Part Timers OTT: బిగ్‌బాస్ తనూజ ఓటీటీ ఎంట్రీ.. జియోహాట్‌స్టార్‌లో పార్ట్ టైమర్స్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. కథేంటంటే?
Part Timers OTT: ‘ముద్ద మందారం’ సీరియల్‌తో తెలుగు ఇళ్లలో పక్కింటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుని, బిగ్‌బాస్ సీజన్ 9 రన్నరప్‌గా సంచలనం సృష్టించిన తనూజ పుట్టస్వామి డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ ‘పార్ట్ టైమర్స్’ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
Part Timers OTT: తెలుగు బుల్లితెరపై ‘ముద్ద మందారం’ (Mudda Mandaram) సీరియల్‌లోని పార్వతి పాత్రతో సుమారు 1500 ఎపిసోడ్ల పాటు వీక్షకులను అలరించిన నటి తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy) ఓటీటీలో అడుగుపెడుతోంది. డిజిటల్ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఆమె కీలక పాత్ర పోషించిన ‘పార్ట్ టైమర్స్’ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది.

తనూజ ఓటీటీ ఎంట్రీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తన నిజాయితీగల ప్రవర్తనతో రన్నరప్‌గా నిలిచి విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న తనూజ.. నేరుగా ఓటీటీ ప్రైమ్‌టైమ్‌లోకి అడుగుపెడుతుంది. తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) నిర్మించిన సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘పార్ట్ టైమర్స్’ (#PartTimers) లో తనూజ ఓ హీరోయిన్.
పార్ట్ టైమర్స్ స్ట్రీమింగ్ వివరాలు
జియోహాట్‌స్టార్ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్లు, ప్రమోషనల్ అప్‌డేట్స్ ప్రకారం ఈ సిరీస్ డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. పార్ట్ టైమర్స్ సిరీస్ ఆగస్టు 28 నుంచి జియోహాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో తనూజతో పాటు ప్రముఖ నటి జ్ఞానేశ్వరి కాండ్రేగుల (Gnaneswari Kandregula) మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది.
స్టోరీ ఏంటంటే?
“పార్ట్ టైమ్ జాబ్స్.. ఫుల్ టైమ్ డ్రీమ్స్” అనే కాన్సెప్ట్‌తో ఈ పార్ట్ టైమర్స్ సిరీస్ తెరకెక్కింది. 30 ఏళ్ల వయసు రాకముందే వ్యాపార రంగంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని విజయం సాధించాలని కలలుకనే ఇద్దరు యువతుల కథాంశంతో ఇది రూపొందింది. మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేస్తూనే తమ కలలను నెరవేర్చుకోవడానికి యువత పడే తపనను కామెడీ, ఎమోషన్స్ కలగలిపి వర్క్‌ప్లేస్ డ్రామాగా తీర్చిదిద్దారు.
బుల్లితెర క్రేజ్ నుంచి ఓటీటీ వరకు
కన్నడ చిత్రం '6-5=2', తెలుగులో 'లీగల్లీ వీర్' వంటి సినిమాల్లో నటించినప్పటికీ తనూజకు అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం తెలుగు సీరియళ్లే. 'ముద్ద మందారం', 'అగ్నిపరీక్ష' సీరియళ్ల ద్వారా ప్రతి ఇంట్లో చెల్లెలిగా, కూతురిగా స్థానం సంపాదించుకున్న ఆమె.. బిగ్‌బాస్ హౌస్‌లో తన గేమ్ ప్లాన్‌తో యూత్ ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకున్నారు.
బిగ్‌బాస్ ముగిసిన తర్వాత హాట్‌స్టార్ స్పెషల్స్ సిరీస్‌తో లీడ్ రోల్‌లో రావడం ఆమె కెరీర్‌కు డిజిటల్ స్పేస్‌లో పెద్ద బూస్ట్‌గా మారనుంది. బిగ్‌బాస్ విజేత కళ్యాణ్ పడాల సహా పలువురు సహచర నటులు ఆమె ఓటీటీ డెబ్యూపై హర్షం వ్యక్తం చేస్తూ బెస్ట్ విషెస్ తెలిపారు. మరి ఓటీటీలో పార్ట్ టైమర్స్ సిరీస్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


