Toxic: లేడీస్ అండ్ లేడీస్‌.. యశ్ టాక్సిక్ నుంచి హీరోయిన్ల స‌ర్‌ప్రైజ్ వీడియో.. బోల్డ్ సీన్లలో తగ్గేదేలే!

Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘యశ్’ మూవీ నుంచి అదిరే సర్ ప్రైజ్ వచ్చింది. ఈ సినిమాలోనే హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చిన వీడియో తెగ వైరల్ గా మారింది. ఫస్ట్ నుంచి బోల్డ్ సీన్లతో ట్రెండింగ్ లో ఉన్న ఈ మూవీ నుంచి వచ్చిన ఈ వీడియోలోనూ అలాంటి సన్నివేశాలు ఉన్నాయి.

Published on: Jul 1, 2026, 12:59:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Toxic: కేజీఎఫ్ సిరీస్ తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యశ్ అప్ కమింగ్ మూవీ ‘టాక్సిక్’ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ సినిమా మేకర్స్ ఒక వినూత్నమైన ప్రమోషనల్ వీడియోతో సర్ ప్రైజ్ చేశారు. కేవలం ఈ మూవీలోని హీరోయిన్ల పవర్‌ఫుల్ క్యారెక్టర్లను హైలైట్ చేస్తూ కట్ చేసిన ఈ ‘లేడీస్ & లేడీస్’ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది.

టాక్సిక్ హీరోయిన్ల పవర్ ఫుల్ వీడియో.. తగ్గని బోల్డ్ సీన్లు (x)
టాక్సిక్ హీరోయిన్ల పవర్ ఫుల్ వీడియో.. తగ్గని బోల్డ్ సీన్లు (x)

పిల్లలు దూరంగా ఉండండి

టాక్సిక్ లేడీస్ అండ్ లేడీస్ వీడియో ప్రారంభమే ఒక సెన్సేషనల్, ప్రోవోకేటివ్ ఏజ్ బేస్డ్ డిస్ క్లెయిమర్ తో మొదలైంది. "పిల్లలు.. దూరంగా ఉండండి. తల్లిదండ్రులు.. మీ పిల్లలు దీనికి దూరంగా ఉండేలా చూసుకోండి. తాత ముత్తాతలు.. మీ ఓన్ రిస్క్‌పైనే చూడండి" అంటూ సినిమాలోని వైల్డ్ అండ్ డార్క్ కంటెంట్‌ను ముందే హింట్ ఇచ్చారు.

ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఒక లేడీ వాయిస్‌ ఓవర్.. "ప్రేమ అనేది మహిళలను రాక్షసులుగా మారుస్తుంది. దాని వెనుక ఉన్న మోసాన్ని గ్రహిస్తే అది ఒక అందమైన భ్రమ" అంటూ సినిమా థీమ్‌ను పరిచయం చేసింది.

నయనతార, కియారా అద్వానీల లుక్స్!

సాధారణ కమర్షియల్ సినిమాల్లోలా హీరోయిన్లను కేవలం గ్లామర్ లేదా రొమాంటిక్ పాత్రలకే పరిమితం చేయకుండా, ఈ డార్క్ వరల్డ్‌లో వారిని అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించారని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.

  • నయనతార (Nayanthara): బైక్ పై సీరియస్ గా చూస్తూ పవర్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చింది.
  • కియారా అద్వానీ (Kiara Advani): నిప్పులు చిమ్మే ఆర్టిస్టుల మధ్య హై-గ్లామర్ క్లోజప్ షాట్‌లో మెరిసింది.
  • తార సుతారియా (Tara Sutaria): ఒక స్మోకీ, అప్‌స్కేల్ లాంజ్‌లో క్లాసిక్ ఫెమ్ ఫాటాలే లుక్‌లో కనిపించింది.
  • రుక్మిణి వసంత్ (Rukmini Vasanth): ఒక వింటేజ్ మెట్లపై చేతిలో గన్ పట్టుకుని పక్కా యాక్షన్ మోడ్‌లోకి షిఫ్ట్ అయ్యింది.
  • హ్యూమా ఖురేషి (Huma Qureshi): లెదర్ జాకెట్స్ వేసుకున్న ఒక గోత్-పంక్ గ్యాంగ్‌కు లీడర్‌గా డైనింగ్ హాల్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించింది.

రంగంలోకి రాకింగ్ స్టార్

రెట్రో-గోతిక్ స్టైల్, పల్సింగ్ ఎలక్ట్రానిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సాగిన ఈ వీడియో లాస్ట్ లో.. ఒక బార్ రూమ్ ఫైట్‌గా మారుతుంది. ఈ చిత్రంలో యశ్ పోషిస్తున్న సెంట్రల్ క్యారెక్టర్ 'రాయా' (Raya) కౌంటర్ వెనుక నిలబడి కూల్‌గా తన షర్ట్ చేతులు మడుస్తూ లేడీస్ ను చూసి.. "మీరు ఒకరొకరుగా వస్తారా.. లేదా అందరూ కలిసే వస్తారా?" అంటూ తన సిగ్నేచర్ స్టైల్‌లో డైలాగ్ విసురుతాడు.

బోల్డ్ సీన్లు

ఆ వెంటనే గ్లాస్ ముక్కలు పగిలిపోవడం, ఫాస్ట్-కట్ హ్యాండ్-టు-హ్యాండ్ కంబాట్ యాక్షన్ సీక్వెన్స్ నెటిజన్లకు పూస్‌బంప్స్ తెప్పిస్తాయి. చివర్లో మళ్లీ అదే లేడీ వాయిస్ ఓవర్.. "కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది లేడీస్.. మగవాళ్లు, వారి గన్స్ తో చేసే విన్యాసాలను మర్చిపోకండి" అంటూ గన్ లోడ్ చేసే సౌండ్‌తో వీడియో ముగుస్తుంది. దానికి ముందు స్పీడ్ గా బోల్డ్ సీన్లూ వచ్చి వెళ్లిపోతాయి. మొత్తానికి ఈ వీడియో మూవీపై మరింత హైప్ పెంచేలా ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More