటన
కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించే ఇలాంటి భారీ చిత్రాల సెట్స్‌లో చిన్న పొరపాట్లు మునుషుల ప్రాణాల మీదకు వస్తాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కార్తికేయన్ మృతిపై చిత్ర బృందం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


