తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ కామెడీ సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. 7 పీఎమ్ ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో బ్లాక్ బస్టర్ ఫన్ షో

నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 8న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో బ్లాక్ బస్టర్ ఫన్ షో అంటూ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు నరేంద్ర రవి, నటి యామిని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
నటుడు నరేంద్ర రవి మాట్లాడుతూ .. "‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియెన్స్ అందరికీ మా చిత్రం నచ్చింది. నాకు శ్రీకాకుళం యాస తెలీదు. కానీ రాహుల్ అన్న మాత్రం దగ్గరుండి నాకు ఈ యాసను నేర్పించారు. సినిమా మీద ఎక్కడా కూడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించడం లేదు" అని అన్నారు.
జార్జిరెడ్డి చూసిన తరువాత
"తిరువీర్ అన్న ఈ మూవీని భుజానికి ఎత్తుకుని ముందుకు నడిపించారు. ‘జార్జిరెడ్డి’ చూసిన తరువాత తిరువీర్ అన్నకి ఫ్యాన్ అయిపోయాను. రాహుల్ అన్న నన్ను యాక్టర్‌గా నిలబెట్టారు. సురేష్ అన్న మ్యూజిక్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. మా చిత్రాన్ని చూడని వారు త్వరగా చూడండి. అందరినీ ఆకట్టుకుంటుంది" అని యాక్టర్ నరేంద్ర రవి చెప్పారు.
నటి యామిని మాట్లాడుతూ .. "‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మాకోసం వచ్చిన బీవీఎస్ రవి సర్కి థాంక్స్. ఆడిషన్స్ చేసినప్పుడు సెలెక్ట్ అవుతానా? లేదా? అని టెన్షన్ పడ్డాను" అని తెలిపారు.
మంచి రివ్యూలు
{{/usCountry}}నటి యామిని మాట్లాడుతూ .. "‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మాకోసం వచ్చిన బీవీఎస్ రవి సర్కి థాంక్స్. ఆడిషన్స్ చేసినప్పుడు సెలెక్ట్ అవుతానా? లేదా? అని టెన్షన్ పడ్డాను" అని తెలిపారు.
మంచి రివ్యూలు
{{/usCountry}}"ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా చాలా బాగా వచ్చింది. మీడియా కూడా మంచి రివ్యూలు ఇచ్చింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంకా చూడని వాళ్లంతా కూడా మా మూవీని చూడండి" అని వెల్లడించారు నటి యామిని.
నిర్మాత సందీప్ అగరం మాట్లాడుతూ .. "‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ప్రీమియర్లు చూసి మీడియా వాళ్లు గంట సేపు మాట్లాడారు. మీడియా వల్లే మా మూవీ ఆడియెన్స్ వరకు రీచ్ అయింది. టీఎఫ్‌జేఏకి నా వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నన్ను నిలబెట్టిన మీడియాకు థాంక్స్" అని అన్నారు.
మంచి చిత్రాన్ని నిర్మించావని
"ఈ మూవీనే నన్ను నిర్మాతగా మార్చింది. ఇదంతా కూడా రాహుల్ వల్లే జరిగింది. మంచి చిత్రాన్ని నిర్మించావని నా సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యులంతా మెచ్చుకుంటున్నారు" అని ప్రొడ్యూసర్ సందీప్ అగరం తెలిపారు.
"ఈ మూవీని వెన్నంటే ఉండి సపోర్ట్ చేసిన తిరువీర్ అన్నకి థాంక్స్. ఆడియెన్స్ మా సినిమా చూసి మంచి లాభాల్ని అందిస్తే మరిన్ని మంచి చిత్రాలను నిర్మిస్తాను" అని ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రొడ్యూసర్ సందీప్ అగరం పేర్కొన్నారు.