100 Cr Hero: ఏకంగా 20 సార్లు 100 కోట్లు కొల్లగొట్టిన ఏకైక ఇండియన్ హీరో- ఖాన్స్, రజనీకాంత్, ప్రభాస్, విజయ్‌లను ఓడించి!

Meet Indian Actor Who Get 100 Cr Twenty Times: ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 20 సార్లు రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఏకైక ఇండియన్ హీరోగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు ఈ యాక్షన్ ఖిలాడీ. షారుఖ్, సల్మాన్ వంటి ఖాన్స్‌తోపాటు రజనీకాంత్, ప్రభాస్, విజయ్ దళపతిలను ఓడించి మరి ఈ ఫీట్ సాధించాడు.

Published on: Apr 26, 2026, 17:07:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Meet Indian Hero Who Get 100 Cr Twenty Times: దాదాపు రెండు దశాబ్దాల క్రితం అమీర్ ఖాన్ నటించిన 'గజిని' సినిమాతో భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్ ప్రయాణం మొదలైంది. అప్పట్లో అది ఒక అసాధ్యమైన రికార్డు. కానీ, కాలక్రమేణా టెక్నాలజీ మారి, థియేటర్ల సంఖ్య పెరగడంతో ఇప్పటివరకు సుమారు 150 భారతీయ సినిమాలు ఈ ఘనతను సాధించాయి.

ఏకంగా 20 సార్లు 100 కోట్లు కొల్లగొట్టిన ఏకైక ఇండియన్ హీరో- ఖాన్స్, రజనీకాంత్, ప్రభాస్, విజయ్‌లను ఓడించి!
ఏకంగా 20 సార్లు 100 కోట్లు కొల్లగొట్టిన ఏకైక ఇండియన్ హీరో- ఖాన్స్, రజనీకాంత్, ప్రభాస్, విజయ్‌లను ఓడించి!

ఖాన్‌ త్రయం, రజనీకాంత్, దళపతి విజయ్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి హేమాహేమీలు ఈ జాబితాలో ఉన్నప్పటికీ, మరే హీరోకు సాధ్యం కాని రీతిలో అక్షయ్ కుమార్ 20 సార్లు ఈ మార్కును దాటడం విశేషం.

'భూత్ బంగ్లా'తో అక్షయ్ డబుల్ సెంచరీ

ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన 'భూత్ బంగ్లా' బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించడంతో అక్షయ్ కుమార్ ఖాతాలో 20వ సెంచరీ చేరింది. దీంతో 18 సినిమాలతో రెండో స్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్‌ను అక్షయ్ కుమార్ అధిగమించారు. కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గారన్న వాదన వినిపిస్తున్నా, పాండమిక్ తర్వాత కూడా అక్షయ్ నటించిన ఆరు సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఆయనకున్న క్రేజ్‌కు నిదర్శనం.

మధ్యలో 'సామ్రాట్ పృథ్వీరాజ్', 'రామ్ సేతు', 'రక్షా బంధన్' వంటి వరుస పరాజయాలు పలకరించినా.. 'భూత్ బంగ్లా', 'హౌస్‌ఫుల్ 5', 'కేసరి 2' విజయాలతో అక్షయ్ మళ్లీ తన ఫామ్‌ను నిరూపించుకున్నారు.

ఖాన్‌లను అక్షయ్ ఎలా వెనక్కి నెట్టారు?

అక్షయ్ కుమార్ సక్సెస్ వెనుక ఒక పక్కా ప్లానింగ్ ఉంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి హీరోలు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలకే పరిమితమైతే, అక్షయ్ మాత్రం ఏడాదికి కనీసం మూడు నుంచి నాలుగు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటారు.

ముఖ్యంగా 2007 నుంచి 2019 మధ్య అక్షయ్ కుమార్ కెరీర్ గోల్డెన్ పీరియడ్‌లా సాగింది. బడ్జెట్‌ను అదుపులో ఉంచుతూ, తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం వల్ల ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశం ఆయనకు దక్కింది. తద్వారా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల మార్కును అందుకునే అవకాశాలను ఆయన రెట్టింపు చేసుకున్నారు.

బాక్సాఫీస్ టాప్-5 వీరే (భారతదేశం నెట్ వసూళ్లు):

ప్రస్తుతం వంద కోట్ల క్లబ్‌లో ఎక్కువ సినిమాలు కలిగిన టాప్ హీరోల జాబితా ఇలా ఉంది:

Indian actors with most 100 crore hits
S NoActor100 crore hits
1Akshay Kumar20
2Salman Khan18
3Ajay Devgn16
4Shah Rukh Khan10
5Ranveer Singh9
6Hrithik Roshan8
7Rajinikanth8
8Vijay8
9Prabhas7
10Aamir Khan7
11Ranbir Kapoor7
అక్షయ్ కుమార్ (ANI)
అక్షయ్ కుమార్ (ANI)

మున్ముందు మరిన్ని రికార్డులు

దక్షిణాది నుంచి రజనీకాంత్, దళపతి విజయ్ చెరో 8 సినిమాలతో ఉండగా, తెలుగు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 7 చిత్రాలతో ఈ రేసులో కొనసాగుతున్నారు. అక్షయ్ కుమార్ జోరు ఇక్కడితో ఆగేలా లేదు. రానున్న రెండేళ్లలో ఆయన నుంచి 'హైవాన్', 'వెల్‌కమ్ టు ది జంగిల్' వంటి భారీ ప్రాజెక్టులతో పాటు, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'హేరా ఫేరి 3' కూడా రాబోతోంది.

ఈ సినిమాలతో అక్షయ్ కుమార్ తన లీడ్‌ను మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో అక్షయ్ కుమార్ మార్క్ కామెడీ, యాక్షన్ ఎప్పుడూ ముందుంటాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More