Lenin Trailer: నాగార్జున వాయిస్ ఓవర్.. అఖిల్ మాస్ వీరంగం.. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో లెనిన్.. ట్రైలర్ రిలీజ్

Lenin Trailer: అక్కినేని అఖిల్ మాస్ వీరంగంతో ఊగిపోతూ లెనిన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. నాగార్జున వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. చిత్తూరు బ్యాక్‌డ్రాప్ లో వస్తున్న మరో సినిమాగా లెనిన్ నిలవనుంది.

Published on: Jun 30, 2026, 20:32:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Lenin Trailer: అక్కినేని యువ వారసుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఎట్టకేలకు బాక్సాఫీస్ దగ్గర తన అసలు సిసలైన మాస్ పవర్ చూపించడానికి రెడీ అయ్యాడు. గత కొన్ని రోజులుగా రకరకాల వాయిదాలు ఎదుర్కొంటున్న అతని మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin) జులై 10న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాతో అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయమనే నమ్మకంతో అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారు.

Lenin Trailer: నాగార్జున వాయిస్ ఓవర్.. అఖిల్ మాస్ వీరంగం.. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో లెనిన్.. ట్రైలర్ రిలీజ్
Lenin Trailer: నాగార్జున వాయిస్ ఓవర్.. అఖిల్ మాస్ వీరంగం.. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో లెనిన్.. ట్రైలర్ రిలీజ్

వైజాగ్ వేదికగా 'లెనిన్' ట్రైలర్ లాంచ్..

లెనిన్ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను వైజాగ్‌లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఓపెన్ అవుతూనే ఫుల్ ఇంటెన్స్, వైలెంట్ యాక్షన్ మోడ్‌తో మొదలైంది. ముఖ్యంగా కింగ్ అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసిన విధానం థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం.

చిత్తూరు జిల్లాలోని 'శ్రీరామపురం' అనే పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. ఆ ఊరిని అందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారని, అక్కడ ఒక్క చుక్క రక్తం కూడా నేలపై పడకూడదనే ఒక బలమైన నమ్మకం బ్యాక్‌డ్రాప్‌తో సినిమాను చాలా ఆసక్తికరంగా మలిచినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

మహాభారతం రేంజ్ డ్రామా.. రొమాన్స్ అండ్ యాక్షన్ బ్లెండ్

ట్రైలర్ మొదట్లోనే శ్రీరామపురం ఊరి విశేషాలను చూపించిన తర్వాత, కథ మెల్లగా లీడ్ రోల్స్ మధ్య సాగే క్యూట్ రూరల్ లవ్ స్టోరీ లోకి మారుతుంది. అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య వచ్చే కొన్ని సరదా సంభాషణలు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి.

అయితే ఆ తర్వాత కథ సీరియస్ మోడ్ లోకి మారుతుంది. విలన్లు హీరోకు ఎంతో దగ్గరైన ఓ వ్యక్తిని టార్గెట్ చేయడంతో కథ ఒక్కసారిగా హై-వోల్టేజ్ యాక్షన్ జోన్‌లోకి వెళ్తుంది. ఈ సినిమా కథాంశం ఆధునిక మహాభారతాన్ని పోలి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ చివరి నిమిషంలో రొమాన్స్, ఎమోషన్, యాక్షన్‌ను బ్లెండ్ చేసిన విధానం డైరెక్టర్ విజన్‌కు అద్దం పడుతోంది.

గ్రామీణ యువకుడిగా అఖిల్.. శివాజీ విలనిజం

ఈ సినిమాలో అఖిల్ లుక్, అతని రగ్గడ్ బాడీ లాంగ్వేజ్ ఒక పల్లెటూరి ఊరమాస్ కుర్రాడిలా పక్కాగా సెట్ అయ్యాయి. యాక్షన్ సీన్స్ లో అఖిల్ చూపించిన రౌద్రరూపం మరో లెవెల్ లో ఉంది. మొదట హీరోయిన్‌ను వదిలేయాలంటూ విలన్లను ఎంతో అమాయకంగా బ్రతిమిలాడే హీరో, ఆ తర్వాత ఒక్కసారిగా వైలెంట్ మోడ్‌లోకి మారి నరమేధం సృష్టించే సీన్ అద్భుతంగా పండింది.

భాగ్యశ్రీ బోర్సే కూడా ఓ గ్రామీణ యువతి లుక్‌లో చాలా అందంగా కనిపిస్తూ అఖిల్‌తో మంచి కెమిస్ట్రీ పండించింది. ఇక మరో సీనియర్ నటుడు శివాజీ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండటం సినిమాకు మరో అసెట్ కానుంది. దానికి తోడు స్టార్ కంపోజర్ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి యాక్షన్ ఫ్రేమ్‌ను ఎలివేట్ చేసింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ డ్రామాకు మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడు. ట్రైలర్ కట్ చూస్తుంటే జులై 10న బాక్సాఫీస్ దగ్గర అక్కినేని వారసుడి వేట గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More