Toxic: యష్ ఫ్యాన్స్ కు షాక్.. టాక్సిక్ రిలీజ్ మళ్లీ వాయిదా.. గ్లోబల్ ప్లాన్ కోసమేనా? అసలు కారణం ఇదే

Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఫ్యాన్స్ కు మరో షాక్ తగిలింది. టాక్సిక్ మూవీ రిలీజ్ మళ్లీ వాయిదా పడింది. ఈ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఎందుకు ఆలస్యమవుతోంది? హీరో యష్ ఏం చెప్పాడో ఇక్కడ చదవండి.

Published on: Apr 29, 2026, 12:16:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Toxic: మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన ‘టాక్సిక్’ రిలీజ్ మళ్లీ పోస్ట్ పోన్ అయింది. ఈ సారి రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలే నిజమయ్యాయి. కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్' (Toxic) వాయిదా పడింది.

టాక్సిక్ పోస్టర్ లో యష్ (x/TheNameIsYash)
టాక్సిక్ పోస్టర్ లో యష్ (x/TheNameIsYash)

యష్ ఏమన్నాడంటే?

టాక్సిక్ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ హీరో యష్ స్వయంగా స్పందించాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, అయితే ప్రస్తుతం గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ (అంతర్జాతీయ పంపిణీ), వ్యూహాత్మక భాగస్వామ్యాలపై తాము దృష్టి సారించినట్లు అతను చెప్పాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తన పూర్తి సామర్థ్యంతో ప్రేక్షకులకు చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యష్ పేర్కొన్నాడు.

ఎమోషనల్ స్టేట్‌మెంట్

యష్ సుదీర్ఘమైన నోట్‌ను పోస్ట్ చేస్తూ.. "మనం చేసే సినిమాల్లో కొన్ని మనం ఎందుకు సినిమాను ఇంతలా ప్రేమిస్తామో గుర్తు చేస్తాయి. 'టాక్సిక్' ప్రయాణం కూడా అలాంటిదే. సినిమాకాన్‌లో ఈ చిత్రానికి లభించిన స్పందన చూశాక, ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులకు చేరాలని మా నమ్మకం మరింత బలపడింది" అని యశ్ తెలిపాడు.

"ప్రస్తుతం భారతీయ సినిమా గ్లోబల్ స్టేజ్‌పై తనదైన ముద్ర వేస్తోంది. ఇలాంటి సమయంలో స్థాయిని పెంచాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఒక నటుడిగా, నిర్మాతగా ఆ బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. కొన్ని కథలకు కాస్త ఓపిక అవసరం. భారతీయ సినిమా గర్వించేలా ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తాను" అని యష్ అభిమానులకు హామీ ఇచ్చాడు.

మరోసారి మారిన తేదీ

టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ (Toxic: A Fairy Tale for Grown-Ups) మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ పై కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బుధవారం (ఏప్రిల్ 29) అధికారిక ప్రకటన రిలీజ్ చేశాయి. నిజానికి ఈ చిత్రం ఫస్ట్ మార్చి 19న విడుదల కావాల్సింది.

ఆ సమయంలో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2'తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి వచ్చేది. కానీ ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా మిడిల్ ఈస్ట్ మార్కెట్‌లో ఏర్పడిన ఆటంకాల వల్ల టాక్సిక్ మూవీ రిలీజ్ ను జూన్ 4కి మార్చారు. ఇప్పుడు మరోసారి వాయిదా వేశారు.

సినిమాకాన్ లో

ఇటీవల జరిగిన సినిమాకాన్ వేడుకల్లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రదర్శనకు ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతోనే ఈ సినిమాను కేవలం భారతదేశానికే పరిమితం చేయకుండా, గ్లోబల్ లెవల్‌లో పెద్ద ఎత్తున లాంచ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్వయంగా యష్ కూడా రచయితగా వ్యవహరించడం విశేషం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More