Kiara Advani:నా కూతురు ఎంతమందితోనైనా డేటింగ్ చేయొచ్చు-పెళ్లి చేసుకోకున్నా ఓకే-కియారా అద్వానీ వైరల్ వీడియో-నెటిజన్లు ఫైర్
Kiara Advani: బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ బోల్డ్ అండ్ సెన్సేషనల్ కామెంట్లు చేసింది. తన కూతురికి ఒకరినే డేటింగ్ చేయాలని చెప్పనని, ఎలాంటి ఆంక్షలు విధించబోమని ఆమె పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Kiara Advani: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) ఏం చేసినా, ఏం మాట్లాడినా అది నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ గ్లోబల్ బ్యూటీ.. తాజాగా తన కూతురి గురించి బోల్డ్ కామెంట్లు చేసింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ మారింది. కియారా కామెంట్లపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

కియారా అద్వానీ కామెంట్లు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తాజాగా రాజ్ షమాని నిర్వహించే ‘ఫిగరింగ్ ఔట్’ అనే పాడ్ కాస్ట్ లో పాల్గొంది. ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కియారా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సమాజంలోని అబ్బాయిల గురించి మీ అమ్మాయికి ఏం చెప్తారని హోస్ట్ ప్రశ్నించాడు. దీనికి కియారా అద్వానీ చెప్పిన ఆన్సర్ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
ఎంతమందితోనైనా డేటింగ్
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు ఓ కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు సరయా. భవిష్యత్ లో తన కూతురు ఎలా ఉండాలో అనే దాని గురించి మాట్లాడుతూ కియారా బోల్డ్ కామెంట్లు చేసింది. ఆమె ఎంత మందితోనైనా డేటింగ్ చేయొచ్చని, పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదని కియారా పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.
ఆంక్షలు పెట్టను
‘‘ఆమె (సరయా) ఫుల్ లైఫ్ చూడాలని అనుకుంటా. ఆమె ఒక్క వ్యక్తినే డేట్ చేయాలని లేదు. ఆమెపై ఎలాంటి ఆంక్షలు విధించను. పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోని లేదంటే లేదు. డేట్ చేసిన ప్రతి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు అలాగే జరిగింది. చివరకు సరైన వ్యక్తి దొరికాడు’’ అని కియారా పేర్కొంది.
ఇవన్నీ పాఠాలే
‘‘ఎదిగే క్రమంలో ఈ రిలేషన్ షిప్స్ అన్నీ పాఠాలను నేర్పిస్తాయి. మనల్ని మనిషిగా మారుస్తాయి. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకుంటారు’’ అని కియారా అద్వానీ చెప్పుకొచ్చింది.
తీవ్ర విమర్శలు
కియారా అద్వానీ చేసిన కామెంట్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక తల్లి తన పిల్లలకు చెప్పే మాటలేనా ఇవి అంటూ నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఇదేనా ఫెమినిజం అని ప్రశ్నిస్తున్నారు. "భారతీయ సంస్కృతిలో ఇలాంటి మాటలు ఏంటి?" అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు కియారా అద్వానీ బోల్డ్ కామెంట్ల వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


