టాక్సిక్ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను కళ్లు చెదిరే మొత్తానికి సొంతం చేసుకున్న దిల్ రాజు.. ఏకంగా రూ.120 కోట్లు
'కేజీఎఫ్ 2' తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ 'టాక్సిక్'. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నాడు. ఉగాది కానుకగా రాబోతున్న ఈ సినిమా విశేషాలు, రిలీజ్ డేట్ వివరాలు ఇక్కడ చూడండి.
రాకింగ్ స్టార్ యష్ బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'కేజీఎఫ్ 2'తో తెలుగునాట అతడు సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ఇప్పుడు అతని తదుపరి సినిమా 'టాక్సిక్' (Toxic) కోసం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. అతనికి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏకంగా రూ.120 కోట్లకు అధికారికంగా సొంతం చేసుకుంది.

రికార్డు స్థాయి ధర..
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక నాన్-తెలుగు (డబ్బింగ్) సినిమాకు ఈ స్థాయిలో భారీ మొత్తం చెల్లించి హక్కులు తీసుకోవడం ఇదే తొలిసారి అని, ఇదొక రికార్డు అని తెలుస్తోంది. యష్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని టాక్సిక్ మూవీ కోసం దిల్ రాజు ఈ సాహసం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు. తన ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేశాడు.
టాక్సిక్ రిలీజ్ డేట్. ఫెస్టివల్ ధమాకా
'టాక్సిక్' సినిమాను మార్చి 19న (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ తేదీని చాలా పక్కాగా ప్లాన్ చేశారు. ఉగాది, గుడి పడ్వా, రంజాన్ పండగలు కలిసి వచ్చేలా ఆ వీకెండ్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఈ సినిమా విశేషాల విషయానికి వస్తే గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేసింది. మూవీకి ఆమెతో కలిసి యష్ స్టోరీ అందించడం విశేషం. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు పలు ఇతర భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేయనున్నారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఆ మధ్య యష్ పోషించిన రాయ పాత్రను పరిచయం చేస్తూ తీసుకొచ్చిన టీజర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కారులో సెక్స్, మితిమీరిన వైలెన్స్ పై విమర్శలు వచ్చాయి. ఓ లేడీ డైరెక్టర్ ఇంత బోల్డ్ గా ఎలా తీసిందన్న ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


