Hero Directors: విష్వక్ సేన్ నుంచి రామ్ పోతినేని వరకు.. డైరెక్టర్లుగా నలుగురు టాలీవుడ్ హీరోలు.. కమ్ బ్యాక్ కోసం ప్లాన్!
Hero Directors: డైరెక్టర్లు చెప్పినట్లు యాక్టింగ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసే హీరోలు ఇప్పుడు సొంతగా మెగా ఫోన్ పట్టారు. తమ కమ్ బ్యాక్ కోసం తామే స్వయంగా దర్శకులుగా మారారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇలాంటి నలుగురు హీరోలు ఒకేసారి సినిమాలకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.
Hero Directors: టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. సాధారణంగా హీరోలు దర్శకులు చెప్పినట్లు యాక్ట్ చేయడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు కొందరు యంగ్ హీరోలు మాత్రం ఒక అడుగు ముందుకు వేశారు. ఇండస్ట్రీ కెరీర్‌లో సరికొత్త కమ్ బ్యాక్ (Comeback) ఇవ్వడం కోసం మెగాఫోన్ పట్టి తామే స్వయంగా సినిమాలను డైరెక్ట్ చేస్తున్నారు. విష్వక్ సేన్, కార్తీకేయ, రామ్ పోతినేని, కిరణ్ అబ్బవరం ఈ లిస్టులోకి చేరిపోయారు.

విష్వక్ సేన్ - 'కల్ట్' (CULT)
మాస్ కా దాస్ విష్వక్ సేన్ ఇప్పటికే 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా దమ్కీ' చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయన తన మూడో డైరెక్షనల్ ప్రాజెక్ట్‌గా ‘కల్ట్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇండియాలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి "స్లాషర్ యాక్షన్ థ్రిల్లర్" (Slasher Thriller) సినిమాగా దీనిని విష్వక్ సేన్ ప్రమోట్ చేస్తున్నారు.
ఒక గ్రూప్ కాలేజీ ఫ్రెండ్స్ వెకేషన్‌కు వెళ్లినప్పుడు ఒక మాస్క్ కిల్లర్ చేతిలో ఎలా చిక్కుకున్నారు, ఎలా బ్రతికి బయటపడ్డారు అనే సస్పెన్స్, సర్వైవల్ గేమ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రాబోతోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 30, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
కార్తీకేయ గుమ్మకొండ - 'కమ్ బ్యాక్' (COMEBACK)
'RX 100' చిత్రంతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో కార్తీకేయ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లుగా లైమ్‌లైట్‌కు కాస్త దూరంగా ఉన్న ఈ హీరో, తన తాజా చిత్రానికి ఏకంగా 'కమ్ బ్యాక్' (COMEBACK) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు.
విశేషం ఏంటంటే.. ఈ సినిమాతో కార్తీకేయ దర్శకుడిగా మారుతున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా తనే స్వయంగా కథ రాసుకుని, బాక్సర్ నేపథ్యంలో ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను కార్తీకేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఆయన భార్య లోహిత రెడ్డి నిర్మిస్తున్నారు.
రామ్ పోతినేని - 'RAPO23' (వీర)
ఉస్తాద్ రామ్ పోతినేని సైతం తన కెరీర్‌లో ఊహించని బిగ్ షాక్ ఇచ్చారు. తన 23వ చిత్రం #RAPO23 తో ఆయన మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రానికి రామ్ పోతినేని కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆయన ‘వీర’ అనే ఒక ఒంటరి పోరాటం చేసే క్యారెక్టర్‌లో (Lone Wolf) కనిపించనున్నారు.
ఇదొక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ (Psychological Action Thriller) జోనర్‌లో తెరకెక్కుతోంది. కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ డిసెంబర్ 2026 లో థియేటర్లలోకి రానుంది.
కిరణ్ అబ్బవరం - రియాలిటీ!
వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. తన కెరీర్‌లో మరింత స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి తానే స్వయంగా మెగాఫోన్ పట్టారు. నటనతో పాటు కథా రచన, మేకింగ్‌పై మంచి పట్టున్న కిరణ్ అబ్బవరం.. తన సొంత దర్శకత్వంలో ఒక వినూత్నమైన సబ్జెక్ట్ ‘రియాలిటీ’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి పక్కా ప్లాన్‌తో వర్క్ చేస్తున్నారు.
మొత్తానికి టాలీవుడ్ యంగ్ హీరోలంతా కేవలం యాక్టింగ్‌కే పరిమితం కాకుండా.. కథా రచయితలుగా, దర్శకులుగా మారుతూ తమ సినిమాలకు తామే బాస్ అని నిరూపించుకుంటున్నారు. ఈ హీరోల సెల్ఫ్-డైరెక్షన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కమ్ బ్యాక్ ఇస్తాయో చూడాలి!
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


