...
...
Next Story

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. 4 దశాబ్దాల సినీ ప్రయాణానికి వీడ్కోలు.. విషాదంలో తెలుగు చిత్ర పరిశ్రమ

తెలుగు లెజండరీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మరణించారు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాలుగు దశబ్దాల కాలంలో వందలాది చిత్రాల్లో విలక్షణ పాత్రలతో మెప్పించారు కోట శ్రీనివాసరావు.

Published on: Jul 13, 2025, 06:46:36 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో మరణించారు. ఇవాళ ఆదివారం (జులై 13) తెల్లవారుజామున 4 గంటల సమయంలో కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారు.

ఇండస్ట్రీలో విషాదఛాయలు

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. 4 దశాబ్దాల సినీ ప్రయాణానికి వీడ్కోలు.. విషాదంలో తెలుగు చిత్ర పరిశ్రమ
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. 4 దశాబ్దాల సినీ ప్రయాణానికి వీడ్కోలు.. విషాదంలో తెలుగు చిత్ర పరిశ్రమ

దీంతో తెలుగు సిని ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలుగు చిత్ర లోకం కోట మరణంతో దిగ్భ్రాంతికి గురైంది. ప్రముఖ తెలుగు నటీనటులు కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

వందల సినిమాల్లో విలక్షణ పాత్రలు

గత నాలుగు దశబ్దాలుగా వందల సినిమాల్లో విలక్షణ పాత్రలతో ఎంతగానో మెప్పించారు కోట శ్రీనివాసరావు. అలాంటి 40 ఏళ్ల సినీ నట ప్రయాణానికి ఇవాళ కోట వీడ్కోలు చెప్పారు. విలన్‌గా, ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, హీరోలకు తండ్రిగా ఎన్నో వైవిధ్య పాత్రలతో కోట శ్రీనివాసరావు మెప్పించారు. తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు.

సినిమాలు మానేసి ఇంటికే పరిమితం

ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు సినిమాలు మానేసి ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని రోజుల క్రితం కోట శ్రీనివాసరావు మరణించినట్లు పుకార్లు వినిపించాయి. వాటిపై స్పందిస్తూ బతికే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. కానీ, ఇవాళ ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో కోట శ్రీనివాసరావు ఇవాళ కన్నుమూయడం సినీ లోకానికి తీరని లోటుగా మారింది.

వందలాది నాటకాలు

కాగా, కృష్ణా జిల్లాలోని కంకిపాడులో 1942 జులై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న కోట వందలాది నాటకాల్లో యాక్ట్ చేశారు. 1978లో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కోట శ్రీనివాసరావు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి అలరించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe