Toxic Song: ఈ సారి తార సుతారియాతో.. రొమాన్స్ లో యశ్ తగ్గేదేలే.. టాక్సిక్ నుంచి మరో బోల్డ్ సాంగ్.. సిగరెట్ తో నయనతార
Toxic Song: కేజీఎఫ్ పాన్-ఇండియా స్టార్ యష్ మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్’ నుంచి మరో రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది. మొదటి సింగిల్ 'తబాహి' హల్చల్ చేసిన తర్వాత, సెకండ్ సింగిల్ ‘మనసాగదే’ పాట మాయ చేసేందుకు వచ్చేసింది. ఈ సెకండ్ సింగిల్‌లో యష్, తార సుతారియా కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
Toxic Song: కేజీఎఫ్ 2 సృష్టించిన సునామీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా ప్రకటించిన చిత్రం 'టాక్సిక్'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్‌మేకర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి పాట 'తబాహి' (Tabaahi) చార్ట్‌బస్టర్‌గా నిలవగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ 'మనసాగదే' ను ఐదు భాషల్లో విడుదల చేశారు.

రాయా - రెబెక్కా రొమాన్స్
టాక్సిక్ నుంచి రిలీజైన రెండో పాట ‘మనసాగదే’ లో యష్ (రాయా క్యారెక్టర్), తార సుతారియా (రెబెక్కా క్యారెక్టర్)ల మధ్య సాగే సున్నితమైన ప్రేమ భావాలు, సరదా అనుబంధం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మాస్ అండ్ ఇంటెన్స్ లుక్‌కు భిన్నంగా యాష్ ఇందులో కేర్‌ఫ్రీ రొమాంటిక్ అవతార్‌లో కనిపించడం ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తోంది.
తగ్గేదేలే
టాక్సిక్ మూవీ గ్లింప్స్, తబాహి సాంగ్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కానీ యష్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. తబాహి సాంగ్ లో కియారా అద్వానీతో యశ్ బోల్డ్ కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మనసాగదే సాంగ్ లో తార సుతారియాతో యష్ రొమాన్స్ వైరల్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ తార సుతారియా (Tara Sutaria) ఈ పాటకు మరింత గ్లామర్ తీసుకొచ్చింది.
తనిష్క్ బాగ్చి, అర్సలాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా కలిసి స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీని ఐదు భాషల్లోనూ ప్రముఖ గాయకుడు సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించాడు. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, కంటికింపుగా ఉండే కలర్ ప్యాలెట్ పాటను విజువల్ వండర్‌గా మార్చాయి. రామజోయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.
సిగరెట్ తో నయనతార
మనసాగదే పాటలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. బాధలో ఉన్న యష్ ను వచ్చి చేయి పట్టుకునే నయనతార.. యష్ తాగిన సిగరెట్ ను షేర్ చేసుకుంటుంది. దీంతో అసలు ఈ టాక్సిక్ మూవీలో నయనతార క్యారెక్టర్ ఏంటీ అనేది మరింత సస్పెన్స్ గా మారింది.
గీతూ మోహన్‌దాస్ బిగ్ ప్లాన్!
'టాక్సిక్' సినిమాలో సౌత్, నార్త్ ఇండస్ట్రీలకు చెందిన టాప్ లైన్‌అప్ హీరోయిన్లు నటిస్తుండటం సినిమా మేకింగ్ స్కేల్‌ను తెలియజేస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ (Kiara Advani), తార సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి వంటి ప్రతిభావంతులైన నటీమణులు కథను మలుపు తిప్పే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ప్రతి ఒక్కరి పాత్రకూ కథాగమనంలో ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల కానున్న టాక్సిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


