మన శంకర వర ప్రసాద్ గారు నుంచి ఫ్లైయింగ్ హై ఫుల్ వీడియో సాంగ్.. సింగర్ ఎవరో కాదు.. చిరు మేనకోడలే

సంక్రాంతి 2026 బ్లాక్ బస్టర్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ సినిమా నుంచి తాజాగా ఫ్లైయింగ్ హై వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట పాడింది ఎవరో కాదు.. స్వయానా చిరంజీవి మేనకోడలు కావడం విశేషం. 

Published on: Jan 21, 2026 12:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన శంకర వర ప్రసాద్ గారు.. పండగకి వస్తున్నారు అంటూ సంక్రాంతి 2026 బరిలో నిలిచిన చిరంజీవి బ్లాక్ బస్టర్ కొట్టారు. జనవరి 12న రిలీజైన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీ. ఈ చిత్రం నుంచి ఫ్లైయింగ్ హై వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

మన శంకర వర ప్రసాద్ గారు స్టిల్ (x/Shine_Screens)
మన శంకర వర ప్రసాద్ గారు స్టిల్ (x/Shine_Screens)

మన శంకర వర ప్రసాద్ గారు సాంగ్

చిరంజీవి, నయనతార జంటగా నటించిన మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ సినిమాలోని ఫ్లైయింగ్ హై వీడియో సాంగ్ ను ఇవాళ (జనవరి 21) రిలీజ్ చేశారు మేకర్స్. స్కూల్ లో పీఈటీ టీచర్ గా వెళ్తారు చిరంజీవి. అక్కడ తన పిల్లలను చూసి ఫుల్ ఖుష్ అవుతారు. ఆ సందర్భంలోనే పిల్లలతో కలిసి చిరు చేసే సందడే ఈ ఫ్లైయింగ్ హై సాంగ్.

చిరు మేనకోడలు

పెప్పీ బీట్ తో, ఇంగ్లీష్ లిరిక్స్ తో సాగుతున్న ఫ్లైయింగ్ హై పాటను చిరంజీవి మేనకోడలు నైరా పాడింది. ఆమె చిరంజీవి సొంత సోదరి మాధవి కుమార్తె. సింగపూర్ లోని మ్యూజిక్ కాలేజీలో నైరా పాప్ మ్యూజిక్ నేర్చుకుంటోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలోని ఫ్లైయింగ్ హై పాటతోనే తెలుగులో సింగర్ గా డెబ్యూ చేసింది నైరా.

మ్యూజికల్ హిట్

మన శంకర వర ప్రసాద్ గారు మూవీ మ్యూజికల్ హిట్ గానూ నిలిచింది. ఇందులోని పాటలన్నీ అదిరిపోయాయి. మీసాల పిల్ల, శశిరేఖ, మాస్ విక్టరీ సాంగ్.. ఇలా పాటలన్నీ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్. ఫ్లైయింగ్ హై సాంగ్ ను కిట్టు విస్సాప్రగడ రాశారు.

కెరీర్ హిట్

చిరంజీవి కెరీర్ లోనే మన శంకర వర ప్రసాద్ గారు హైయ్యస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా రిలీజైంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. సైరా నరసింహా రెడ్డి రికార్డును బ్రేక్ చేసింది. మరోవైపు ఇండియాలో రూ.170 కోట్లకు పైగా నెట్ వసూళ్లు ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి డైరెక్టర్. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు.

మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో వింటేజీ చిరంజీవి మళ్లీ కనిపించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతి పండక్కి ఫ్యామిలీస్ మొత్తం కలిసి థియేటర్లలోకి వెళ్లాయి. దీంతో అత్యంత వేగంగా రూ.300 కోట్లు కలెక్ట్ చేసిన రీజినల్ ఫిల్మ్ గా మన శంకర వర ప్రసాద్ గారు నిలిచింది.