Toxic Censor: మితిమీరిన శృంగార‌ం..హద్దుల్లేని విధ్వంసం..టాక్సిక్ మెడపై సెన్సార్ కత్తెర..ప్రొడక్షన్ హౌస్ రిస్క్ చేసిందా?

Toxic Censor: అయితే శృంగార‌ సీన్లు.. లేదంటే వైలెన్స్ విధ్వంసం.. ఇప్పుడు యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ మూవీ నుంచి ఇలాంటి టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ గ్లింప్స్, లేడీస్ అండ్ లేడీస్ వీడియోల్లో మితిమీరిన బోల్డ్ నెస్ కారణంగా టాక్సిక్ కు సెన్సార్ చిక్కులు తప్పవనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

Published on: Jul 2, 2026, 12:03:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Toxic Censor: కేజీఎఫ్ తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ రాక్ స్టార్ యశ్. ఈ మూవీస్ తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘టాక్సిక్’ అంటూ థియేటర్లకు రాబోతున్నాడు. కానీ ఈ మూవీ గ్లింప్స్ నుంచి లేడీస్ అండ్ లేడీస్ వీడియో వరకూ అంతా వివాదాస్పదమే. ఈ మూవీలోని మితిమీరిన శృంగార‌ సీన్లు, హద్దుల్లేని విధ్వంసకర వైలెన్స్ ఇందుకు కారణమని చెప్పొచ్చు.

మితిమీరిన శృంగార‌ం..హద్దుల్లేని విధ్వంసం..టాక్సిక్ మెడపై సెన్సార్ కత్తెర (x)
మితిమీరిన శృంగార‌ం..హద్దుల్లేని విధ్వంసం..టాక్సిక్ మెడపై సెన్సార్ కత్తెర (x)

ఇప్పుడు ఇదే ట్రెండ్

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువ వైలెన్స్ ఉంటేనో లేదా మితిమీరిన శృంగార‌ం ఉంటేనో మూవీ హిట్ అవుతుందనే టాక్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో ఈ ఫార్ములాను ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు టాక్సిక్ కూడా ఇదే లిస్ట్ లో చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వేరే లెవల్ బోల్డ్

టాక్సిక్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడే వివాదం భగ్గున రేకెత్తింది. ఈ గ్లింప్స్ లో కార్లో ఓ అమ్మాయితో యశ్ చేసే శృంగార‌ం మరీ మితిమీరిందనే విమర్శలు వచ్చాయి. ఈ కాంట్రవర్సీ ఉండగానే ఇప్పుడు లేడీస్ అండ్ లేడీస్ అంటూ మూవీ హీరోయిన్లను పరిచయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో అయితే బోల్డ్ మోతాదు మరింత పెంచారు. అందుకే ఇది సినిమానా? లేదా బూతు చిత్రమా? అనే విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

సెన్సార్ కత్తి

మూవీ ప్రమోషన్స్ కోసం టీమ్ బాగానే వీడియోలు రిలీజ్ చేస్తుంది. అయితే ఈ వీడియోలు చూసిన తర్వాత టాక్సిక్ కు అసలు సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందా? సీబీఎఫ్ సీ ఎన్ని కట్లు చెబుతుంది? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యశ్ టాక్సిక్ మూవీ ఆగస్టు 26న థియేటర్లలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో టాక్సిక్ పై సెన్సార్ కత్తెర వేలాడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

అదే ప్రొడక్షన్ హౌస్

కన్నడ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పుడు నెమ్మదిగా తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లోకి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో దూసుకొస్తోంది. టాక్సిక్ మూవీని ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది.

అయితే కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు సెన్సార్ బోర్డుతో ఇబ్బందులు ఎదురవడం కొత్తేమీ కాదు. గతంలో ఈ సంస్థ బ్యాకింగ్‌తో వచ్చిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ పరంగా లేట్ అవుతోంది. ఇంకా రిలీజ్ కు కూడా నోచుకోలేదు. ఆ తర్వాత కన్నడ పీరియాడిక్ డ్రామా ‘కేడీ – ది డెవిల్’ సైతం దాని రా అండ్ రస్టిక్ కంటెంట్ కారణంగా ఇలాంటి సెన్సార్ ఇంట్రెస్ట్‌నే క్రియేట్ చేసింది.

‘టాక్సిక్’ డోస్ మితిమీరుతోందా?

గోవా బ్యాక్‌డ్రాప్‌లో 1940 నుండి 1970 మధ్య కాలంలో సాగే క్రూరమైన మాఫియా, డ్రగ్స్ సామ్రాజ్యం కథతో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ టాక్సిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి టాప్ హీరోయిన్లు పవర్‌ఫుల్ రోల్స్ పోషిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా 100 రోజుల రీషూట్ జరుపుకుంటోందంటూ వచ్చిన రూమర్లను కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ఖండించింది. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, ఎలాంటి రీషూట్లు జరగడం లేదని స్పష్టం చేసింది. అయితే మితిమీరిన వయొలెన్స్, బోల్డ్ నెస్ వల్ల సెన్సార్ వద్ద కట్స్ పడకుండా నిర్మాతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More