Tabaahi Video Song: వీడియో సాంగ్ రచ్చ-టాక్సిక్ నుంచి తబాహీ రిలీజ్-యష్, కియారా బోల్డ్ కెమిస్ట్రీ-దారుణమైన కామెంట్లు
Tabaahi Video Song: రాకింగ్ స్టార్ యష్ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ నుంచి ‘తబాహీ’ (Tabaahi) వీడియో సాంగ్ విడుదలైంది. యశ్, కియారా అద్వానీ మధ్య మరో లెవల్ బోల్డ్ కెమిస్ట్రీ రచ్చ లేపుతోంది. ఈ సాంగ్ పై యూట్యూబ్ లో దారుణమైన కామెంట్లు వస్తున్నాయి.
Tabaahi Video Song: ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత గ్లోబల్ బాక్సాఫీస్‌ను రూల్ చేయడానికి వచ్చేస్తున్న రాకింగ్ స్టార్ యష్ కొత్త మూవీ ‘టాక్సిక్’. ఇప్పటికే గ్లింప్స్, లేడీస్ అండ్ లేడీస్ వీడియోతో సినిమాలో బోల్డ్ మోతాదు ఎంత ఉంటుందో చూపించారు. ఇప్పుడు ‘తబాహీ’ వీడియో సాంగ్ తో శృంగారం సీన్ల స్థాయిని వేరే లెవల్ కు తీసుకెళ్లారనే టాక్ వినిపిస్తోంది.

తబాహీ వీడియో సాంగ్
యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ మూవీలో ఇప్పటికే బోల్డ్ సీన్లు ఎక్కువ ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ‘తబాహీ’ సాంగ్ తో మేకర్స్ మరో షాక్ ఇచ్చారు. ఇవాళ (జూలై 8) ఈ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. దీన్ని రొమాంటిక్ సాంగ్ అనడం సరిపోదేమో. అంతకు మించి యష్, కియారా అద్వానీ మధ్య బోల్డ్ కెమిస్ట్రీతో ఈ సాంగ్ ఉంది.
దారుణమైన కామెంట్లు
తబాహీ సాంగ్ ఇలా రిలీజైందో లేదో కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు దారుణంగా ఆడుకుంటున్నారు. ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘సాఫ్ట్ పోర్న్’, ‘క్రోమ్ లో అప్ లోడ్ చేయాల్సింది ఇక్కడ చేశారు’, ‘బూతు సాంగ్’ అని కామెంట్లు పెడుతున్నారు.
యశ్, కియారా లవ్
తబాహీ వీడియో సాంగ్ తో టాక్సిక్ మూవీలో యష్, కియారా మధ్య శృంగార సన్నివేశాలు గట్టిగానే ఉండబోతాయనే హింట్ ఇచ్చారు మేకర్స్. వీడియోలో వీళ్లు కోరికతో రగిలిపోతూ కనిపించారు. అయితే మూవీలో వీళ్లది ఒక సాధారణ ప్రేమకథ కాదు అని తెలుస్తోంది. సమాజం అంగీకరించని ఒక బంధం అనే టాక్ వినిపిస్తోంది.
నయనతార, తారా
ఇక ఈ వీడియో సాంగ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది నయనతార (Nayanthara), తారా సుతారియా (Tara Sutaria) ల గ్లింప్స్. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్, ఈ వీడియో విజువల్స్ ఇస్తున్న హింట్ ప్రకారం.. సినిమాలో ముగ్గురు హీరోయిన్ల పాత్రలు చాలా క్రేజీగా ఉండబోతున్నాయి. కియారా అద్వానీ ఏమో యష్ క్యారెక్టర్‌తో దొంగచాటుగా ప్రేమాయణం నడిపే మెయిన్ లీడ్ కావొచ్చని అంటున్నారు.
యష్‌కు ప్రతి కష్టంలోనూ తోడుగా ఉండే అత్యంత నమ్మకమైన ముఖ్య అనుచరురాలు లేదా సోదరి తరహా పాత్రలో నయనతార నటిస్తుందని టాక్. లేదంటే ఆమె స్పై అనే వర్షన్ కూడా వినిపిస్తోంది. ఇక తారా సుతారియా కథను మలుపు తిప్పే ఒక ప్రత్యేకమైన గ్లామరస్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర అని సమాచారం.
విశాల్ మిశ్రా రా మ్యూజిక్ మ్యాజిక్
టాక్సిక్ చిత్రానికి టాలెంటెడ్ కంపోజర్ విశాల్ మిశ్రా సంగీతం అందించారు. ఈ పాట గురించి ఆయన మాట్లాడుతూ.. "తబాహీ అనేది సాంప్రదాయకమైన ప్రేమపాట కాదు. ఇది ఒక విధ్వంసం, ఒక లొంగుబాటు, ఒక ఫైర్. టాక్సిక్ సినిమాకు ఎలాంటి ఇంటెన్సిటీ కావాలో, యష్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఎలాంటి పల్స్ కావాలో దాన్ని నోట్ టు నోట్ మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను" అని పేర్కొన్నారు.
రామజోగయ్య శాస్త్రి
తెలుగులో ఈ తబాహీ పాటను ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా రాశారు. కన్నడ, తెలుగు సహా పాన్ ఇండియా లెవల్లో ఈ సాంగ్ రిలీజైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్సిక్ అప్ డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు ఈ వీడియో సాంగ్ ఒక గట్టి విజువల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు. మరి ఆగస్టు 26న విడుదల కాబోతున్న టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


