OTT Horror: పోస్టరే ఇలా ఉంటే.. సినిమా ఎంతలా భయపెడుతుందో? ఒంటరిగా చూడొద్దు.. తెలుగులో ఓటీటీలోకి మిస్టరీ హారర్ థ్రిల్లర్

OTT Horror: ఎలాంటి ఎడిటింగ్ కట్స్ లేకుండా ఒకే టేక్‌లో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది. వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో ఉన్న ఈ మూవీ ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఏంటీ? ఏ ఓటీటీలో చూడాలి? అనేదానిపై ఓ లుక్కేయండి.

Published on: Aug 22, 2026, 14:34:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Horror: హర్రర్, మైండ్-బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ లవర్స్ కోసం ఒక డిఫరెంట్ మూవీ వచ్చేసింది. ఎక్కడా ఎడిటింగ్ కట్స్ లేకుండా, ఒకే కంటిన్యూయస్ టేక్ (వన్-షాట్)తో రూపొందిన సైకాలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘బరీ ది డెవిల్’ ఓటీటీలో అడుగుపెట్టింది.

పోస్టరే ఇలా ఉంటే.. సినిమా ఎంతలా భయపెడుతుందో? ఒంటరిగా చూడొద్దు.. తెలుగులో ఓటీటీలోకి మిస్టరీ హారర్ థ్రిల్లర్
పోస్టరే ఇలా ఉంటే.. సినిమా ఎంతలా భయపెడుతుందో? ఒంటరిగా చూడొద్దు.. తెలుగులో ఓటీటీలోకి మిస్టరీ హారర్ థ్రిల్లర్

వణికించే స్టోరీ

ఈ బరీ ది డెవిల్ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీ కథ జూలియా అనే ఒక హాస్పిస్ నర్స్ (తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారిని చూసుకునే నర్స్) చుట్టూ తిరుగుతుంది. తీవ్రమైన డిమెన్షియా (మతిమరుపు) వ్యాధితో బాధపడుతున్న ఈవ్లిన్ అనే వృద్ధురాలికి సేవలు అందించడానికి జూలియా ఆమె నివాసానికి వెళుతుంది.

ఆ ఇల్లు నగరానికి దూరంగా, చీకటిగా, ఒంటరిగా ఉంటుంది. రాత్రి సమయం గడిచేకొద్దీ ఈవ్లిన్ ప్రవర్తనలో విపరీతమైన, భయంకరమైన మార్పులు మొదలవుతాయి. మొదట్లో అది వయోభారం, డిమెన్షియా వల్ల వచ్చిన మానసిక మార్పు అని జూలియా భావిస్తుంది. కానీ క్రమంగా ఆ వృద్ధురాలు చేసే పనులు అత్యంత భయంకరంగా మారతాయి.

నరకం చూపించే క్లైమాక్స్

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హారర్ థ్రిల్లర్ బరీ ది డెవిల్ మూవీ కథలో సమయం గడిచేకొద్దీ పరిస్థితి చేయిదాటిపోతుంది. ఈవ్లిన్ శరీరంలోకి ఒక దెయ్యం ప్రవేశించిందని జూలియా గ్రహిస్తుంది. ఆ భయంకరమైన రాక్షస శక్తి నుంచి రక్షించుకోవడానికి, ఆ ఇంట్లో నుంచి బయటపడటానికి జూలియా తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది.

బయటకు వెళ్లే మార్గం లేకపోవడం, చుట్టూ చీకటి, మరోవైపు విరుచుకుపడే దుష్టశక్తి.. ఈ భయానక పరిస్థితుల నడుమ జూలియా ఆ రాత్రిని ఎలా గడిపింది? ఆ దెయ్యం బారి నుంచి ప్రాణాలతో బయటపడిందా లేదా అనేది ఈ బరీ ది డెవిల్ సినిమాలో అత్యంత ఉత్కంఠభరితంగా చూపించారు.

నటన కూడా అదుర్స్

ఈ సినిమాలో నర్స్ జూలియా పాత్రలో డాన్ ఫోర్డ్ అద్భుత నటనను కనబరిచారు. ఆపదలో చిక్కుకున్న వ్యక్తిగా ఆమె పడే వేదన, భయం ప్రేక్షకులను నేరుగా కథలోకి తీసుకెళ్తాయి. దెయ్యం పట్టిన వృద్ధురాలు ఈవ్లిన్ పాత్రలో ఎమ్మాన్యుయెల్ లుస్సియర్ మార్టినెజ్ భయానక అభినయంతో ఆకట్టుకున్నారు. అలాగే డాక్టర్ ఫిలిప్స్ పాత్రలో బిల్ రోవాట్ మెప్పించారు.

ఓటీటీ విడుదల వివరాలు

ఈ బరీ ది డెవిల్ చిత్రం గ్లోబల్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీ (Apple TV), గూగుల్ ప్లే మూవీస్ (Google Play Movies) వేదికలపై అందుబాటులో ఉంది. ఇండియాలోని సినీ లవర్స్ ఈ సినిమాను బుక్‌మైషో స్ట్రీమ్ (BookMyShow Stream) వేదికగా పే-పర్-వ్యూ పద్ధతిలో కూడా చూసే అవకాశం ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More