యష్ టాక్సిక్ సినిమా స్టోరీ లీక్.. గోవా బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్.. ఆ సినిమాల్లాగే పవర్ ఫుల్.. మేకర్స్ కు షాక్

కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న భారీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘టాక్సిక్’. ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అశ్లీల సీన్లు, వైలెన్స్ తో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడేమో టాక్సిక్ మూవీ స్టోరీ లీక్ అయింది. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. 

Published on: Feb 19, 2026, 05:50:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేజీఎఫ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో యష్. ఈ కన్నడ సూపర్ స్టార్ నటించిన అప్ కమింగ్ మూవీ ‘టాక్సిక్’. ఇప్పటికే ఈ మూవీ టీజర్ హాట్ టాపిక్ గా మారింది. లిమిట్స్ దాటిన అశ్లీల సన్నివేశాలతో ఈ టీజర్ పై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడిక టాక్సిక్ మూవీ స్టోరీ లీకైంది.

టాక్సిక్ లో యశ్
టాక్సిక్ లో యశ్

టాక్సిక్ మూవీ స్టోరీ

యశ్ టాక్సిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ స్టోరీ బయటకు రావడం మేకర్స్ కు పెద్ద షాకే. ఈ సినిమా యూఏఈ డిస్ట్రిబ్యూటర్ సంస్థ టాక్సిక్ స్టోరీని సోషల్ రివీల్ చేసింది.

క్రైమ్ థ్రిల్లర్

యష్ రాబోయే చిత్రం 'టాక్సిక్' గురించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమా యూఏఈ డిస్ట్రిబ్యూటర్ అనుకోకుండా వాళ్ల అధికారిక వెబ్‌సైట్‌లో స్టోరీని పోస్టు చేశారు. యూఏఈ డిస్ట్రిబ్యూటర్ ఫార్స్ ఫిల్మ్ ప్రకారం.. 1940 నుంచి 1970ల వరకు గోవాలో సాగే ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ టాక్సిక్. మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో హింస, భయం, మోసంతో ఓ వ్యక్తి నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని, అతను ఎదిగిన తీరును ఈ మూవీలో చూడొచ్చు.

ఫుల్ యాక్షన్

"1940 నుంచి 1970 ల మధ్య గోవా బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసిన స్టోరీ ఇది.టాక్సిక్ ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. వలసవాద నీడలు, నేర సిండికేట్ల మధ్య ఓ వ్యక్తి తన సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకుంటాడు"అని డిస్ట్రిబ్యూటర్ సంస్థ పేర్కొంది.

‘‘అధికారం అనేది ఎవరూ ఇవ్వరు. దాన్ని లాక్కోవాల్సిందే. స్మగ్లింగ్ రాజ్యంలోని యుద్ధభూమిలో శత్రువులను ఓడించి అతను విజేతగా నిలిచాడు’’ అని వెబ్ సైట్లో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాకు 18+ రేటింగ్ ఉందని పేర్కొంది. అంటే 18 ఏళ్లు దాటిన వాళ్లు మాత్రమే చూడాల్సిన సినిమా అని అర్థం.

నెటిజన్ల రియాక్షన్

టాక్సిక్ స్టోరీ లీక్ కావడంపై నెటిజన్ల రియాక్షన్లు వైరల్ గా మారాయి. ఈ స్టోరీ లైన్ చూస్తుంటే కేజీఎఫ్ సినిమాల్లో రాకీ భాయ్ లాగే యశ్ క్యారెక్టర్ ఉండబోతుందేమోననే సందేహాలు వ్యక్తం చేశారు. కేజీఎఫ్ లో ఓ కుర్రాడు పవర్ మీద, బంగారం మీద ఆశతో గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. కేజీఎఫ్ ను శాసిస్తాడు. ఇప్పుడు టాక్సిక్ స్టోరీని బట్టి చూస్తే ఇందులోనూ అతను గ్యాంగ్ స్టర్ గా ఎదగడం ఉంది.

టాక్సిక్ గురించి..

టాక్సిక్ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించింది. యష్ తో ఆమెకు ఇది ఫస్ట్ మూవీ. ఇందులో నయనతార, రుక్మిణి వసంత్, హూమా ఖురేషీ తదితర అందాల భామలు నటించారు. ఈ చిత్రం మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. అదే రోజు థియేటర్లకు రాబోతున్న ధురంధర్ ది రివేంజ్ మూవీతో టాక్సిక్ క్లాష్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More