Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం స్పీడ్.. సరికొత్త ప్రయోగం.. ఊహించని జోనర్లో సినిమా.. హీరోయిన్‌గా బిగ్‌బాస్ త‌నూజ‌!

Kiran Abbavaram: హీరోగా హ్యాట్రిక్ హిట్లు కొట్టిన కిరణ్ అబ్బవరం స్పీడుమీదున్నాడు. ప్రొడ్యూసర్ గా సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఇంతకుముందెప్పుడూ చూడని జోనర్లో, ఊహించని కథతో సినిమా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ పోస్టర్ తెగ వైరల్ గా మారింది. ఇందులో బిగ్ బాస్ తనూజ హీరోయిన్. పూర్తి వివరాలు చూసేయండి.

Published on: Aug 25, 2026, 08:31:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kiran Abbavaram: ఓ వైపు హీరోగా వరుస హిట్లతో దూసుకెళ్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. మరోవైపు ప్రొడ్యూసర్ గానూ తన మార్క్ వేస్తున్నాడు. తెలుగు చిత్రసీమలో కొత్తదనంతో కూడిన కథలను ప్రోత్సహించేందుకు, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు 'కేఏ ప్రొడక్షన్స్' బ్యానర్‌ను స్థాపించాడు కిరణ్. తాజాగా ఈ బ్యానర్ పై సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం.

కిరణ్ అబ్బవరం స్పీడ్.. సరికొత్త ప్రయోగం.. ఊహించని జోనర్లో సినిమా.. హీరోయిన్‌గా బిగ్‌బాస్ త‌నూజ‌! (x)
కిరణ్ అబ్బవరం స్పీడ్.. సరికొత్త ప్రయోగం.. ఊహించని జోనర్లో సినిమా.. హీరోయిన్‌గా బిగ్‌బాస్ త‌నూజ‌! (x)

సరికొత్త ప్రయోగం

హీరోగా హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు కిరణ్ అబ్బవరం. అతను ప్రొడ్యూసర్ గా మారి కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన ప్రొడక్షన్ లో రెండో సినిమాను అనౌన్స్ చేశాడు. కేఏ ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తూ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది.

విచిత్రమైన పోస్టర్‌తో

ఈ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కోసం మేకర్స్ ఎంచుకున్న కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సినిమా ప్రకటన అంటే నటీనటులు, దర్శకుల పేర్లతో పాటు కథకు సంబంధించిన కొన్ని కీలక సూచనలు ఇస్తుంటారు. అయితే ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ల గెటప్ లు బయటపెట్టకుండా.. ఒక మిస్టరీ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో ఉన్నది ఒక రాక్షస చేయి లేదా ఓ పక్షి కాలు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొత్త జోనర్

పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. "ఇంతకు ముందెన్నడూ వెండితెరపై ఇటువంటి కథను చూసి ఉండరు, ఇలాంటి జానర్‌ను ఊహించి కూడా ఉండరు" అంటూ మేకర్స్ తెలిపిన క్యాప్షన్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. సినీ పరిశ్రమలోకి వినూత్నమైన ఆలోచనలను తీసుకురావాలనే తపనతోనే చిత్రబృందం ఈ రకమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

హీరోయిన్ తనూజ పుట్టస్వామి

ముద్ద మందారం సీరియల్ తో తెలుగు ఆడియన్స్ ను అలరించిన తనూజ పుట్టస్వామి గురించి తెలిసిందే. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ లో ఆమె రన్నరప్ గా నిలిచింది. ఇప్పుడు సిరీస్ లు, సినిమాతో కెరీర్ ను బిల్డ్ చేసుకునే పనిలో ఉంది. రీసెంట్ గా పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ఇప్పుడు కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న ఈ మిస్టరీ మూవీలో హీరోయిన్ గా కీలక పాత్ర పోషించనుంది తనూజ పుట్టస్వామి.

టైటిల్ ఏంటో?

ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పిస్తుండగా, అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నారు. వై. శివశంకర్ నాయడుతో కలిసి కిరణ్ అబ్బవరం స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లు మద్దాల, రెహమాన్, నమ్రిత ఎమ్‌వి, తనుజ పుట్టుస్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, కథా నేపథ్యం, సాంకేతిక నిపుణుల ఇతర వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More