Toxic Release Date: రాకీ భాయ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్..యష్ ‘టాక్సిక్’ కొత్త రిలీజ్ డేట్ ఇదే..ఎట్టకేలకు థియేటర్లకు!
Toxic Release Date: కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'టాక్సిక్' రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఎట్టకేలకు ప్రకటించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ యాక్షన్ ఫాంటసీ చిత్రం కొత్త రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Toxic Release Date: కన్నడ స్టార్ హీరో, రాకీ భాయ్ యష్ తదుపరి చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' విడుదలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. గత కొన్ని నెలలుగా వరుస వాయిదాలతో అభిమానులను తీవ్ర నిరీక్షణకు గురిచేసిన ఈ చిత్రం, ఇప్పుడు సరికొత్త విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేసుకుంది.

డేట్ లాక్ చేసిన రాకీ భాయ్
ఆదివారం (జూన్ 21) హీరో యష్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా టాక్సిక్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను పంచుకుంటూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
"తండ్రిని గౌరవించండి... టాక్సిక్ ఆగస్టు 26, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది" అని యష్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. మిడిల్ ఈస్ట్ (పశ్చిమ ఆసియా) లో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టుకు వాయిదా వేశారు.
‘టాక్సిక్’ వాయిదా ఎందుకు?
నిజానికి టాక్సిక్ చిత్రం మొదట మార్చి 19న విడుదల కావాల్సింది. ఆ సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' చిత్రంతో పోటీ పడాల్సి ఉండేది. అయితే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా రిలీజ్ కు కొన్ని వారాల ముందే ఈ సినిమాను జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. మార్చిలో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మేకర్స్ అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
"టాక్సిక్ సినిమాను గ్లోబల్ ఆడియన్స్ కోసం ఒక ప్రత్యేకమైన విజన్‌తో రూపొందించాం. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని నమ్మాం. ఎంతో శ్రమించి మార్చి 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నా, ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలనే మా లక్ష్యానికి ఆటంకం కలిగింది" అని చిత్ర బృందం అప్పట్లో వివరించింది.
మరోసారి పోస్ట్ పోన్
ఆ తర్వాత మే నెలలో కూడా సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినా, అప్పుడు తదుపరి తేదీని మాత్రం వెల్లడించలేదు. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఇప్పుడు ఆగస్టు నెలను ఖరారు చేశారు.
గీతూ మోహన్‌దాస్ మేజిక్
ప్రముఖ మహిళా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఫాంటసీ డ్రామా టాక్సిక్ లో యష్ తొలిసారి డబుల్ రోల్ చేస్తున్నాడని టాక్. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ 'కేజీఎఫ్ 2' తర్వాత దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యష్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో ట్రేడ్ వర్గాల్లో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
లైన్‌లోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ 'రామాయణం'
'టాక్సిక్' చిత్రంతో పాటు యష్ చేతిలో మరో ప్రతిష్టాత్మక బాలీవుడ్ ప్రాజెక్ట్ 'రామాయణం' కూడా ఉంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పౌరాణిక చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. అలాగే లార్డ్ హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అందులో మొదటి భాగం దీపావళి 2026 లో, రెండో భాగం దీపావళి 2027 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


