Naga Chaitanya: శోభిత రాకతో.. ఆమె నా లేడీ లక్.. భార్యపై ప్రేమ కురిపించేసిన నాగ చైతన్య
Naga Chaitanya: తన భార్య శోభిత ధూళిపాళపై నాగ చైతన్య ప్రశంసలు కురిపించేశాడు. ఆమెను లేడీ లక్ అని పేర్కొన్నాడు. రీసెంట్ గా తండేల్ మూవీకి గాను తెలంగాణ గద్దర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డుకు నాగ చైతన్య ఎంపికైన విషయం తెలిసిందే.
తండేల్ సినిమాతో హీరో నాగ చైతన్య బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కమర్షియల్ గా హిట్ కావడంతో పాటు నాగ చైతన్య యాక్టింగ్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో నటనకు గాను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో నాగ చైతన్య బెస్ట్ యాక్టర్ పురస్కారానికి ఎంపికయ్యాడు. దీనిపై రియాక్టైన నాగ చైతన్య తన భార్య శోభితాపై ప్రశంసలు కురిపించాడు.

ఫస్ట్ మూవీ
2024లో నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్న తర్వాత నాగ చైతన్య ఫస్ట్ మూవీ 'తండేల్'. ఈ చిత్రం అతని కెరీర్‌లో అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది, ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.
లేడీ లక్
నాగ చైతన్య భార్యగా శోభిత ధూళిపాళ రాగానే తండేల్ లాంటి హిట్ అతనికి దక్కింది. దీంతో శోభిత అతనికి 'లేడీ లక్'గా మారిందా అని అడిగినప్పుడు నాగ చైతన్య అవుననే బదులిచ్చాడు. “మీ పునాది చాలా ముఖ్యమని నేను ఎప్పుడూ చెబుతుంటా. ఎందుకంటే ఇంట్లో ఉన్న బలం, శక్తి మీ వృత్తి జీవితంలోకి కూడా వస్తుంది. అవును, శోభిత ఖచ్చితంగా నా లేడీ లక్ గా మారింది” అని నాగ చైతన్య చెప్పాడు.
సినిమాల గురించి
‘‘మా ఇద్దరికీ సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. కాబట్టి ఎప్పుడూ వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఒకరి ప్రాజెక్టుల గురించి ఒకరం మాట్లాడుకుంటాం. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? ఏ సినిమాలు వస్తున్నాయి? అని చర్చిస్తాం’’ అని తన భార్యతో గడిపే టైమ్ గురించి నాగ చైతన్య వెల్లడించాడు.
తండేల్ మూవీ
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో 'తండేల్' చిత్రంలో నటనకు గాను నాగ చైతన్య ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నాగ చైతన్య 'తండేల్ రాజు' అనే మత్స్యకారుడి పాత్ర పోషించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామానికి చెందిన మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులనూ, విమర్శకులనూ ఆకట్టుకుంది.
చాలా ప్రత్యేకం
“తండేల్ నాకు చాలా ప్రత్యేకమైంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన మత్స్యకారుల నిజ జీవిత కథ. వారి వీరోచిత కథ స్ఫూర్తిదాయకం. వారిని అర్థం చేసుకోవడానికి వారితో సమయం గడిపాను, వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నా’’ అని నాగ చైతన్య చెప్పాడు.
తాను కలిసిన మత్స్యకారుల జీవితాలు, వారి కష్టాలతో తనకు అనుబంధం ఏర్పడిందని నాగ చైతన్య తెలిపాడు. “వారి కథలకు, వారి జీవితాలకు నేను చాలా దగ్గరయ్యా. ఆ శక్తి అంతా సినిమాలో ప్రతిఫలించింది. తండేల్ రాజుగా మారడం నాకు చాలా సవాలుతో కూడుకున్న ప్రక్రియ. ఇప్పుడు ప్రభుత్వం గుర్తించడం అద్భుతంగా ఉంది” అని నాగ చైతన్య అన్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


