Prabhas Fan: డార్లింగ్ రీ రిలీజ్, ప్రభాస్ ఫ్యాన్‌పై చెప్పులతో దాడి- థియేటర్‌లో ఏం జరిగింది?వైరల్ వీడియో వెనుక అసలు నిజం!

Prabhas Fan Beaten Up At Darling Re Release Theater: హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌లో ప్రభాస్ అభిమానిని యాజమాన్యం చితకబాదిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. అసలు తప్పు ఎవరిది అనే విషయంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఆ వాదనలు ఏంటీ, ఏది నిజం అనేది ఇక్కడ విశ్లేషిద్దాం.

Published on: Apr 24, 2026, 18:14:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Prabhas Fan Assaulted At Darling Re Release Theatre: ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త సినిమాల సందడి కాస్త తగ్గడంతో, 2010లో ప్రభాస్-కాజల్ అగర్వాల్ జంటగా నటించిన క్లాసిక్ హిట్ 'డార్లింగ్' చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి థియేటర్లకు వచ్చిన ఫ్యాన్స్‌కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని ఒక మల్టీప్లెక్స్‌లో సినిమా ముగిసిన తర్వాత ప్రభాస్ అభిమానిని థియేటర్ సిబ్బంది విచక్షణారహితంగా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

డార్లింగ్ రీ రిలీజ్, ప్రభాస్ ఫ్యాన్‌పై చెప్పులతో దాడి- థియేటర్‌లో ఏం జరిగింది?వైరల్ వీడియో వెనుక అసలు నిజం!
డార్లింగ్ రీ రిలీజ్, ప్రభాస్ ఫ్యాన్‌పై చెప్పులతో దాడి- థియేటర్‌లో ఏం జరిగింది?వైరల్ వీడియో వెనుక అసలు నిజం!

సిబ్బందికి, ఫ్యాన్‌కు మధ్య వార్

వైరల్ అవుతున్న వీడియోలో తెల్ల చొక్కా ధరించిన ఒక యువకుడిని నీలిరంగు యూనిఫాంలో ఉన్న థియేటర్ సిబ్బంది చుట్టుముట్టి కొడుతున్నట్లు కనిపిస్తోంది. మహిళా సిబ్బంది సైతం ఆ యువకుడిని బయటకు వెళ్లాలని గట్టిగా కేకలు వేస్తూ, చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా ఉంది. మరోవైపు థియేటర్ సిబ్బంది కర్రలు, చెప్పుతో ఆ యువకుడిపై దాడి చేశారు. ఆ యువకుడు కూడా ఆత్మరక్షణ కోసం ఎదురుదాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అసలు ఏం జరిగింది? భిన్న వాదనలు ఇవే!

ఈ ఘటనపై సోషల్ మీడియాలో మూడు రకాల వాదనలు వినిపిస్తున్నాయి:

1. సినిమాలోని పాటలను మళ్లీ ప్లే చేయాలని కోరినందుకు సిబ్బందికి, సదరు అభిమానికి మధ్య గొడవ జరిగిందని కొందరు అంటున్నారు.

2. ఆ యువకుడు మద్యం మత్తులో థియేటర్ మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే వారు దాడి చేశారని మరికొందరు వాదిస్తున్నారు.

3. అయితే, ఆ బాధితుడి స్నేహితుడు మాత్రం మరో వెర్షన్ చెబుతున్నాడు. థియేటర్ సిబ్బంది తన స్నేహితుడి బ్యాగును లాక్కోవడానికి ప్రయత్నించారని, దానిని అడ్డుకున్నందుకే ప్లాన్ ప్రకారం 'మహిళలతో అసభ్య ప్రవర్తన' అనే ముద్ర వేసి కొట్టారని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.

రాని అధికారిక ప్రకటన

ప్రస్తుతానికి ఈ గొడవపై థియేటర్ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ఒకవైపు ఇలాంటి వివాదాలు నడుస్తున్నా, ప్రభాస్ క్రేజ్ మాత్రం ఆకాశాన్నంటుతోంది.

ప్రభాస్ సినిమాల రికార్డ్స్

గతేడాది 'సలార్', ఈ ఏడాది 'కల్కి 2898 ఏడీ' సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ముఖ్యంగా 'కల్కి' రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ప్రభాస్ స్టామినాను ప్రపంచానికి చాటింది. ఇక ఇటీవల విడుదలైన 'ది రాజా సాబ్' హారర్ కామెడీతో రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఈ సినిమాపై ఆడియెన్స్, ఫ్యాన్స్ సంతోషంగా లేరని తెలిసిందే.

ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాలు

మున్ముందు 'కల్కి-2', హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' వంటి భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ మరింత బిజీగా ఉండున్నాడు. ఈ సినిమాలతో మరోసారి ప్రభాస్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'డార్లింగ్' సినిమా రీ-రిలీజ్ గొడవ ఎక్కడ జరిగింది?

హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌లో ఈ ఘటన జరిగింది. ప్రభాస్ అభిమానిని థియేటర్ సిబ్బంది కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

2. థియేటర్ సిబ్బంది ఆ యువకుడిని ఎందుకు కొట్టారు?

మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడని సిబ్బంది అంటుంటే, తన బ్యాగ్ లాక్కున్నందుకు ప్రశ్నిస్తేనే దాడి చేశారని ఆ యువకుడి స్నేహితులు చెబుతున్నారు.

3. ప్రభాస్ తదుపరి రాబోయే సినిమాలు ఏమిటి?

ప్రభాస్ ప్రస్తుతం 'రాజా సాబ్' విజయంతో జోరు మీద ఉన్నారు. త్వరలో 'ఫౌజీ', 'స్పిరిట్', 'కల్కి-2' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More