Salman Khan: నేను 16 కేజీలు తగ్గాను.. సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు చెక్.. ఓటీటీ షోలో షాకింగ్ ట్విస్ట్!

Salman Khan: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ గత కొద్దిరోజులుగా తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు, రూమర్లకు చెక్ పెట్టాడు. ఓటీటీలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఏకంగా 16 కిలోల బరువు తగ్గానని స్వయంగా ప్రకటించాడు. సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Published on: Aug 4, 2026, 09:34:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇటీవలి అతను చాలా సన్నగా, లీన్‌గా కనిపించడంతో అభిమానులు సల్మాన్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అతను ఏదైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారా? అనే ప్రచారాలు కూడా సాగాయి. అయితే, ఈ రూమర్లు అన్నింటికీ సల్మాన్ ఖానే నేరుగా సమాధానమిచ్చాడు.

నేను 16 కేజీలు తగ్గాను.. సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు చెక్.. ఓటీటీ షోలో షాకింగ్ ట్విస్ట్! (AFP)
నేను 16 కేజీలు తగ్గాను.. సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు చెక్.. ఓటీటీ షోలో షాకింగ్ ట్విస్ట్! (AFP)

ఓటీటీ షోలో

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోలో ప్రసారమవుతున్న రియాలిటీ షో 'అలియన్స్' (Alliance) ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ సందడి చేశాడు. ఈ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న తన సోదరుడు సోహైల్ ఖాన్ (Sohail Khan) ను కలిసేందుకు వచ్చిన భాయిజాన్, తన ఫిట్‌నెస్ సీక్రెట్‌తో పాటు బరువు తగ్గడం వెనుక ఉన్న అసలు నిజాన్ని వెల్లడించాడు.

నేను 16 కేజీలు తగ్గాను

'అలియన్స్' షోలో సోహైల్ ఖాన్‌తో సల్మాన్ జరిపిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సోహైల్‌ను చూసిన సల్మాన్ "నువ్వు బాగా బరువు తగ్గావ్" అని అనగా.. సోహైల్ తన సిక్స్ ప్యాక్ అబ్స్ చూపిస్తూ తాను 12 కేజీలు తగ్గానని చెప్పాడు. దీనికి సల్మాన్ స్పందిస్తూ.. "నేను ఏకంగా 16 కేజీలు తగ్గాను" అని రివీల్ చేసి ఆశ్చర్యపరిచాడు.

హెల్త్ రూమర్లకు చెక్

ముంబైలోని మురికివాడల పునరావాస ప్రాధికార సంస్థ (SRA) డేటా కలెక్షన్ అండ్ వెరిఫికేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో సల్మాన్ చాలా సన్నగా కనిపించడంతో ఈ హెల్త్ రూమర్లు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ అంతా తను అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగిందే తప్ప అనారోగ్యం కాదని స్పష్టమైంది.

'అలియన్స్' షో విశేషాలు

కునాల్ ఖేము వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అలియన్స్' షో జూన్ 26 నుంచి ప్రసారమవుతోంది. 16 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లు జోడీలు (అలైస్) గా ఏర్పడి ఇందులో పోటీపడుతున్నారు. రవికిషన్-రివా కిషన్, కుశాల్ టాండన్-అర్స్లాన్ గోని, డైసీ షా-జైద్ దర్బార్ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు.

'SVC 63' కోసమేనా?

సల్మాన్ ఖాన్ ఇంతలా బరువు తగ్గడానికి ఖచ్చితమైన కారణం చెప్పనప్పటికీ, అతని రాబోయే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'SVC 63' (తాత్కాలిక పేరు) కోసమే ఈ మేకోవర్ అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా చిత్రంలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలోని పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్సుల కోసమే సల్మాన్ ఈ రేంజ్‌లో ఫిట్‌నెస్‌ సాధించినట్లు సమాచారం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More