Na Wife Missing Trailer: ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ మూవీ.. మిస్ అయిందా.. మిస్ చేశారా.. వరుణ్, శ్వేత మూవీ ట్రైలర్ చూశారా?
Na Wife Missing Trailer: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' నుంచి వస్తున్న మరో ఆసక్తికర సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ 'నా వైఫ్ మిస్సింగ్' (Na Wife Missing). స్టార్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేతుల మీదుగా ఈ వెబ్ ఒరిజినల్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించారు.
Na Wife Missing Trailer: తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త కథాంశాలు, వినోదాత్మక షోలతో దూసుకుపోతున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha Video) మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో కూడిన ఆహా ఒరిజినల్ ప్రాజెక్ట్ 'నా వైఫ్ మిస్సింగ్' (Na Wife Missing) డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కాంబినేషన్ లో 18 ఏళ్ల తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. వీళ్లిద్దరూ 2008లో కొత్త బంగారు లోకం మూవీలో కలిసి నటించారు. ఇప్పుడీ నా వైఫ్ మిస్సింగ్ మూవీలో భార్యాభర్తలుగా నటించడం విశేషం.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్
ఈ ప్రాజెక్ట్‌పై డిజిటల్ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచుతూ, టాలీవుడ్ స్టార్ అండ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను 'నా వైఫ్ మిస్సింగ్' ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా లాంచ్ చేశారు. "మాస్ మీట్స్ మిస్టరీ" అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో బోయపాటి శ్రీను ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తూ చిత్ర యూనిట్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
'మిస్ అయిందా.. మిస్ చేశారా?' – ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్
తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రారంభం నుంచే వీక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఒక భర్త తన భార్య అకస్మాత్తుగా మాయమైందని, ఆమె కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ట్రైలర్ మొదలవుతుంది.
అయితే ఆ భార్య నిజంగానే కిడ్నాప్ అయిందా? లేదా భర్తే పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను మాయం చేశాడా? అనే కోణంలో సాగే పోలీసు విచారణ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. "మిస్ అయిందా.. మిస్ చేశారా?" అనే క్యాచీ ట్యాగ్‌లైన్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.
'నా వైఫ్ మిస్సింగ్' ట్రైలర్ ముఖ్యాంశాలు
నా వైఫ్ మిస్సింగ్ ట్రైలర్ లో ఇన్వెస్టిగేషన్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తున్నాయి. కేవలం క్రైమ్ మిస్టరీ మాత్రమే కాకుండా కథనంలో కాస్త డార్క్ కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్లని ఇష్టపడే ఓటీటీ ప్రియులకు సరిగ్గా సరిపోయేలా రసీ స్క్రీన్‌ప్లేను పొందుపరిచారు.
ఆహాలో రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ఈ ఆహా ఒరిజినల్ 'నా వైఫ్ మిస్సింగ్' అక్టోబర్ 22 నుంచి ఆహా ప్లాట్‌ఫామ్‌లో అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది. పండుగ వాతావరణం ముగిసిన వెంటనే క్వాలిటీ థ్రిల్లర్ కంటెంట్ కోసం చూస్తున్న తెలుగు డిజిటల్ వీక్షకులకు ఈ ప్రాజెక్ట్ బెస్ట్ ఛాయిస్ కానుంది. ఓటీటీలో సరికొత్త మిస్టరీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ ఒరిజినల్ బాక్సాఫీస్ స్థాయిలో డిజిటల్ వీక్షకుల ఆదరణ పొందుతుందేమో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


