Akkineni Akhil: ఈ సారి సినిమా మాట్లాడుతుందన్న అఖిల్.. లెనిన్ ట్రైలర్ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? హిట్ ఖాయమేనా?
Akkineni Akhil: అక్కినేని అఖిల్, లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో అఖిల్ ఎమోషనల్ అయ్యాడు. ఈ సారి సినిమానే మాట్లాడుతుందన్నాడు. మరి అఖిల్ కాన్ఫిడెన్స్ కు కారణం ఏంటీ? లెనిన్ ట్రైలర్ పబ్లిక్ టాక్ ఎలా ఉంది? అనేది చూసేయండి.
Akkineni Akhil: అక్కినేని వారసుల్లో నాగ చైతన్య ఏమో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. కానీ అఖిల్ మాత్రం ఓ సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేసినా ఫలితం మాత్ర దక్కలేదు. ఈ నేపథ్యంలో లెనిన్ చిత్రంపై అఖిల్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.

సినిమా మాట్లాడుతుంది
తాజాగా లెనిన్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో మాట్లాడుతూ అఖిల్ ఎంతో కాన్ఫిడెన్స్ చూపించాడు. అలాగే ఎమోషనల్ కూడా అయ్యాడు.
"నేను ఈరోజు ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నా. ఈసారి నేను కాదు, నా సినిమా మాట్లాడుతుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్పను. నేను నిద్రపోయి రెండు రోజులు అయింది. అయినా కూడా మీ అందరినీ చూడగానే నాలో తెలియని ఎనర్జీ వచ్చింది’’ అని అఖిల్ చెప్పాడు.
సారీ బ్రదర్
‘‘జూలై 10 వరకూ డే అండ్ నైట్ పని చేయడానికి మీరిచ్చిన ఈ శక్తి సరిపోతుంది. మిమ్మల్ని చూసి ఇవాళ నేను మనస్ఫూర్తిగా ఆక్సిజన్ పీల్చినట్టుగా ఫీల్ అవుతున్నాను. నా నుంచి థియేటర్లలోకి సినిమా వచ్చి మూడేళ్లు అయింది. అందుకు సారీ బ్రదర్, నన్ను క్షమించండి. మనస్ఫూర్తిగా గుండెపై చెయ్యి పెట్టి చెప్తున్నా.. ఈ సారి నన్ను నమ్మండి" అని అభిమానులను ఉద్దేశించి అఖిల్ చెప్పాడు.
ఆ కాన్పిడెన్స్ కు కారణం
ప్రతి మూవీ రిలీజ్ కు ముందు ఈవెంట్లలో హీరోలు తమ సినిమాల గురించి గొప్పగానే చెప్పుకుంటారు. కానీ ఇలా చెప్పిన సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన మూవీసే ఎక్కువ. ఇప్పుడు లెనిన్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అఖిల్ కూడా కాన్ఫిడెన్స్ తో మాట్లాడాడు. అయితే ఈ మూవీ ట్రైలర్ చూసిన ఆడియన్స్ అఖిల్ మాటల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ లేదంటున్నారు. ఈ మూవీ కోసం అతను పడిన కష్టం హిట్ అందుస్తుందని కామెంట్లు పెడుతున్నారు.
నెటిజన్ల రియాక్షన్
లెనిన్ ట్రైలర్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. ఈ ట్రైలర్ పై సోషల్ మీడియాలో ఎక్కువ భాగం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రా అండ్ రస్టిక్ లుక్ లో అఖిల్ అదిరిపోయాడనే కామెంట్లు వస్తున్నాయి. ఈ మూవీతో అఖిల్ కెరీర్ లో కచ్చితంగా హిట్ దక్కుతుందని చెప్తున్నారు.
మాస్ ఫార్ములా
‘ఏజెంట్’ సినిమాతో అల్ట్రా-స్టైలిష్ యాక్షన్ జోనర్ ట్రై చేసి దెబ్బతిన్న అఖిల్.. ఈసారి టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా అయిన ‘రూరల్ రా అండ్ రస్టిక్’ జోనర్‌ను ఎంచుకున్నాడు. ప్రస్తుత ట్రెండ్‌లో బి అండ్ సి సెంటర్స్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి ఈ జోనర్ చాలా ప్లస్ అవుతుంది.
నిర్మాత నాగవంశీ జడ్జ్‌మెంట్, బిజినెస్ ప్లానింగ్ టాలీవుడ్‌లో చాలా క్రేజీగా ఉంటుంది. నాగార్జునతో కలిసి సితార సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేయడంతో.. థియేటర్ల అలొకేషన్, ప్రమోషన్స్ పరంగా ‘లెనిన్’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
రిలీజ్ డేట్
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఒక ఇంటెన్స్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం 'లెనిన్'. కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం జూలై 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


