Dacoit Collections: తొలి రోజు 13 కోట్లు రాబట్టిన అడివి శెష్ డెకాయిట్- హిట్ 2, మేజర్ కంటే మెరుగ్గా- ధురంధర్ 2తో పోటీ!
Dacoit Box Office Collections Day 1: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ లవ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా డెకాయిట్. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కాస్తా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో డెకాయిట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

ఇండియా, వరల్డ్ వైడ్ కలెక్షన్స్
భారీ అంచనాల మధ్య విడుదలైన 'డెకాయిట్' సినిమా మొదటి రోజు డీసెంట్ వసూళ్లనే సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, డెకాయిట్ చిత్రం భారత్ వ్యాప్తంగా దాదాపు రూ. 6.50 కోట్ల నెట్ కలెక్షన్స్ (Net) రాబట్టింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ అంకె 13.50 కోట్ల రూపాయలకు పైగానే ఉండటం విశేషం.
అయితే, సౌత్ మార్కెట్‌లో అడివి శేష్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నా, హిందీ బెల్ట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. తెలుగు రాష్ట్రాల నుంచే డెకాయిట్ సినిమాకు సుమారు 5.60 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
'ధురందర్ 2' ధాటికి తట్టుకోగలదా?
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురందర్ 2: ది రివెంజ్' ప్రభంజనం కొనసాగుతోంది. నాలుగో వారంలో కూడా ఈ చిత్రం 6.70 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ 'డెకాయిట్'కు గట్టి పోటీనిస్తోంది. ఈ మెగా మూవీ హవా కొనసాగుతుండటంతో అడివి శేష్ సినిమాకు స్క్రీన్ల సంఖ్య కొంత తగ్గినట్లు సమాచారం.
అడివి శేష్ గత చిత్రాలు 'హిట్ 2' (6.4 కోట్లు), 'మేజర్' వంటి సినిమాలతో పోలిస్తే డెకాయిట్ ఓపెనింగ్స్ మెరుగ్గానే ఉన్నప్పటికీ, లాంగ్ రన్‌లో నిలబడాలంటే వీకెండ్‌లో వసూళ్లు పుంజుకోవాల్సి ఉంటుంది.
అసలు కథేంటి? రివ్యూలు ఎలా ఉన్నాయి?
నూతన దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన డెకాయిట్ చిత్రంలో అడివి శేష్ మృణాల్ ఠాకూర్ లవర్స్ హరిదాస్, సరస్వతిగా నటించారు. విడిపోయిన ఈ ఇద్దరు ప్రేమికులు కొన్ని అనూహ్య పరిస్థితుల వల్ల కలిసి దొంగతనాలు చేయాల్సి వస్తే ఏం జరిగిందనేదే ఈ సినిమా ప్రధానాంశం.
ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ వంటి హేమాహేమీలు నటించడం సినిమాకు ప్లస్ పాయింట్. అయితే, సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు సాగదీసినట్లు ఉన్నాయని, స్క్రీన్ ప్లే ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అడివి శేష్ కామెంట్స్
మరోవైపు, అడివి శేష్ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. మృణాల్‌తో ఆయన కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. "ధురందర్ వంటి భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం సహజమే, వాటితో మాకు పోటీ లేదు" అని అడివి శేష్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


