Tabu King 100: నాగార్జునతో రొమాన్స్ కాదు ఈసారి యుద్ధమే: కింగ్ 100పై టబు అదిరిపోయే అప్డేట్

Tabu King 100: నాగార్జున మైలురాయి 100వ చిత్రం 'కింగ్ 100' (King 100) నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. నాగ్ - టబు దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తుండగా, ఈసారి వారు రొమాంటిక్ కపుల్‌గా కాకుండా ప్రత్యర్థులుగా ముఖాముఖి తలపడనున్నారు. టబు పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Published on: Nov 3, 2026, 19:45:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Tabu King 100: అక్కినేని నాగార్జున, టబు కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడా మా ఆవిడే' వంటి ఆల్‌టైమ్ క్లాసిక్స్ తర్వాత వీరిద్దరూ మళ్లీ వెండితెరపై కలిసి కనిపించలేదు. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 100వ చిత్రం 'కింగ్ 100' (King 100)లో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tabu King 100: నాగార్జునతో రొమాన్స్ కాదు ఈసారి యుద్ధమే: కింగ్ 100పై టబు అదిరిపోయే అప్డేట్
Tabu King 100: నాగార్జునతో రొమాన్స్ కాదు ఈసారి యుద్ధమే: కింగ్ 100పై టబు అదిరిపోయే అప్డేట్

ఈసారి యుద్ధమే: టబు

అయితే ఈసారి ప్రేమికులుగా కాకుండా, ఇద్దరి మధ్య ఒక రకమైన 'యుద్ధం' (WAR) జరగబోతోందని టబు స్వయంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె.. “చాలా కాలం తర్వాత మళ్లీ కింగ్‌తో కలిసి వస్తున్నాను.. అయితే ఈసారి ఇది ప్రేమ కాదు, కేవలం యుద్ధం మాత్రమే” అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆసక్తిని పెంచేశారు.

కింగ్ 100 నుంచి రేపే స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తీక్ (Ra. Karthik) తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా నుంచి టబు పుట్టినరోజు కానుకగా (నవంబర్ 4న) ఉదయం 9 గంటలకు ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ-లుక్ వీడియో పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పాతకాలం నాటి రేడియో విజువల్స్, చీరకట్టులో గంభీరంగా నడుచుకుంటూ వెళ్తున్న టబు లుక్ చూస్తుంటే, సినిమాలో ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. కథను తిప్పే విలనిక్ లేదా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో టబు కనిపించబోతున్నారనే వార్తలు అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.

కింగ్ 100 గ్రాండ్ కాస్టింగ్.. క్రిస్మస్ కానుకగా రిలీజ్

అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ నిర్మిస్తున్న ఈ మైలురాయి చిత్రంలో నాగార్జున, టబులతో పాటు ఐశ్వర్య రాజేష్, సుస్మిత భట్, విజయేంద్ర, అశోక్ సెల్వన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాగ్స్ టు రిచెస్ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీ-కూతుళ్ల ఎమోషన్స్ ప్రధానాంశంగా ఈ కథ సాగనుందని సమాచారం. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ భారీ మల్టీస్టారర్ విజువల్ వండర్ ఈ ఏడాది డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. 28 ఏళ్ల తర్వాత నాగ్-టబు జోడీ తెరపై తలపడటం అనే అంశం సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్‌గా మారనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More