క్రిస్టియన్లను అవమానించేలా సీన్లు ఉన్నాయి.. మరో వివాదంలో చిక్కుకున్న యశ్ టాక్సిక్ మూవీ

యశ్ నటించిన టాక్సిక్ మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. ఈసారి క్రిస్టియన్ గ్రూప్ ఒకటి ఈ సినిమా టీజర్లో చూపించిన సీన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే.

Published on: Feb 12, 2026, 19:03:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేజీఎఫ్ స్టార్ యశ్ నటిస్తున్న పాన్- ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic) టీజర్ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. స్మశాన వాటికలో చిత్రీకరించిన ఒక సన్నివేశంపై క్రిస్టియన్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు కూడా చేశాయి. ఈ వివాదంపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించాడు.

క్రిస్టియన్లను అవమానించేలా సీన్లు ఉన్నాయి.. మరో వివాదంలో చిక్కుకున్న యశ్ టాక్సిక్ మూవీ
క్రిస్టియన్లను అవమానించేలా సీన్లు ఉన్నాయి.. మరో వివాదంలో చిక్కుకున్న యశ్ టాక్సిక్ మూవీ

స్మశానంలో ఆ సీన్ ఏంటి?

యశ్ హీరోగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ మూవీ 'టాక్సిక్'. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. మొదట మహిళా కమిషన్ అభ్యంతరం తెలపగా, తాజాగా క్రిస్టియన్ సంఘాలు (నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్) ఈ టీజర్‌పై మండిపడుతున్నాయి.

ఎన్‌సీఎఫ్ (NCF) ప్రతినిధులు సెన్సార్ బోర్డు, ఫిల్మ్ చాంబర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఫిర్యాదు చేశారు. టీజర్‌లో చూపించిన ఒక స్మశాన వాటిక సీన్ తమ మనోభావాలను దెబ్బతీసిందని వారు పేర్కొన్నారు.

స్మశానంలో పార్క్ చేసిన కారులో శృంగార సన్నివేశం, ఆ తర్వాత అక్కడే కాల్పులు జరగడం అభ్యంతరకరమని వారు వాదిస్తున్నారు. ఆ సన్నివేశంలో 'ఆర్చ్ ఏంజెల్ మైఖేల్' విగ్రహం కనిపిస్తుందని, పవిత్రమైన స్థలంలో ఇలాంటి అసభ్యకర దృశ్యాలు చిత్రీకరించడం తమ మతాన్ని అవమానించడమేనని ఆరోపించారు. వెంటనే యూట్యూబ్, సోషల్ మీడియా నుంచి ఆ టీజర్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

నటి సోషల్ మీడియా డిలీట్..

ఈ టాక్సిక్ టీజర్‌లో కనిపించిన నటి బీట్రిస్ టౌఫెన్‌బాచ్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ ఇంటిమేట్ సీన్ మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉందంటూ విమర్శలు రావడంతో, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసుకుంది.

అనురాగ్ కశ్యప్ మద్దతు..

ఈ వివాదాల నడుమ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ 'టాక్సిక్' టీమ్‌కు మద్దతుగా నిలిచాడు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ.. "టాక్సిక్ సినిమా ఒక సాహసోపేతమైన ప్రయత్నం. మగవాళ్ళు షర్ట్ లేకుండా కనిపిస్తే ఎవరూ ప్రశ్నించరు. కానీ ఒక స్త్రీ తన శృంగారాన్ని లేదా కోరికను వ్యక్తపరిస్తే మాత్రం అంగీకరించలేరు. ఇది మన సాంస్కృతిక కపటత్వానికి నిదర్శనం" అని అతడు కామెంట్ చేశాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More