Jana Nayagan Leak: లోకల్ టీవీ ఛానెల్‌లో దళపతి విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్ ప్రసారం- నిందితుడు అరెస్ట్- రాజకీయ కుట్రనా?

Thalapathy Vijay Jana Nayagan Aired In Local Channel: తమిళ దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమా 'జన నాయగన్' విడుదలకు ముందే పైరసీ కోరల్లో చిక్కుకోవడం చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. ఆన్‌లైన్ లీక్ తర్వాత, ఏకంగా ఒక లోకల్ టీవీ ఛానెల్‌లో జన నాయగన్ సినిమాను ప్రసారం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Apr 14, 2026, 13:26:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jana Nayagan Aired In Local Cable Channel: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే పాలిటిక్స్‌లోకి వెళ్లేముందు దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతోపాటు వివాదాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి.

లోకల్ టీవీ ఛానెల్‌లో దళపతి విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్ ప్రసారం- నిందితుడు అరెస్ట్- రాజకీయ కుట్రనా?
లోకల్ టీవీ ఛానెల్‌లో దళపతి విజయ్ ఆఖరి సినిమా జన నాయగన్ ప్రసారం- నిందితుడు అరెస్ట్- రాజకీయ కుట్రనా?

అయితే, జన నాయగన్ సినిమాకు సెన్సార్ బోర్డు (CBFC) నుంచి ఇంకా క్లియరెన్స్ రాకముందే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. అంతటితో ఆగకుండా, తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక స్థానిక కేబుల్ ఛానెల్ జన నాయగన్ సినిమాను అక్రమంగా ప్రసారం చేయడం తాజాగా తీవ్ర దుమారం రేపింది. 'రాశి ప్రైమ్ మూవీ' అనే లోకల్ ఛానెల్‌లో ఏప్రిల్ 11న జన నాయగన్ సినిమాను టెలికాస్ట్ చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. అరెస్టులు

ఈ అక్రమ ప్రసారంపై విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) కోయంబత్తూరు తూర్పు విభాగం డిప్యూటీ సెక్రటరీ మోహనప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన కోయంబత్తూరు ఎస్పీ కె. కార్తికేయన్, నిందితులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన కరుమత్తంపట్టి పోలీసులు, ఛానెల్ యజమాని ఎస్. పళనిస్వామి (44)ని అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఈ క్రమంలో జన నాయగన్ అక్రమ ప్రసారానికి వాడిన కంప్యూటర్లు, ఐదు హార్డ్ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు ఛానెల్ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించి సినిమాలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

లీక్ వెనుక రాజకీయ కుట్ర ఉందా?

గత వారమే 'జన నాయగన్' చిత్రం ఆన్‌లైన్ సైట్లలో ప్రత్యక్షమైంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ ఇప్పటికే న్యాయపరమైన చర్యలు చేపట్టింది. అక్రమంగా జన నాయగన్ సినిమాను డౌన్ లోడ్ చేయవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని అభిమానులను కోరింది.

సైబర్ క్రైమ్ విభాగం ఈ లీకేజీకి సంబంధించి ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కావడం వల్లే జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈ గ్యాప్‌లోనే అక్రమంగా ఫుటేజీని సేకరించి లీక్ చేయడం వెనుక పెద్ద ముఠా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం?

హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ జన నాయగన్ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు ఇతర కీలక పాత్రలు పోషించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దళపతి విజయ్ సిద్ధమవుతున్న తరుణంలో, ఆయన ఇమేజ్‌ను దెబ్బతీయడానికే ఇలాంటి లీకులకు పాల్పడుతున్నారా అన్న కోణంలోనూ చర్చ సాగుతోంది.

ఈ అడ్డంకులన్నీ దాటుకుని జన నాయగన్ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందా అని దళపతి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More