యానిమల్ స్టోరీతో అందుకే కనెక్ట్ అయ్యాను.. సందీప్ చేసిన ఆ తెలుగు మూవీ నచ్చింది: రణ్‌బీర్ కపూర్ కామెంట్స్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'యానిమల్' ఇప్పుడు జపాన్‌లో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఓ స్క్రీనింగ్‌లో పాల్గొన్న రణ్‌బీర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published on: Feb 4, 2026, 20:51:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో, కాస్త వైలెంట్ టచ్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 13న జపాన్‌లో భారీ ఎత్తున విడుదల కానుంది.

యానిమల్ స్టోరీతో అందుకే కనెక్ట్ అయ్యాను.. సందీప్ చేసిన ఆ తెలుగు మూవీ నచ్చింది: రణ్‌బీర్ కపూర్ కామెంట్స్
యానిమల్ స్టోరీతో అందుకే కనెక్ట్ అయ్యాను.. సందీప్ చేసిన ఆ తెలుగు మూవీ నచ్చింది: రణ్‌బీర్ కపూర్ కామెంట్స్

ప్రమోషన్లలో భాగంగా జపాన్ వెళ్ళిన యానిమల్ మూవీ టీమ్.. అక్కడ అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో రణ్‌బీర్ కపూర్ ఈ సినిమా కథ తనకు ఎందుకు అంత దగ్గరైందో వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తన తరం అబ్బాయిలకు తండ్రితో ఉండే దూరం గురించి కూడా చెప్పాడు.

సందీప్ ఏం చెప్పాలనుకున్నాడో అది నచ్చింది..

దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై రణ్‌బీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. "నేను సందీప్ గత చిత్రాలను (అర్జున్ రెడ్డి/కబీర్ సింగ్) బాగా ఇష్టపడ్డాను. అతనితో మొదటిసారి కలిసినప్పుడే మా మధ్య ఒక వేవ్ లెంగ్త్ కుదిరింది. చాలా అరుదుగా ఇలా జరుగుతుంది. ఒక వ్యక్తిగా సందీప్ నాకు నచ్చాడు. ఈ కథ ద్వారా అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో దానికి నేను వెంటనే కనెక్ట్ అయ్యాను" అని రణ్‌బీర్ చెప్పుకొచ్చాడు.

మా తరం అబ్బాయిలందరిదీ అదే పరిస్థితి..

సినిమాలోని తండ్రీకొడుకుల ఎమోషన్ గురించి మాట్లాడుతూ రణ్‌బీర్ తన సొంత జీవితాన్ని గుర్తుచేసుకున్నాడు. "పైకి చూడటానికి ఇదొక రక్తపాతంతో కూడిన యాక్షన్ సినిమాగా కనిపించవచ్చు. కానీ దీని అసలు స్టోరీ అంతా తండ్రీకొడుకుల ఎమోషన్‌లోనే ఉంది. నిజం చెప్పాలంటే.. మా జనరేషన్ అబ్బాయిలందరూ తండ్రితో ఒక రకమైన దూరం పాటిస్తూనే పెరిగాం. ఆ ఎమోషన్ నాకు బాగా తెలుసు. అందుకే ఈ కథ నాకు అంతగా నచ్చింది. నా కెరీర్‌లో నేను పనిచేసిన అత్యంత మధురమైన, గుర్తుండిపోయే అనుభవాల్లో సందీప్ రెడ్డితో పనిచేయడం ఒకటి" అని రణ్‌బీర్ వివరించాడు.

రూ. 900 కోట్ల రికార్డు.. త్వరలో సీక్వెల్

రణ్‌బీర్ కపూర్.. రణ్‌విజయ్ సింగ్‌గా నటించిన ఈ సినిమాలో అనిల్ కపూర్ తండ్రి పాత్రలో, రష్మిక మందన్న భార్యగా నటించారు. బాబీ డియోల్ విలనిజం, తృప్తి దిమ్రి నటన సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 'యానిమల్' చేరింది. త్వరలో దీనికి సీక్వెల్‌గా 'యానిమల్ పార్క్' కూడా రాబోతోంది. జపాన్ ప్రేక్షకులు ఈ వైలెంట్ ఎమోషనల్ డ్రామాను ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More