ఓటీటీలోకి వచ్చేస్తున్న సందీప్ రెడ్డి వంగా ఫ్రెండ్ మూవీ.. నలుగురు ఫ్రెండ్స్ గోవా ట్రిప్.. ఐఎండీబీలో 9.6 రేటింగ్

తెలుగు కామెడీ మూవీ జిగ్రీస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. సందీప్ రెడ్డి వంగా ఫ్రెండ్ నిర్మించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్, ఇతర విశేషాల గురించి తెలుసుకోండి.

Published on: Jan 5, 2026, 21:37:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫ్రెండ్ కృష్ణ వోడపల్లి నిర్మించిన మూవీ జిగ్రీస్. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు లాభాలు కూడా సంపాదించింది. ఈ సినిమాను ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. నలుగురు ఫ్రెండ్స్ గోవా ట్రిప్ కష్టాలను కళ్లకు కట్టే ఈ మూవీకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.6 రేటింగ్ ఉండటం విశేషం.

ఓటీటీలోకి వచ్చేస్తున్న సందీప్ రెడ్డి వంగా ఫ్రెండ్ మూవీ.. నలుగురు ఫ్రెండ్స్ గోవా ట్రిప్.. ఐఎండీబీలో 9.6 రేటింగ్
ఓటీటీలోకి వచ్చేస్తున్న సందీప్ రెడ్డి వంగా ఫ్రెండ్ మూవీ.. నలుగురు ఫ్రెండ్స్ గోవా ట్రిప్.. ఐఎండీబీలో 9.6 రేటింగ్

జిగ్రీస్ ఓటీటీ రిలీజ్ డేట్

కృష్ణ బూరుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మని వాక నటించిన జిగ్రీస్ మూవీ మంగళవారం (జనవరి 6) నుంచే సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సోమవారం ట్వీట్ చేసింది. “పవర్‌ఫుల్ సినిమాటిక్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి.. జిగ్రీస్ జనవరి 6 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో వెల్లడించింది.

జిగ్రీస్ మూవీ విశేషాలు ఇవీ..

హరీష్ రెడ్డి ఉప్పుల డైరెక్ట్ చేసిన మూవీ జిగ్రీస్. కృష్ణ వోడపల్లి నిర్మించాడు. గతేడాది నవంబర్ 14న థియేటర్లలో రిలీజైంది. మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్, కృష్ణ బూరుగుల, ధీరజ్ ఆత్రేయ, మని వాక ప్రధాన పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి వంగా మూవీని ప్రమోట్ చేయడంతో మంచి హైప్ వచ్చింది.

నలుగురు ఫ్రెండ్స్ తాగిన మత్తులో గోవా ట్రిప్ ప్లాన్ చేసి పడే ఇబ్బందులను ఫన్నీగా చూపించే మూవీ ఇది. ఆ నలుగురు మారుతి 800 కారులోనే వెళ్లాలని అనుకుంటారు. కానీ దారి మధ్యలోనే వాళ్ల దగ్గర ఉన్న డబ్బు, మొబైల్స్ పడిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? గోవా ప్రయాణం నలుగురిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది అనేది తెలియాలంటే జిగ్రీస్ మూవీ చూడాల్సిందే.

రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రూ.5 కోట్లు వచ్చాయి. మంచి కామెడీతో యూత్ మెచ్చేలా ఈ మూవీని తీశారు. సినిమా అంతా నవ్వించినా.. చివరి 15 నిమిషాలు ఎమోషనల్ సీన్లతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు థియేటర్లలో కంటే ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More