Nagarjuna: 40 ఏళ్ల నాగార్జున సినీ కెరీర్.. తండ్రికి అఖిల్ ఇచ్చిన స‌ర్‌ప్రైజ్‌ ఏంటో తెలుసా? థాంక్యూ కింగ్ అంటూ చై ఎమోషనల్

Nagarjuna: కింగ్ అక్కినేని నాగార్జున సినీ ప్రస్థానంలో మే 23 అత్యంత ప్రత్యేకమైన రోజుగా నిలిచింది. ఈ రోజుతో సినీ ఇండస్ట్రీలో ఆయన 40 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు. ఆయన మొదటి సినిమా 'విక్రమ్', క్లాసిక్ హిట్ 'మనం' విడుదలైన రోజు ఇదే కావడంతో అక్కినేని కుటుంబం ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటోంది.

Published on: May 23, 2026, 17:10:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు, కింగ్ అక్కినేని నాగార్జున సినీ ప్రస్థానంలో మే 23వ తేదీకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అక్కినేని అభిమానులకు ఈ రోజు ఒక పండగ లాంటిది. నాగార్జున హీరోగా వెండితెరకు పరిచయమైన రోజు, అలాగే అక్కినేని మూడు తరాల నటులు కలిసి నటించిన అద్భుత కావ్యం 'మనం' విడుదలైన రోజు కూడా ఇదే కావడం విశేషం.

40 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న అక్కినేని నాగార్జున (x/chaitanya akkineni)
40 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న అక్కినేని నాగార్జున (x/chaitanya akkineni)

నాగార్జున 40 ఏళ్లు

కింగ్ అక్కినేని నాగార్జున తన సినీ కెరీర్ లో 40 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా అరుదైన డబుల్ మైలురాయిని పురస్కరించుకుని నాగార్జునతో పాటు ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భావోద్వేగ సందేశాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఎప్పటికీ మర్చిపోలేని తేదీ

తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ నాగార్జున ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు.

"నా సినీ జీవితం మొదలైన రోజిది. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని తేదీ మే 23. నా తండ్రి, లెజెండరీ నటుడు ఏఎన్నార్ నటించిన చివరి చిత్రం 'మనం' సినిమాను నిర్మించి, విడుదల చేసే గొప్ప భాగ్యం ఈ రోజే నాకు దక్కింది. నాన్నతో పాటు నా కుమారులతో కలిసి ఒకే స్క్రీన్‌పై నటించడాన్ని నా జీవితంలో దక్కిన అత్యున్నత గౌరవంగా భావిస్తున్నా" అని నాగార్జున ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరించాడు.

విక్రమ్ మూవీ

ఇదే రోజున 40 ఏళ్ల క్రితం నాగార్జున విక్రమ్ మూవీ రిలీజ్ అయింది. తన మొదటి సినిమా 'విక్రమ్' ఇదే రోజున విడుదలైందని, ప్రేక్షకులను అలరించేందుకు, వారి ప్రేమాభిమానాలను పొందేందుకు ఆ రోజే పునాది పడిందని నాగ్ చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్లుగా తన వెన్నంటి నిలిచిన అభిమానులందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు. భవిష్యత్తులో ఇలాంటి మే 23 వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నన్నానని చెప్పాడు.

చై ఎమోషనల్

"తొలి సినిమా 'విక్రమ్' నుంచి నేటి వరకు నాన్న ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్ సెట్ చేస్తూ నాతో పాటు ఎంతో మంది యువ దర్శకులకు, భావితరాలకు ఆయన గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. థాంక్యూ కింగ్" అని నాగచైతన్య ఎమోషనల్ పోస్టు పెట్టాడు.

తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిపోయిన 'మనం' సినిమా విడుదలై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ అద్భుతమైన చిత్రంలో భాగం కావడం తన అదృష్టమని చైతూ ఆనందం వ్యక్తం చేశాడు. ఏఎన్నార్ జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని గుర్తుచేసుకున్నాడు.

లెనిన్ టీజర్

అక్కినేని అఖిల్ తన తండ్రి నాగార్జునకు లెనిన్ టీజర్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇవాళ ఆ టీజర్ రిలీజ్ అయింది. ఈ సర్‌ప్రైజ్ తనను ఎంతో ఆకట్టుకుందని నాగార్జున తెలిపాడు. అఖిల్ ఇచ్చిన సర్ ప్రైజ్ చూస్తుంటే మనసుకు చాలా హాయిగా ఉందని చెప్తూ ఆ వీడియో లింక్‌ను నాగార్జున అభిమానులతో పంచుకున్నాడు. "మనోడు వస్తున్నాడు...." అంటూ అఖిల్ రాబోయే ప్రాజెక్టును ఉద్దేశించి నాగార్జున చేసిన కామెంట్ ఇప్పుడు అభిమానుల్లో సరికొత్త జోష్ నింపుతోంది.

ట్రెండ్ సెట్టర్ గా

1986 మే 23న 'విక్రమ్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఆ తర్వాత గీతాంజలి, శివ, అన్నమయ్య వంటి వైవిధ్యమైన చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు. సరిగ్గా అదే తేదీన 2014లో విడుదలైన 'మనం' చిత్రం అక్కినేని కుటుంబానికి మాత్రమే కాకుండా, తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ డబుల్ సెలబ్రేషన్స్‌తో అక్కినేని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: అక్కినేని నాగార్జునకు మే 23 ఎందుకు అంత ప్రత్యేకం?

జవాబు: మే 23వ తేదీన నాగార్జున నటించిన మొదటి సినిమా 'విక్రమ్' విడుదలవడమే కాకుండా, ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'మనం' సినిమా కూడా ఇదే రోజున విడుదలైంది. అందుకే ఈ తేదీ ఆయన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైనది.

ప్రశ్న: 'మనం' సినిమా ప్రత్యేకత ఏమిటి?

జవాబు: ఈ చిత్రంలో అక్కినేని మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు (ANR), నాగార్జున, నాగచైతన్య కలిసి నటించారు. ఇది ఏఎన్నార్ నటించిన చివరి చిత్రం కావడం విశేషం.

ప్రశ్న: తండ్రి మైలురాయిపై నాగచైతన్య ఎలా స్పందించారు?

జవాబు: తన తండ్రి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, సెట్ చేసిన ట్రెండ్స్ తనతో పాటు ఎంతో మంది మేకర్స్‌కు, భావితరాలకు స్ఫూర్తినిచ్చాయని నాగచైతన్య కొనియాడాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More