Manchu Lakshmi Raaka: అల్లు అర్జున్ రాకాపై మంచు లక్ష్మి కామెంట్స్- రకా..లు.. వింత జీవులు, మాములు పిచ్చెక్కలేదంటూ!

Manchu Lakshmi About Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'రాకా' సెట్‌ను నటి మంచు లక్ష్మి సందర్శించారు. ముంబైలో వేసిన హాలీవుడ్ స్థాయి సెట్‌ను, బన్నీ గెటప్ చూసి నోరెళ్లబెట్టానంటూ ఆమె పెట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Published on: Aug 23, 2026, 12:04:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Manchu Lakshmi About Allu Arjun Raaka: గ్లోబల్ స్థాయిలో రికార్డులు సృష్టించిన 'పుష్ప' సిరీస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా'. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

అల్లు అర్జున్ రాకాపై మంచు లక్ష్మి కామెంట్స్- రకా..లు.. వింత జీవులు, మాములు పిచ్చెక్కలేదంటూ!
అల్లు అర్జున్ రాకాపై మంచు లక్ష్మి కామెంట్స్- రకా..లు.. వింత జీవులు, మాములు పిచ్చెక్కలేదంటూ!

శరవేగంగా రాకా షూటింగ్

హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ముంబైలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న రాకా చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది. అయితే, తాజాగా రాకా సినిమాపై మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెట్ చూసి నోరు వెళ్లబెట్టా!

తాజాగా రాకా సినిమా సెట్‌ను మంచు లక్ష్మి సందర్శించారు. ముంబైలోని రాకా షూటింగ్ స్పాట్‌కు వెళ్లి వచ్చిన అనంతరం ఆమె ఒక ప్రత్యేక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. సెట్ విశేషాలను వివరిస్తూ ఆమె వ్యక్తం చేసిన ఆశ్చర్యం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాను

"పీపుల్స్ నేను ఎక్కడి నుంచి వస్తున్నానో తెలుసా. బన్నీ బాంబేలో షూటింగ్ చేస్తున్నాడు రాకాకి. చాలా రోలుజ నుంచి పిలుస్తున్నాడు సెట్‌కి రమ్మని. కానీ, నాకున్న పనుల వల్ల కుదరలేదు. ఈరోజు చివరకు వెళ్లాను. రాకా సెట్ చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాను" అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.

రకాలు.. రకాలు.. రకా..లు..

"రకాలు..రకాలు.. రకా..లు.. వింతలు.. చూశాను నేను. అంతరానుంచి వింత వింతగా ఉన్న జంతువులను తీసుకొచ్చారు. అలాంటి యానిమల్స్‌ను నేను ఇప్పటివరకు చూడలేదు. ఇందులో బన్నీని చూసినట్లు ప్రజలు ఇంకెప్పుడు చూడరు. ఇలాంటి సెట్‌ను కూడా నేను ఇంతవరకు చూడలేదు" అని మంచు లక్ష్మి తెలిపారు.

కానీ చెప్పలేను

"చాలా నిశబ్ధంగా ఉంది. ఎన్నో డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. మాములు పిచ్చెక్కలేదు. వావ్.. వావ్.. వావ్.. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆగలేకపోతున్నాను. మ్యాజిక్.. నేను చాలా షేర్ చేసుకోవాలనుంది. కానీ చెప్పలేను" అని మంచు లక్ష్మి తన వీడియో ముగించారు.

సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో మరోసారి రాకా సినిమా హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను మైమరిపించడంలో అట్లీది ప్రత్యేక శైలి. రాకా కోసం ఆయన ఒక విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ లేదా ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు మంచు లక్ష్మి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.

అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, మేకోవర్ కూడా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, మేకోవర్ కూడా మునుపెన్నడూ చూడని రీతిలో ఉండనున్నాయని విశ్వసనీయ సమాచారం. మంచు లక్ష్మి అందించిన ఈ అప్‌డేట్‌తో బన్నీ అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపైంది. కాగా, రాకా సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More