Ramayana Teaser: ఆదిపురుష్ బెటర్-భక్తి సినిమాలు తీయడంలో తెలుగు డైరెక్టర్ల కాలితో సమానం-రామాయణ టీజర్ పై దారుణమైన ట్రోల్స్

Ramayana Teaser: రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ మూవీ టీజర్ పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. దీనికంటే ఆదిపురుష్ బెటర్ అని, భక్తి సినిమాలు తీయడంలో తెలుగు డైరెక్టర్ల కాలితో బాలీవుడ్ సమానం అంటూ సంచలన పోస్టులు పెడుతున్నారు. 

Published on: Apr 2, 2026, 13:42:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ‘రామాయణ’ ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ' ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ఇవాళ ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ గా రామా గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ దర్శనమిచ్చాడు. అయితే ఈ టీజర్ పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి.

రామాయణ టీజర్ లో రణ్‌బీర్ కపూర్
రామాయణ టీజర్ లో రణ్‌బీర్ కపూర్

రామాయణ టీజర్

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘రామాయణ’ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇది రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి గురువారం (ఏప్రిల్ 2) హనుమాన్ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్ లుక్ చూపించారు కానీ సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ ముఖాలు చూపించలేదు.

దారుణమైన ట్రోల్స్

రామాయణ టీజర్ పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. దీని వీఎఫ్ఎక్స్ ను విమర్శిస్తున్నారు. రామాయణ కంటే ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ బెటర్ అని, రామాయణ టీజర్ ఆదిపురుష్ 2.0గా ఉందని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

‘‘ఇది ఆదిపురుష్ 2.0లా ఉంది’’ అని ఒకరు, "ఆదిపురుష్ నుంచి కొన్ని స్నాప్‌లను తీసుకుని చేసిన ఫ్యాన్-మేడ్ ట్రైలర్ అనుకున్నా’’ అని మరొకరు, "ఇది బాగుందని చెప్పేవారు ఎవరు? షాట్స్ AI-ఎన్‌హాన్స్‌డ్ లాగా ఉన్నాయి. ఆదిపురుష్‌ను గుర్తుకు తెస్తుంది" అని ఇంకొక యూజర్ పోస్టులు పెట్టారు.

ఆదిపురుష్ బెటర్

రాముడిగా ప్రభాస్ ను పెట్టి తీసిన ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీని వీఎఫ్ఎక్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు రామాయణ టీజర్ చూసిన నెటిజన్లు దీని కంటే ఆదిపురుష్ బెటర్ అనిపిస్తుందని పోస్టు చేస్తున్నారు.

అంతా స్క్రాప్

‘‘ఇంకోసారి వీళ్లు రాజమౌళిని కానీ ప్రభాస్, మహేష్ బాబు లాంటి టాలీవుడ్ హీరోలను కానీ ట్యాగ్ చేస్తే బాగుండదు. కలర్ గ్రేడింగ్, వీఎఫ్ఎక్స్ అంతా స్కాప్ మ్యాక్స్ ప్రో. ఇంకా ఇది అవతార్ కంటే ఒక జనరేషన్ అప్ గ్రేడెడ్ అంటా’’ అని ఓ ఎక్స్ యూజర్ తీవ్రంగా విమర్శించాడు.

తెలుగు డైరక్టర్ల కాళ్లతో

మరో యూజర్ అయితే రామాయణ టీజర్ పై మరింతగా రెచ్చిపోయాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ రామరాజ్యం’ సినిమా వీడియోను పోస్టు చేస్తూ బాలీవుడ్ పై ఫైర్ అయ్యాడు. ‘‘ 2011లో 77 ఏళ్ల బాపు అద్భుతంగా ఈ సీన్ తీశారు. 4000 కోట్ల బడ్జెట్ తో చేస్తున్న నితేశ్ తివారి మూవీ కంటే ఇందులో భక్తి ఎక్కువగా ఉంది. భక్తి చిత్రాల విషయానికి వస్తే తెలుగు డైరెక్టర్ల కాలితో బాలీవుడ్ సమానం’’ అని ఆ యూజర్ రాసుకొచ్చాడు.

ఎక్స్ పోస్టు
ఎక్స్ పోస్టు
  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More