Atlee Daughter Name: కూతురికి జపనీస్ భాషలో పేరు పెట్టిన రాకా డైరెక్టర్ అట్లీ- అద్భుతమైన అర్థం వచ్చేలా- అదేంటంటే?

Director Atlee Revealed His Daughter Name In Japanese: అల్లు అర్జున్ రాకా మూవీ డైరెక్టర్ అట్లీ, ప్రియ దంపతులకు ఇటీవల పాప జన్మించిన విషయం తెలిసిందే. పాప పుట్టిన నెల రోజులకు తమ కూతురుకు పేరు పెట్టారు అట్లీ దంపతులు. అయితే, అట్లీ కూతురు పేరు జపనీస్ భాషలో, అద్భుతమైన అర్థంతో ఉండటం ఇప్పుడు వైరల్ అవుతోంది.

May 17, 2026, 14:20:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Director Atlee Revealed His Daughter Name In Japanese: 'జవాన్' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇంట ఇటీవల పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్‌లో జన్మించిన తమ కుమార్తెకు అట్లీ, ఆయన భార్య ప్రియ ఒక విభిన్నమైన పేరును ఖరారు చేశారు. పాప పుట్టిన దాదాపు నెల రోజుల తర్వాత, సోషల్ మీడియా ద్వారా ఆ పేరును వెల్లడిస్తూ తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

కూతురికి జపనీస్ భాషలో పేరు పెట్టిన రాకా డైరెక్టర్ అట్లీ- అద్భుతమైన అర్థం వచ్చేలా- అదేంటంటే?
కూతురికి జపనీస్ భాషలో పేరు పెట్టిన రాకా డైరెక్టర్ అట్లీ- అద్భుతమైన అర్థం వచ్చేలా- అదేంటంటే?

మధురమైన ఫోటోను

ఆదివారం (మే 17) ఉదయం అట్లీ దంపతులు ఇద్దరు కలిసి ఒక పోస్ట్‌ ద్వారా తమ కుమార్తె పేరును 'మియూ' (Miyou) అని ప్రపంచానికి పరిచయం చేశారు. పాప చిన్నారి చేతిని వారు పట్టుకున్న ఒక మధురమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "మా హృదయాలకు ఒక కొత్త ఇల్లు దొరికింది. ఆమె పేరు మియూ. మా గుండెల్లో అత్యంత పెద్ద స్థానాన్ని సంపాదించుకున్న చిన్నారి దేవత" అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

జపనీస్ పేరు.. అద్భుతమైన అర్థం

తమ ప్రేమకు ప్రతిరూపమైన ఆ పేరుకు అందం, సౌమ్యత, ప్రేమ అనే అర్థాలు ఉన్నట్లు వారు క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఈ పేరుకు సంప్రదాయ భారతీయ లేదా సంస్కృత మూలాలు లేవు. జపనీస్ భాష నుంచి ఈ పేరును అట్లీ దంపతులు ఎంపిక చేసుకున్నారు. జపనీస్ సంస్కృతి ప్రకారం 'మి' (Mi) అంటే అందం అని, 'యూ' (You) అంటే మృదువైన, అత్యుత్తమమైన లేదా శ్రేష్ఠమైన అనే అర్థాలు వస్తాయి.

ఏప్రిల్ 20న

మొత్తంగా చూస్తే 'మియూ' అంటే అందం, పవిత్రమైన సౌమ్యత కలబోసిన రూపం అని చెప్పవచ్చు. ఈ విభిన్నమైన పేరు చూసి సినీ ప్రముఖులు, అభిమానులు అట్లీ దంపతులకు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. అట్లీ, ప్రియ దంపతులకు ఏప్రిల్ 20, 2026న ఈ పాప జన్మించింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించిన మరుసటి రోజే అట్లీ ఇంట ఈ సంతోషకరమైన వార్త రావడం విశేషం. ఈ దంపతులకు ఇప్పటికే 'మీర్' అనే కుమారుడు ఉన్నాడు. మీర్ జనవరి 2023లో జన్మించాడు. ఇప్పుడు చెల్లెలు రావడంతో మీర్ పెద్దన్నయ్యగా ప్రమోషన్ పొందాడంటూ ఒక అందమైన స్కెచ్‌ను కూడా అప్పట్లో వారు పంచుకున్నారు.

అల్లు అర్జున్‌తో 'రాకా'.. టాలీవుడ్‌లో అట్లీ నెక్ట్స్ హవా

షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' లాంటి వెయ్యి కోట్ల ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత అట్లీ క్రేజ్ పాన్-ఇండియా స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో 'రాకా' (Raaka) అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తోంది.

అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన రాకా ఫస్ట్ లుక్ టాలీవుడ్‌లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ గుండుతో, ముఖాన్ని జంతువుల వంటి పంజా గోళ్లతో కప్పుకుని కనిపించి షాకిచ్చారు. ఆయన ఇందులో సగం మనిషి, సగం జంతువు లాంటి విలక్షణమైన పాత్ర పోషిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్.

రాకా, రాకతో సంతోషం

దీపికా పదుకొణె లుక్‌ను మేకర్స్ ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం బహుభాషల్లో విడుదల కానుంది. ఒకవైపు కుటుంబ జీవితంలో కుమార్తె రాకతో సంతోషంగా ఉన్న అట్లీ, మరోవైపు 'రాకా' సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. అట్లీ, ప్రియ దంపతుల కుమార్తె పేరు ఏమిటి? దాని అర్థం ఏమిటి?

అట్లీ దంపతులు తమ కుమార్తెకు 'మియూ' (Miyou) అని పేరు పెట్టారు. జపనీస్ భాషలో దీనికి అందం, సౌమ్యత, ప్రేమ అనే అర్థాలు వస్తాయి.

2. అట్లీ మొదటి సంతానం ఎవరు?

అట్లీ దంపతుల మొదటి సంతానం కుమారుడు 'మీర్'. అతను జనవరి 2023లో జన్మించాడు.

3. డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారు?

ఆయన ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దీపికా పదుకోన్ కాంబినేషన్‌లో 'రాకా' (Raaka) అనే భారీ పాన్-ఇండియా చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

4. 'రాకా' సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతోంది?

అల్లు అర్జున్ పుట్టినరోజున విడుదలైన ఫస్ట్ లుక్ ప్రకారం, ఆయన ఈ సినిమాలో సగం మనిషి, సగం జంతువు తరహాలో ఉండే ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More