Thanuja: బిగ్ బాస్ టైటిల్ మిస్..వంటల్లో మాత్రం అదుర్స్..కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2 విన్నర్ తనూజ..ప్రైజ్ మనీ ఎంతంటే?

Thanuja: సీరియల్ నటి తనూజ పుట్టస్వామి అదరగొట్టింది. బిగ్ బాస్ 9 తెలుగు టైటిల్ ను జస్ట్ లో మిస్ చేసుకున్న ఈ బ్యూటీ.. వంటల్లో మాత్రం అదరగొట్టింది. కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2 విన్నర్ నిలిచింది. మరి ఈ షో టైటిల్ ట్రోఫీతో పాటు తనూజ ఎంత ప్రైజ్ మనీ అందుకుందో మీకు తెలుసా?

Published on: Aug 10, 2026, 09:05:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Thanuja: బుల్లితెరపై వినోదాన్ని, రుచులను కలబోసి ప్రేక్షకులను అలరించిన ప్రముఖ రియాలిటీ షో ‘కుక్కు విత్ జాతిరత్నాలు’ (Cooku with Jathirathnalu) సీజన్ 2 ముగిసింది. బిగ్ బాస్ 9 తెలుగులో రన్నరప్ గా నిలిచిన తనూజ పుట్టస్వామి.. ఈ వంటల షోలో టైటిల్ ఎగరేసుకుపోయింది.

బిగ్ బాస్ టైటిల్ మిస్..వంటల్లో మాత్రం అదుర్స్.. కూకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 విన్నర్ తనూజ.. ప్రైజ్ మనీ ఎంతంటే? (x/StarMaa)
బిగ్ బాస్ టైటిల్ మిస్..వంటల్లో మాత్రం అదుర్స్.. కూకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 విన్నర్ తనూజ.. ప్రైజ్ మనీ ఎంతంటే? (x/StarMaa)

విన్నర్ తనూజ

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో తనూజ పుట్టస్వామి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ రియాలిటీ షోలో లాస్ట్ వరకూ వచ్చిన తనూజ చివరి మెట్టుపై ఆగిపోయింది. కానీ ఈ సారి కుక్కు విత్ జాతిరత్నాలు షోలో మాత్రం పట్టు వదల్లేదు. విన్నర్ గా ట్రోఫీ అందుకుంది. ఆదివారం (ఆగస్టు 9) రాత్రి జరిగిన ఫినాలేలో తనూజ విన్నర్ గా నిలిచింది.

ప్రైజ్ మనీ ఎంతంటే?

కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2 షోలో విన్నింగ్ టైటిల్ తో పాటు భారీ ప్రైజ్ మనీని కూడా తనూజ సొంతం చేసుకుంది. ట్రోఫీ గెలిచిన ఆమెకు ఏకంగా రూ.10 లక్షల నగదు బహుమతి దక్కింది.

ఈ కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2 ముగింపు వేడుక సెలబ్రిటీల ప్రత్యేక డాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, జాతిరత్నాల పంచ్‌లతో షో అత్యంత వైభవంగా సాగింది. టైటిల్ సాధించిన అనంతరం తనూజ మాట్లాడుతూ.. తనకు మద్దతు తెలిపిన అభిమానులకు, తోటి పోటీదారులకు, షో నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ఫైనల్లో ఇలా

కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2 ఫినాలేలో అయిదుగురు సెలబ్రిటీలు పోటీపడ్డారు. రాకింగ్ రాకేష్, ఆషిక, నిఖిల్, డీమాన్ పవన్, తనూజ టైటిల్ కోసం తలపడ్డారు. వీళ్లలో రాకేష్ 5, ఆషిక 4, నిఖిల్ 3, పవన్ 2వ స్థానాల్లో నిలిచారు. ఫైనల్లో బాసా చేప విత్ చింతచిగురు, మటన్ బిర్యానీ, ఖర్గా మసాలా స్టఫ్డ్ స్కిన్ చికెన్, క్రిస్పీ అవకాడో, ఇరానీ చాయ్ డిజర్ట్ లను తనూజ వండింది.

రెండో సారి

తనూజ కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 1లోనూ పోటీపడింది. కానీ అప్పుడు సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకుంది. సుజీత టైటిల్ గెలిచింది. కానీ సెకండ్ సీజన్ లో మాత్రం తనూజ రుచికరమైన వంటకాలతో విన్నర్ గా నిలిచింది. ఆమె ప్రిపేర్ చేసిన ఫుడ్ కు అలీ, చెఫ్ సంజయ్, అరుణ, శ్రీదేవి ఫుల్ ఫిదా అయ్యారు.

తనూజ అన్-స్టాపబుల్ జర్నీ

‘ముద్ద మందారం’ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తనూజ, గతంలో బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి తన నిజాయితీగల ప్రవర్తనతో రన్నరప్‌గా నిలిచి భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు అదే స్టార్ మాలో వచ్చిన కుక్కు విత్ జాతిరత్నాలు షోలో విన్నర్ గా నిలిచింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More