Tara Sutaria Toxic: టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ పై నోరు విప్పిన తారా సుతారియా..ఆలస్యానికి కారణం.. హీరోయిన్ కామెంట్లు వైరల్

Tara Sutaria Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ రిలీజ్ పోస్ట్ పోన్ పై హీరోయిన్ తారా సుతారియా స్పందించింది. ఈ మూవీ వాయిదాపై ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

Published on: May 17, 2026, 08:34:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tara Sutaria Toxic: కన్నడ స్టార్ హీరో, గ్లోబల్ ఐకాన్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్'. ఈ చిత్రం విడుదల కోసం సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి రాకుండా వరుసగా వాయిదా పడుతుండటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. దీనిపై తాజాగా హీరోయిన్ తారా సుతారియా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

టాక్సిక్ పోస్ట్ పోన్ పై తారా సుతారియా కామెంట్లు
టాక్సిక్ పోస్ట్ పోన్ పై తారా సుతారియా కామెంట్లు

టాక్సిక్ వాయిదా

మొదటగా మార్చి 19న విడుదల కావాల్సిన టాక్సిక్ చిత్రం.. మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా జూన్ 4వ తేదీకి మారింది. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో హీరో యష్ స్వయంగా ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని స్పష్టం చేశాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో భారీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంపైనే ప్రస్తుతం చిత్రబృందం దృష్టి పెట్టిందని ఆయన వెల్లడించాడు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, అనుకున్న రేంజ్‌లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యష్ పేర్కొన్నాడు.

తారా సుతారియా కామెంట్లు

టాక్సిక్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటి తారా సుతారియా సినిమా ఆలస్యం కావడంపై తొలిసారి స్పందించింది. ఈ బ్రేక్ గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.

"నాకు ఓపిక ఎక్కువ. సినిమా వెంటనే విడుదల కాకపోతే నా పరిస్థితి ఏంటి అని నేను ఎప్పుడూ ఆలోచించను. నేను ఎప్పుడూ బిగ్గర్ పిక్చర్ మాత్రమే చూస్తాను. ఒక నటిగా ఈ సినిమా కేవలం నాది మాత్రమే అని అనుకోలేను. ఇది సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడిన ప్రతి ఒక్కరి సొత్తు" అని తారా 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.

బలమైన కారణాలు

"ఒక నటిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వహించడమే నా పని. అంతకు మించి నిర్మాతలకు, దర్శకులకు ఉన్నంత లోతైన అవగాహన, మార్కెట్ లెక్కలు నాకు తెలియకపోవచ్చు. సినిమా వాయిదా పడటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఖచ్చితంగా సరైనవే అని నేను నమ్ముతున్నాను. ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి ఎంత ఆత్రుతగా ఉన్నారో నేను అర్థం చేసుకోగలను.

నిజానికి నేను కూడా అలాగే ఎదురుచూస్తున్నాను. కానీ, ఈ నిరీక్షణ సినిమాకు మరింత మేలు చేస్తుందని నా నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా 'టాక్సిక్' చిత్రానికి దక్కాల్సిన అద్భుతమైన ఆదరణ కోసం ఈ సమయం అవసరం. ఈ నిరీక్షణకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది" అని తారా సుతారియా ఆశాభావం వ్యక్తం చేసింది.

టాక్సిక్ గురించి

'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' అనే విభిన్నమైన టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యష్ సరసన కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటిక హీరోయిన్లు నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా మొదటి టీజర్ విడుదలైనప్పుడు కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అందులోని కొన్ని సన్నివేశాలు తీవ్ర అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More