Yash Ramayana: తెరపై రణ్‌బీర్ వర్సెస్ యష్.. రామాయణ సెకండ్ పార్ట్ వరకూ ఆగాల్సిందే.. క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్
Yash Ramayana: నితేష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. వీళ్ల మధ్య పోరాటాన్ని చూడాలని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. అయితే రామాయణ ఫస్ట్ పార్ట్ లో తమ మధ్య సీన్లు లేవని తాజాగా యష్ చెప్పాడు.
Yash Ramayana: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణ'. నితేష్ తివారీ దర్శకత్వంలో రూ.4000 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ పౌరాణిక గాథపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా కన్నడ స్టార్ యష్ మధ్య జరిగే పోరాట దృశ్యాలను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

యష్ కామెంట్లు
రామాయణ సినిమాలో రణ్‌బీర్ కపూర్, యష్ మధ్య సీన్లు సెకండ్ పార్టులోనే ఉండబోతున్నాయి. సినిమాకాన్ వేడుకలో భాగంగా యష్ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ చిత్ర మొదటి భాగంలో రణ్‌బీర్ కపూర్, తాను కలిసి నటించిన దృశ్యాలు ఉండవని అతను స్పష్టం చేశాడు.
రెండో పార్ట్ లోనే
"రామాయణ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. మొదటి భాగంలో రావణుడిగా నాకు సొంత సామ్రాజ్యం ఉంటుంది. రాముడికి తన సామ్రాజ్యం ఉంటుంది. ఈ క్రమంలో మా ఇద్దరి పాత్రలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం లేదు" అని యష్ వివరించాడు.
అద్భుతమైన నటుడు
రణ్‌బీర్ కపూర్ తో తనకున్న అనుబంధం గురించి యష్ మాట్లాడుతూ.. "మేము వ్యక్తిగతంగా కొన్నిసార్లు కలిశాం. రణ్‌బీర్ కపూర్ అద్భుతమైన నటుడు. మా ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఉంది. రామాయణ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అందరి లక్ష్యం ఒక్కటే ఉంటుంది. ఈ గొప్ప కథను ప్రపంచానికి అత్యుత్తమంగా అందించాలి. మా ఆలోచనలు, లక్ష్యాలు ఒక్కటే కాబట్టి మా మధ్య కెమిస్ట్రీ గురించి ఆందోళన అవసరం లేదు" అని యష్ చెప్పాడు.
విలన్ గా మాత్రమే కాదు
రావణుడి పాత్రను చిత్రంలో చూపించే తీరుపై దర్శకుడు నితేష్ తివారీ గతంలోనే కొన్ని కీలక విషయాలను పంచుకున్నాడు. రావణుడిని కేవలం ఒక విలన్‌గా మాత్రమే కాకుండా, అతనిలోని ఇతర కోణాలను కూడా ఆవిష్కరిస్తున్నట్లు తెలిపాడు. రావణుడు గొప్ప వీరుడు మాత్రమే కాదు, సంగీత విద్వాంసుడు, వేద పండితుడు, ప్రజారంజకమైన రాజు. పరమ శివ భక్తుడు. ఈ పార్శ్వాలన్నింటినీ యష్ పాత్రలో చూడవచ్చని ఆయన పేర్కొన్నాడు.
సీతగా సాయి పల్లవి
రామాయణ చిత్రంలో సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన చిన్న వీడియో గ్లింప్స్ లో రాముడి పాత్రను పరిచయం చేస్తూనే, లక్ష్మణ, సీతమ్మ పాత్రల ఛాయలను చూపించారు. చివర్లో రావణుడు తన పుష్పక విమానం నుంచి దిగుతున్న దృశ్యం ఆసక్తిని రేకెత్తించింది.
అయితే దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొందరు గ్రాఫిక్స్ (VFX) నాణ్యతపై పెదవి విరవగా, చిత్ర బృందం ఆ విమర్శలను స్వీకరిస్తూ పనిని మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చింది.
ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం 2026 అక్టోబర్‌లో మొదటి భాగం, 2027లో రెండో భాగం విడుదల కానున్నాయి. లారా దత్తా, కునాల్ కపూర్, వివేక్ ఒబెరాయ్ వంటి తారాగణం కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగస్వాములయ్యారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


